Ayyanna Patrudu Retirement: రాజకీయాలకు గుడ్‌బై.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనంటున్న అయ్యన్నపాత్రుడు..
Ayyanna Patrudu Retirement
Ayyanna Patrudu Retirement: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్, సీనియర్ నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు సంచలన ప్రకటన చేశారు. తాను ప్రత్యక్ష రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లు, వచ్చే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేశారు. నర్సీపట్నంలో నిర్వహించిన తన జన్మదిన వేడుకల వేదికగా ఆయన ఈ సంచలన నిర్ణయాన్ని వెల్లడించారు.
వయసు పైబడటం వల్లే విశ్రాంతి తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపిన అయ్యన్నపాత్రుడు, అసెంబ్లీ స్పీకర్‌గా తనకు మిగిలి ఉన్న మూడేళ్ల పదవీకాలంలో నర్సీపట్నం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి, సంక్షేమ పనులకు పూర్తి ప్రాధాన్యమిస్తానని ప్రకటించారు. గత 31 ఏళ్లుగా తన పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించే సాంప్రదాయాన్ని స్థానికుల సహకారంతో కొనసాగిస్తున్నట్లు ఆయన గుర్తుచేశారు.
మరోవైపు, సెప్టెంబరు 6న నర్సీపట్నంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, అనకాపల్లి ఎంపీ చింతకాయల విజయ్ ఆధ్వర్యంలో ‘బీసీ ఐక్య వేదిక సదస్సు’ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కూటమి ప్రభుత్వం 34 శాతం రిజర్వేషన్లు కల్పించి, విద్యా ఉద్యోగ రంగాల్లో సముచిత ప్రాధాన్యం ఇస్తుంటే, ప్రధాన ప్రతిపక్షం వైసీపీ మాత్రం బీసీల హక్కులపై అనవసర రాజకీయాలు చేస్తూ కుట్రలు పన్నుతోందని టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ కుట్రలను తిప్పికొట్టేందుకు బీసీ వర్గాలన్నీ ఐక్యంగా ముందుకు రావాలని ఈ సందర్భంగా నేతలు పిలుపునిచ్చారు.
- CM Revanth Reddy: ఉపాధ్యాయులకు రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్.. సమస్యల పరిష్కారానికి హామీ..
- Telangana Politics: అసెంబ్లీకి రాని కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలి.. పొన్నం ప్రభాకర్ డిమాండ్.. BRS అధినేత వైఖరికి నిరసనగా 6న ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ మహా ధర్నా..
- Ayyanna Patrudu Retirement: రాజకీయాలకు గుడ్‌బై.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనంటున్న అయ్యన్నపాత్రుడు..
- నిరుద్యోగ యువతకు ఏదీ భవిష్యత్తు?
- Editorial on Untouchability in India: అంటరానితనం ఇంకానా?