Credit Card Complete Guide: క్రెడిట్ కార్డ్ అంటే ఏంటి..? క్రెడిట్ కార్డు వల్ల కలిగే లాభనష్టాలు ఇవే..
Credit Card Complete Guide: క్రెడిట్ కార్డ్ అంటే ఏంటి..? క్రెడిట్ కార్డు వల్ల కలిగే లాభనష్టాలు ఇవే..
Credit Card తీసుకోవడం మంచిదేనా?
ప్రస్తుత కాలంలో క్రెడిట్ కార్డు అనేది ప్రతి ఒక్కరు ఉపయోగిస్తున్నటువంటి ఒక ఆర్థిక సాధనంగా చెప్పవచ్చు. క్రెడిట్ కార్డు జేబులో ఉంది అంటే మీ జేబులో డబ్బు ఉన్నట్టే. ఉదాహరణకు, మీరు ఒక లక్ష రూపాయల లిమిట్ ఉన్నటువంటి క్రెడిట్ కార్డును కలిగి ఉన్నారు. అంటే మీ జేబులో లక్ష రూపాయలు ఉన్నట్లే. కానీ అందులో మీరు ఎంత అయితే ఖర్చు చేస్తారో, అంత మొత్తం నెల తిరిగేలోగా తిరిగి చెల్లించినట్లయితే మళ్లీ లక్ష రూపాయలు మీ చేతిలో ఉంటాయి. వడ్డీ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. అంటే క్రెడిట్ కార్డు ద్వారా మీకు వడ్డీ కూడా చెల్లించనవసరం లేని రుణం లభిస్తుంది.
సరిగ్గా వాడుకుంటే క్రెడిట్ కార్డు వల్ల అనేక ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ముఖ్యంగా షాపింగ్ చేసే సమయంలో క్రెడిట్ కార్డు ఉపయోగించినట్లయితే మీకు డిస్కౌంట్ సైతం లభించే అవకాశం ఉంటుంది. చాలా ఈ-కామర్స్ కంపెనీల్లో క్యాష్‌బ్యాక్ ఆఫర్స్, అలాగే రీడీమ్ పాయింట్స్ రూపంలో డిస్కౌంట్లను పొందే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు షాపింగ్ చేసినప్పుడు క్రెడిట్ కార్డుపై క్యాష్‌బ్యాక్ ఆఫర్లు కూడా లభిస్తాయి.
Credit Card ఎలా వాడాలి..
క్రెడిట్ కార్డు వాడకం విషయానికి వచ్చినట్లయితే సాధారణంగా క్రెడిట్ కార్డును మీ యుటిలిటీ అవసరాల కోసం ఉపయోగించాలి అంటే నిత్యవసర వస్తువుల కొనుగోళ్ల కోసం అలాగే పెట్రోల్ పోయించుకోవడానికి, దాంతోపాటు క్రెడిట్ కార్డును ఉపయోగించి మీరు ముందుగానే క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించి ఆ తర్వాత నెల నెల క్రెడిట్ కార్డు బిల్లును కట్టుకోవడం ద్వారా మీరు పూర్తిస్థాయిలో డిజిటల్ పేమెంట్ వ్యవస్థలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. దీని వల్ల మీకు ఒక ఆర్థిక క్రమశిక్షణ కూడా లభిస్తుంది. అత్యవసర సమయాల్లో క్రెడిట్ కార్డు అనేది చాలా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు ఏదైనా ఒక మెడికల్ ఎమర్జెన్సీ లాంటివి ఎదురైనప్పుడు చేతిలో డబ్బు లేని సమయంలో మంచి లిమిట్ ఉన్నటువంటి క్రెడిట్ కార్డును ఉపయోగించి మీరు బిల్లులను చెల్లించవచ్చు.
Lifetime Free Credit Cards
క్రెడిట్ కార్డు పైన ప్రతి సంవత్సరం మెయింటెనెన్స్ చార్జీలు కట్టాల్సి ఉంటుంది. కానీ కొన్ని బ్యాంకులు మాత్రం లైఫ్ టైం రికార్డ్స్ ఆఫర్ చేస్తూ ఉంటాయి అయితే ఇందులో నిర్ణీత మొత్తం వరకు షాపింగ్ లేదా క్రెడిట్ లిమిట్ ఉపయోగించాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే మీకు లైఫ్ టైం ఫ్రీ ఆఫర్ అందిస్తారు.
Credit Card Charges Explained
క్రెడిట్ కార్డు చార్జెస్ విషయానికి వచ్చినట్లయితే, ప్రతి సంవత్సరం కొన్నిసార్లు ప్రాసెసింగ్ చార్జీల పేరిట కంపెనీలు లేదా బ్యాంకులు క్రెడిట్ కార్డుల పైన వసూలు చేస్తుంటాయి. అయితే క్రెడిట్ కార్డు చార్జెస్ విషయానికి వచ్చినట్లయితే మీరు సకాలంలో బిల్లులను చెల్లించినప్పుడు ఎలాంటి చార్జీలు పడవు. కానీ ఎప్పుడైతే మీరు నిర్ణీత తేదీ గడువు, ముగిసిన తరువాత బిల్లు చెల్లించినట్లయితే దానిపై మీకు లేట్‌ఫీ చార్జెస్ తో పాటు వడ్డీ కూడా అధికంగా పడే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీకు 20 నుంచి 30% వరకు వడ్డీ పడే అవకాశం ఉంటుంది అలాగే దీనికి లేట్ ఫీ కూడా అదనంగా పడే వీలుంటుంది
Credit Card Bill Delay అయితే ఏమవుతుంది..?
క్రెడిట్ కార్డు బిల్లులను మీరు లేటుగా చెల్లించినట్లయితే, పెద్ద మొత్తంలో జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. జరిమానా తో పాటు వడ్డీ కూడా అధికంగా ఉంటుంది. క్రెడిట్ కార్డు ఉపయోగించి మీరు క్యాష్ గనుక విత్ డ్రా చేసుకున్నట్లయితే దానిపై మీరు అధికంగా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డు బిల్లు ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా చెల్లించేయాలి లేకపోతే అదనపు చార్జీలతో పాటు మీకు క్రెడిట్ స్కోర్ కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది.