Skip to content
ఆంధ్రప్రదేశ్ › వార్తలు

AP Local Body Polls: ఏపీ పంచాయితీ ఎన్నికల ఫలితాలు ఇవే.. 2,539 స్థానాల్లో కూటమి మద్దతుదారులు విజయం.. 1,110 స్థానాలు కైవసం చేసుకున్న వైసీపీ మద్దతుదారులు

jagan 27 Nov 2026 1 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
AP Local Body Polls: ఏపీ పంచాయితీ ఎన్నికల ఫలితాలు ఇవే.. 2,539 స్థానాల్లో కూటమి మద్దతుదారులు విజయం.. 1,110 స్థానాలు కైవసం చేసుకున్న వైసీపీ మద్దతుదారులు

మహారాష్ట్రలో బీజేపీ కూటమి ఎన్నికల చోరీ

AP Local Body Polls: ఆంధ్రప్రదేశ్‌లో హోరాహోరీగా సాగిన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. పార్టీ రహితంగా బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఈ ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమి బలపరిచిన అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యం కనబరిచి మెజార్టీ స్థానాలను కైవసం చేసుకున్నారు. గ్రామీణ ఓటర్లు కూటమి పనితీరుకే పట్టం కట్టడంతో పల్లెల్లో కూటమి శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

తొలి దశలో ఎన్నికలు నిర్వహించిన మొత్తం 3,949 పంచాయతీల్లో ఏకంగా 760 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. వెల్లడైన ఫలితాల సరళి ప్రకారం కూటమి మద్దతుదారులు 2,539 స్థానాల్లో జయకేతనం ఎగురవేశారు. ఇందులో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు 2,325, జనసేన 189, బీజేపీ 25 పంచాయతీలను దక్కించుకున్నాయి. మరోవైపు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 1,110 స్థానాల్లో గెలుపొందగా, ఇతరులు , రెబల్స్ కలిపి 294 స్థానాల్లో విజయం సాధించారు.

రాష్ట్రవ్యాప్తంగా కూటమి ఆధిపత్యం స్పష్టంగా కనిపించినప్పటికీ.. కొన్ని ప్రాంతాల్లో వైసీపీ గట్టి పోటీనిచ్చింది. తిరుపతి జిల్లాలోని 404 పంచాయతీల్లో వైసీపీ మద్దతుదారులు ఎక్కువ స్థానాలు సాధించగా.. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 66 స్థానాలకు గాను వైసీపీ 29, కూటమి 26 పంచాయతీలను గెలుచుకున్నాయి. కృష్ణా, ఏలూరు జిల్లాలు , గన్నవరం నియోజకవర్గ పరిధిలోనూ వైసీపీ గట్టి పోటీ ఇచ్చింది.

రాయలసీమలో తిరుపతి మినహా మిగిలిన జిల్లాల్లో కూటమి తన పట్టును నిరూపించుకుంది. ముఖ్యంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంతూరు బలపనూరులో టీడీపీ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించడం రాజకీయంగా విశేషంగా నిలిచింది. ఈ ఎన్నికల ఫలితాలపై జగన్ స్పందిస్తూ, అధికార కూటమి పోలీసులు , ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి ఎన్నికలను ప్రభావితం చేసిందని ఆరోపించారు. అయితే, ప్రజలు తమ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకే మద్దతు పలికారని కూటమి వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి.

రాష్ట్రంలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 29న జరగనుంది.