Skip to content
వినోదం › వార్తలు

నెట్‌ప్లిక్స్‌లో టాక్‌ షో ‘మెగావర్స్‌’ షూటింగ్‌ ప్రారంభం

Prajapaksham 30 Oct 2026 1 నిమిషాల పఠనం వినోదం
నెట్‌ప్లిక్స్‌లో టాక్‌ షో ‘మెగావర్స్‌’ షూటింగ్‌ ప్రారంభం

Chiranjeevi

మెగాస్టార్‌ అంటేనే వైవిధ్యానికి మరో పేరు. దశాబ్దాలుగా తన అద్భుతమైన నటనతో వెండితెరపై కోట్లాది మంది ప్రేక్షకులను అలరిస్తున్న మెగాస్టార్‌ చిరంజీవి.. ఇప్పుడు నెట్‌ప్లిక్స్‌ అరంగేట్రంతో మరో ఆసక్తికరమైన ప్రయాణానికి సిద్ధమయ్యారు. ‘మెగావర్స్‌’ పేరుతో రూపొందుతున్న ఈ షో ద్వారా ఆయన డిజిటల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు.గ్లోబల్‌ స్ట్రీమింగ్‌ ప్లాట్ఫామ్‌ నెట్‌ప్లిక్స్‌ ప్రసారం కానున్న ఈ ప్రత్యేకమైన టాక్‌ షోలో చిరంజీవి తనదైన చరిష్మా, హాస్యం, విభిన్నమైన ఆలోచనా విధానంతో ప్రేక్షకులను అలరించనున్నారు. ఆసక్తికరమైన సంభాషణలు, అద్భుతమైన కథలు, ఎన్నో కొత్త విషయాల ఆవిష్కరణతో ఈ షో సాగనుంది.‘మెగావర్స్‌’లో ప్రేక్షకులతో తరతరాలుగా ప్రత్యేకమైన అనుబంధాన్ని కొనసాగిస్తున్న చిరంజీవి.. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, విభిన్న తరాలకు చెందిన సార్స్‌తో ముచ్చటించనున్నారు. తన సహజమైన ఆత్మీయత, సందర్భానికి తగ్గట్టుగా స్పందించే ప్రత్యేకమైన శైలి, ఆకట్టుకునే వ్యక్తిత్వంతో ఈ వేదికపై సందడి చేయనున్నారు. ఈ షోకు మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు.గోల్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఆటమ్‌ మీడియా వెంచర్స్‌, ఎస్‌ ఓ ఎల్‌ ప్రొడక్షన్‌ ఎల్‌ ఎల్‌ పీ సంయుక్తంగా ఈ షోను నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ‘మెగావర్స్‌’ షూటింగ్‌ జరుగుతోంది. ఈ షోకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.