Hyderabad MLC Polls: టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆకాశ్ కొల్లూరు.. హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్ స్థానానికి అభ్యర్థిని ప్రకటించిన కల్వకుంట్ల కవిత..
Kavitha comments on KTR: గుంటనక్క మైండ్ గేమ్ లో పడ్డావు...కేటీఆర్ కు కల్వకుంట్ల కవిత వార్నింగ్...
Hyderabad MLC Polls: రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచే తమ పార్టీ తుది అభ్యర్థుల జాబితాను తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) అధినేత్రి కల్వకుంట్ల కవిత అధికారికంగా ప్రకటించారు. ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పార్టీ అభ్యర్థిగా ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఆకాశ్ కొల్లూరు పేరును ఆమె ఖరారు చేశారు. ఇప్పటికే వరంగల్ – ఖమ్మం – నల్గొండ స్థానానికి బీసీ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్‌ను బరిలోకి దించిన కవిత, ఇప్పుడు రెండో స్థానంలోనూ బీసీ వర్గానికి చెందిన విద్యావంతుడికే అవకాశం కల్పించి తన మార్కు సామాజిక వ్యూహాన్ని అమలు చేశారు.
గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా ఎంపికైన ఆకాశ్ కొల్లూరుకు జాతీయ మీడియా రంగంలో దాదాపు 20 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. గతంలో ఆయన ఇండియా టుడే, రిపబ్లిక్ టీవీ, సీఎన్ఎన్ న్యూస్ 18, డైలీ హంట్ వంటి ప్రముఖ జాతీయ వార్తా సంస్థల్లో కీలక బాధ్యతలను నిర్వర్తించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (HPS)లో ప్రాథమిక విద్యను పూర్తి చేసిన ఆకాశ్, అనంతరం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్‌తో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. జాతీయ స్థాయి మీడియా వేదికలపై హైదరాబాద్ , తెలంగాణ ముఖచిత్రాన్ని ప్రతిబింబించిన అనుభవం, విద్యార్హతలు , బీసీ సామాజికవర్గ నేపథ్యం ఉన్నందున పట్టభద్ర ఓటర్ల పూర్తి మద్దతు తమకే లభిస్తుందని టీఆర్‌ఎస్ నాయకత్వం ధీమా వ్యక్తం చేస్తోంది.
వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఎమ్మెల్సీ స్థానంలో కాకతీయ యూనివర్సిటీ పీహెచ్‌డీ గ్రహీత, తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ పోటీ చేస్తుండగా, హైదరాబాద్ స్థానంలో ఆకాశ్ కొల్లూరు బరిలో నిలవడంతో టీఆర్‌ఎస్ పార్టీ పోటీ చేస్తున్న రెండు పట్టభద్రుల స్థానాల్లోనూ బీసీ వర్గాలకే ప్రాతినిధ్యం దక్కినట్లయింది. ఇక ఎన్నికల నిర్వహణను సమర్థవంతంగా వేగవంతం చేసేందుకు గాను హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి అబ్జర్వర్ , కో-ఆర్డినేటర్‌గా పార్టీ సీనియర్ నేత డాక్టర్ చిట్నేని రఘును కవిత నియమించారు. అదేవిధంగా, రెండు ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఎన్నికల వ్యూహాలు, ప్రచార సరళి , వార్ రూమ్ ఇన్‌ఛార్జ్‌గా ప్రముఖ న్యాయవాది రామ్ కల్యాణ్ చల్లాకు బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.