Hyderabad Ganesh Laddu Auction: గణేష్ లడ్డు రికార్డుల మోత.. కీర్తి రిచ్మండ్ విల్లాస్‌లో రూ.1.01 కోట్లు పలికిన వినాయకుడి లడ్డూ..
Hyderabad Ganesh Laddu Auction
Hyderabad Ganesh Laddu Auction: గణేశ్ ఉత్సవాల సందర్భంగా భాగ్యనగరంలో లడ్డూ వేలం పాటల కోలాహలం తారస్థాయికి చేరింది. రాజేంద్రనగర్ సర్కిల్ బండ్లగూడ జాగీర్ పరిధిలోని ప్రతిష్టాత్మక ‘కీర్తి రిచ్మండ్ గేటెడ్ కమ్యూనిటీ’ (విల్లాస్) లో మంగళవారం అర్ధరాత్రి వరకు ఉత్కంఠభరితంగా జరిగిన వేలంలో స్వామివారి లడ్డూ ఏకంగా రూ. 1.01 కోట్లు పలికింది. ప్రతి ఏటా పోటాపోటీగా సాగే ఈ వేలంలో ఈసారి ‘శక్తిమాన్ బృందం’ సభ్యులు లడ్డూను కైవసం చేసుకున్నారు.
ఈ విల్లాస్ నివాసితులు ‘ఆర్పీ దియా చారిటబుల్ ట్రస్ట్’ ఆధ్వర్యంలో నాలుగు గ్రూపులుగా విడిపోయి ప్రతి ఏటా పోటీ పడుతుంటారు. గతేడాది (2025) ఇదే కమ్యూనిటీలో లడ్డూ రికార్డు స్థాయిలో రూ. 2.31 కోట్లు పలికిన సంగతి తెలిసిందే. ఆ రికార్డుతో పోలిస్తే ఈసారి ధర కొద్దిగా తక్కువగా నమోదైనప్పటికీ.. రూ. కోటి మార్కును దాటడం విశేషం. లడ్డూ వేలం ద్వారా సమకూరే నిధులను వీరు సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగిస్తారు. స్వామివారి ప్రసాదాన్ని దక్కించుకోవడం వల్ల శుభం, ఐశ్వర్యం కలుగుతాయనే నమ్మకంతో భక్తులు వేలంలో పాల్గొంటున్నారు.
గేటెడ్ కమ్యూనిటీలలో లడ్డూ వేలం పాటలు కోట్లలో మారుమోగుతున్న నేపథ్యంలో.. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 1994లో కేవలం రూ. 450తో ప్రారంభమైన బాలాపూర్ లడ్డూ వేలం ప్రస్థానం, గత మూడేళ్లలో రూ. 30 లక్షల మార్కును దాటింది. గతేడాది (2025) ఈ లడ్డూను లింగాల దశరథ్ గౌడ్ రూ. 35 లక్షలకు కైవసం చేసుకోగా, 2024లో రూ. 30.01 లక్షలు లభించింది.
ఈ ఏడాది పూరీ జగన్నాథ ఆలయ నమూనాలో ఏర్పాటు చేసిన అత్యద్భుతమైన మండపంలో కొలువైన బాలాపూర్ గణపయ్య 21 కిలోల విశిష్ట లడ్డూ ఈసారి ఎలాంటి కొత్త రికార్డును సృష్టిస్తుందోనని నగరవాసులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ వేలం ప్రక్రియ ముగిసిన అనంతరం ప్రారంభమయ్యే గణపతి శోభాయాత్రతోనే నగర నిమజ్జనోత్సవాలు ఊపందుకుంటాయి.
- Bank Strike Alert: కేంద్ర ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. సెప్టెంబర్ 25నే జీతాలు, పెన్షన్లు.. కేంద్రం కీలక ఆదేశాలు
- YS Jagan-CPI Meeting: వైఎస్ జగన్‌తో సమావేశమైన సీపీఐ నేతలు.. సెప్టెంబర్ 26న జరగబోయే రౌండ్‌టేబుల్ సమావేశానికి మాజీ సీఎంకు ఆహ్వానం..
- Danam Nagender: మళ్లీ ఖైరతాబాద్ నుంచే పోటీ చేస్తా..ఏ పార్టీ నుంచి అనేది ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాతే వెల్లడిస్తా.. దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు..
- Super El Niño: ప్రపంచానికి పెను ముప్పు.. ఫిబ్రవరి నాటికి 4.51 లక్షల మరణాలు.. క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ హెచ్చరిక..
- Ganesh Immersion Duty: వీడియో ఇదిగో.. గణేశ్ నిమజ్జనం విధులకు వచ్చి ఎస్ఐ మృత్యువాత.. బైక్ ఢీకొని ఎస్ఐ వెంకన్న మృతి