Skip to content
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో బలంగా డైవర్షన్ పాలిటిక్స్… సోషల్ మీడియా అరెస్టుల వెనక ఉన్న అసలు మతలబు ఏంటి..?

Prajapaksham 08 Jul 2026 0 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
ఏపీలో బలంగా డైవర్షన్ పాలిటిక్స్… సోషల్ మీడియా అరెస్టుల వెనక ఉన్న అసలు మతలబు ఏంటి..?

image: x.com

ప్రస్తుతం ఏపీలో రాజకీయాల్లో యూట్యూబర్ల అరెస్టులతో కలకలం రేగుతోంది అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రశ్న యూట్యూబర్ రావణ అరెస్టు, అలాగే తెలంగాణకు చెందిన మరొక జర్నలిస్టును ఏపీ పోలీసులు అరెస్టు చేయడం వంటి అంశాలు ఇప్పుడు ఏపీ వార్తల్లో ప్రధానంగా కనిపిస్తున్నాయి. అయితే వీటి వెనక బలమైన డైవర్షన్ పాలిటిక్స్ ఉన్నాయా అంటే అవుననే రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది ఓవైపు అమరావతి నిర్మాణంలో ఒక అడుగు ముందుకు వేస్తే నాలుగు అడుగులు వెనక్కి వేయడం అనే పరిస్థితి కొనసాగుతోంది. మరోవైపు పోలవరం ముందుకు సాగడం లేదు. ఈ రెండు కూడా కూటమి ప్రభుత్వం చేసిన భారీ హామీలు అని చెప్పవచ్చు ఎందుకంటే 2028 నాటికి అమరావతి ఒక దశ పూర్తి కావాల్సి ఉంది లేకపోతే 2029 ఎన్నికల్లో ఇంకా పేపర్ల పైనే ఉందని వైసిపి ఎదురుదాడి చేసే అవకాశం ఉంటుంది.

అలాగే పోలవరం కూడా 2029 నాటికి పూర్తవ్వాలి లేకపోతే అది కూడా ప్రతిపక్షాల చేతిలో అస్త్రం అయ్యే అవకాశం ఉంది. అంతకన్నా ముందు ప్రజల్లో ఈ రెండు ప్రాజెక్టుల నుంచి దృష్టి మరల ఒక పెద్ద రాజకీయ దుమారం తెరపైకి రావాల్సి ఉంది. దీని దృష్టిలో ఉంచుకొని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల అరెస్టులు జరుపుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ప్రస్తుతం తెలుగుదేశం సోషల్ మీడియా తెలివిగా ఈ చర్చలో పాల్గొనడం లేదు. ప్రశ్న రావణ్ అరెస్టు విషయంలో తెలుగుదేశం సోషల్ మీడియా కూడా సైలెంట్ గా ఉంది. కేవలం జనసేన మాత్రమే రావణ్ అరెస్టు విషయంలో సోషల్ మీడియా వేదికగా యాక్టివ్ గా ఉంది. దీని వెనుకనే అసలైన రాజకీయం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రశ్న రావణ్ ణ్ అరెస్టు విషయంలో ఏం జరిగినా అది మొత్తం జనసేన ఖాతాలోకే వెళుతుందని తమకు సంబంధం లేదని తెలుగుదేశం పార్టీ జనాల్లోకి ఒక బలమైన మెసేజ్ పంపేందుకు సిద్ధంగా ఉంది.

ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల అరెస్టుల గురించి అటు జనాల్లో మిశ్రమ స్పందనలు వచ్చేలా సోషల్ మీడియా టీములు కూడా అలాగే పని చేస్తున్నాయి. ఇక ఈ మొత్తం వ్యవహారంలో వైసిపి పార్టీ సోషల్ మీడియా కూడా సమాన దూరం పాటిస్తోంది. ఇవన్నీ కూటమి కుమ్ములాటలో భాగమని వైసిపి సోషల్ మీడియా వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఇదంతా జరుగుతోందని ఒక పద్ధతి ప్లానింగ్ ప్రకారమే జరుగుతున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో వైసీపీ సోషల్ మీడియా ఎక్కువగా మావిగన్ పైనే ఫోకస్ చేయాలని అప్పుడు కృష్ణ గుంటూరు జిల్లాల్లో తమకు వ్యతిరేకంగా మారిన వర్గాలు అనుకూలమయ్యే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నాయి. అలాగే పోలవరం విషయంలో కూడా జరుగుతున్న అవినీతిని జాప్యాన్ని జనాల్లోకి తీసుకెళ్లాలని వైసీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ డైవర్షన్ పాలిటిక్స్ వల్ల మెగా డీఎస్సీ విషయంలో రావాల్సినంత మైలేజ్ జనాల్లోకి వెళ్లలేదు అనే అసంతృప్తి వైసిపి వర్గాల్లో కనిపిస్తోంది. తెలుగుదేశం చేస్తున్న ఈ డైవర్షన్ పాలిటిక్స్ కు ఎలా కౌంటర్ చేయాలని వైసిపి మల్ల గుల్లలు పడుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ట్యాగ్‌లు: andhra pradesh TDP YSRCP