Konda Surekha Controversy: కొండా సురేఖను పదవి నుంచి తొలగించడం బాధాకరమైన విషయమే.. స్పందించిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్..
Mahesh Kumar Goud Says Congress Will Win 100 Seats in Next Elections
Konda Surekha Controversy: తెలంగాణ మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తప్పించడంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తొలిసారిగా స్పందించారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా ఉన్న కొండా సురేఖను పదవి నుంచి తొలగించడం బాధాకరమైన విషయమే అయినప్పటికీ.. కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణే అత్యంత ప్రాధాన్యమైన అంశమని ఆయన స్పష్టం చేశారు. పార్టీ నిబంధనలు, క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఎంతటి వారికైనా చర్యలు తప్పవని ఏఐసీసీ స్పష్టమైన సంకేతాలు ఇచ్చిందని ఆయన తెలిపారు.
కొండా సురేఖ కుమార్తె సుస్మిత పార్టీ, ప్రభుత్వంపై చేసిన విమర్శనాత్మక వ్యాఖ్యలను సురేఖ తక్షణమే ఖండించకపోవడాన్ని ఏఐసీసీ నాయకత్వం అత్యంత తీవ్రంగా పరిగణించిందని మహేష్ గౌడ్ వివరించారు. పీసీసీ క్రమశిక్షణ కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగానే అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. పార్టీలో అంతర్గత అసంతృప్తులు లేదా సమస్యలు ఉంటే చర్చించడానికి పీసీసీ, ఐఏసీసీ ఇన్‌ఛార్జ్ వంటి అనేక వేదికలు అందుబాటులో ఉన్నాయని.. వాటిని వదిలి బహిరంగంగా మాట్లాడటాన్ని పార్టీ క్షమించరాని తప్పగా భావిస్తుందని హెచ్చరించారు.
కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని తాము ఆశిస్తున్నామని, భవిష్యత్తులో ఆమెకు పార్టీ పరంగా తగిన అవకాశాలు లభిస్తాయని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరినీ రాజకీయంగా బ్లాక్‌మెయిల్ చేయాల్సిన అవసరం లేదని, క్రమశిక్షణ చర్యలు కేవలం ఏఐసీసీ మార్గదర్శకాల ప్రకారమే జరిగాయని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ బీసీ వర్గాలకు అండగా ఉంటుందని, రాబోయే రోజుల్లో బీసీ నాయకత్వానికి మరింత ప్రాధాన్యత ఇస్తుందని హామీ ఇచ్చారు.
- Teachers’ Day 2026 Speech Ideas: నేడు టీచర్స్ డే సందర్భంగా మంచి స్పీచ్ ఇవ్వాలి అనుకుంటున్నారా..అయితే చక్కటి స్పీచ్ మీకోసం..
- Teachers Day Wishes On September 5: మీ గురువులు, స్నేహితులకు సెప్టెంబర్ 5 టీచర్స్ డే సందర్భంగా విషెస్ మీ కోసం…
- Happy Teachers Day 2026 Telugu Wishes: మీ బంధుమిత్రులు, స్నేహితులకు టీచర్స్ డే విషెస్ షేర్ చేయండి..
- Happy Teachers Day 2026 Wishes In Telugu: మీ టీచర్లు, స్నేహితులు, బంధు మిత్రులకు Messages, Quotes, Images రూపంలో Whatsapp Status, Facebook కోసం గ్రీటింగ్స్ మీకోసం..
- El Niño 2027 Alert: ప్రపంచానికి పెనుముప్పు తీసుకొస్తున్న చిన్న బాలుడు.. భారీ వర్షాలు, కరువు, తీవ్ర వేడి ముప్పు.. WMO తీవ్ర హెచ్చరిక