Ganesh Immersion Duty: వీడియో ఇదిగో.. గణేశ్ నిమజ్జనం విధులకు వచ్చి ఎస్ఐ మృత్యువాత.. బైక్ ఢీకొని ఎస్ఐ వెంకన్న మృతి
Ganesh Immersion Duty
Ganesh Immersion Duty: గణేశ్ నిమజ్జన బందోబస్తు విధులలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన కొత్తగూడెం టూ టౌన్ సబ్ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) కున్సోతు వెంకన్న (57) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందారు. నిమజ్జన బందోబస్తు విధి నిర్వహణలో ఉండగా ఈ విషాదం చోటుచేసుకోవడంతో పోలీస్ శాఖలో తీవ్ర శోకఛాయలు అలముకున్నాయి.
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన వెంకన్న కొత్తగూడెంలో విధులు నిర్వర్తిస్తుండగా, ఇటీవలే ఆయనకు మహబూబాబాద్‌కు బదిలీ అయింది. అయితే బదిలీకి ముందే గణేశ్ నిమజ్జన బందోబస్తు విధులు కేటాయించడంతో ఆయన హైదరాబాద్‌కు వచ్చారు. బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ట్యాంక్‌బండ్ సమీపంలో విధులు నిర్వర్తిస్తుండగా వేగంగా వచ్చిన ఒక ద్విచక్ర వాహనం ఆయనను బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో వెంకన్న తల, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన తోటి పోలీసులు ఆయనను నగరంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హనుమకొండలోని మెడికవర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా, బుధవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఆయన పరిస్థితి విషమించి కన్నుమూశారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న హైదరాబాద్ పోలీసులు ప్రమాదానికి కారణమై పరారైన ద్విచక్రవాహనదారుడిని గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తూ విచారణ వేగవంతం చేశారు. మహబూబాబాద్ బదిలీపై వెళ్లాల్సిన వెంకన్న, గణేష్ నిమజ్జన విధులు ముగిసిన తర్వాత అక్కడ రిలీవ్ కావాల్సి ఉంది. ఇంతలోనే ఈ ఘోర ప్రమాదం జరగడంతో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన అల్లుడు మణుగూరు బీటీపీఎస్‌లో ఏడీఈగా విధులు నిర్వర్తిస్తున్నారు.
- Bank Strike Alert: కేంద్ర ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. సెప్టెంబర్ 25నే జీతాలు, పెన్షన్లు.. కేంద్రం కీలక ఆదేశాలు
- YS Jagan-CPI Meeting: వైఎస్ జగన్‌తో సమావేశమైన సీపీఐ నేతలు.. సెప్టెంబర్ 26న జరగబోయే రౌండ్‌టేబుల్ సమావేశానికి మాజీ సీఎంకు ఆహ్వానం..
- Danam Nagender: మళ్లీ ఖైరతాబాద్ నుంచే పోటీ చేస్తా..ఏ పార్టీ నుంచి అనేది ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాతే వెల్లడిస్తా.. దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు..
- Super El Niño: ప్రపంచానికి పెను ముప్పు.. ఫిబ్రవరి నాటికి 4.51 లక్షల మరణాలు.. క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ హెచ్చరిక..
- Ganesh Immersion Duty: వీడియో ఇదిగో.. గణేశ్ నిమజ్జనం విధులకు వచ్చి ఎస్ఐ మృత్యువాత.. బైక్ ఢీకొని ఎస్ఐ వెంకన్న మృతి