డిజె టిల్లు లాగే ‘అనుమాన పక్షి’
Anumana Pakshi
డిజె టిల్లు’తో దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన విమల్ కృష్ణ.. మరో ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అనుమాన పక్షి’. రాగ్ మయూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా.. హ్యూమర్, క్యారెక్టర్స్, కథనంలో పూర్తిగా డిఫరెంట్ గా ఉండబోతోంది. చిలక ప్రొడక్షన్స్ సమర్పణలో రాజీవ్ చిలక, రాజేష్ జగ్తియాని, హిరాచంద్ దండ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్ 25న ‘అనుమాన పక్షి’ థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు.ప్రెస్ మీట్ లో హీరో రాగ్ మయూర్ మాట్లాడుతూ నటుడిగా ప్రతిక్షణం మెరుగవడానికి ప్రయత్నించాను. యాక్టింగ్ నా ఊపిరి. ఇప్పుడు ‘అనుమాన పక్షి’తో హీరోగా వస్తున్నాను. ఇది నాకు చాలా ఆనందంగా ఉంది. డిజే టిల్లు పెద్ద హిట్ తర్వాత విమల్ కృష్ణ నాతో సినిమా చేయాలనుకున్నారు. డైరెక్టర్ విమల్ కృష్ణ ఈ కథ చెప్పినప్పుడు నాకు చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. ఎందుకంటే ఇలాంటి కథ ఎక్కడా లేదు. సెప్టెంబర్ 25న ఒక అద్భుతమైన సినిమా మీ ముందుకు రాబోతోంది అన్నారు. డైరెక్టర్ విమల్ కృష్ణ మాట్లాడుతూ ‘డిజె టిల్లు’ మీకు ఎలా సర్ప్రైజ్ చేసిందో, ఈ సినిమా కూడా మిమ్మల్ని 100% సర్ప్రైజ్ చేస్తుంది. ఈ జర్నీలో నాకు చాలా సపోర్ట్ చేసిన స్టేజ్ మీద ఉన్న అందరికీ థాంక్యూ. చోటా గారు ఎడిటింగ్‌కు వచ్చిన తర్వాత ‘అనుమాన పక్షి’ జర్నీ చాలా ఈజీ అయింది. శ్రీ చరణ్ మరోసారి చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు అని చెప్పారు. హీరోయిన్ మెరీన్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల, ప్రొడ్యూసర్ రాజీవ్ చిలక , ప్రొడ్యూసర్ మేఘా , ఎడిటర్ చోటా ప్రసాద్ పాల్గొన్నారు.
డైరెక్టర్ విమల్ కృష్ణ
- Court Contempt Case: కోర్టు ధిక్కరణ కేసు.. సైబరాబాద్ సీపీ రమేష్ రెడ్డి, మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డికి జైలు శిక్ష.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
- Government Holiday List 2027: రిపబ్లిక్ డే నుంచి క్రిస్మస్ వరకు.. 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే..
- UP Elections 2027: యూపీ ఎన్నికల సమరం.. మేనిఫెస్టో విడుదల చేసిన ఎస్పీ.. బీజేపీకి పోయే రోజు దగ్గర పడిందంటూ అఖిలేష్ యాదవ్ తీవ్ర విమర్శలు..
- UP Elections 2027: యూపీ ఎన్నికల్లో సెగలు పుట్టిస్తున్న సహారన్పూర్.. ఎస్పీ-కాంగ్రెస్ వివాదానికి కేంద్ర బిందువుగా మారిన జిల్లా మీద ఎందుకు అంత క్రేజ్..
- 26/11 Mumbai Attacks: 18 ఏళ్లైనా వీడని ముంబై 26/11 మిస్టరీ.. ఆ రహస్య ‘మేజర్ జనరల్ సాహబ్’ ఎవరు.. ముంబై ఉగ్రదాడులకు ముందు కసబ్‌ను ఎందుకు కలిసారు..