Skip to content
జాతీయం › వార్తలు

భారత రాజ్యాంగ ఆత్మలో భావధార

Prajapaksham 26 Nov 2026 1 నిమిషాల పఠనం జాతీయం
భారత రాజ్యాంగ ఆత్మలో భావధార

Indian Constitution

రవీంద్రనాథ్‌ జె

రాజ్యాంగం అత్యున్నత స్థాయి చట్టం. ఈ రాజ్యాంగ సూత్రాలకు అందరం బద్ధులై ఉండాలి. భారత రాజ్యాంగం మౌలిక స్వభావం పట్ల, దానిలో ఉన్న ‘సెక్యులర్‌’, ‘సోషలిస్ట్‌’ పదాల పట్ల హిందూత్వ వాదులకు ఉన్న వ్యతిరేక అభిప్రాయం వారి మాటల్లో, అంత కన్నా ముఖ్యంగా ఆచరణలో బయటకు వెలువడుతున్న తరుణంలో అసలు పీఠిక లోని పదాలు, వాటి చేర్పు వెనుక ఉన్న రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్‌ ఆలోచనాధార ప్రభావం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్ర స్తుతం రాజ్యాంగ పీఠికలో సార్వభౌమ, సామ్యవాద, లౌకిక , ప్రజాస్వామ్య, గణతంత్ర వ్యవస్థ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం, ఆలోచనలో, భావ ప్రకటనలో , విశ్వాసంలో, ఆరాధనలో స్వేచ్ఛ, అందరికీ హోదా, అవకాశాలను పెంపొందించే సమానత్వం, వ్యక్తి గౌరవం, జాతి ఐక్యత, సమగ్రతను నిర్ధారించే సౌభ్రాతృత్వం అనే మాటలున్నాయి.1976లో 42 వ సవర ణలో ‘సెక్యులర్‌’, ‘సోషలిస్టు’ పదాలను పీఠికలో చేర్చారు. ఆకాష్‌ సింగ్‌ రాథోర్‌ రాసిన అంబేద్కర్‌ యొక్క పీఠిక : భారత రాజ్యాంగం యొక్క రహస్య చరిత్ర అనేపుస్తకం పీఠిక రచన న్యాయం, స్వేచ్ఛ , సమానత్వం, సౌభ్రాతృత్వం ,వ్యక్తి గౌరవం, జాతి అనే పదాల చేరికలో ఉన్న అంబేద్కర్‌ ఆలోచనాధారను ఎంతో పరిశోధనాత్మకంగా వివరించింది. పీఠిక నెహ్రూ రాజ్యాంగ సభలో 1946 డిసెంబర్‌ 13 న ప్రతిపాదించిన లక్ష్యాల తీర్మానంపై ఆధారపడింది అనే అభిప్రాయం ప్రాబల్యంలో ఉంది. అయితే నెహ్రూ లేక రాజ్యాంగ సభ మొత్తం కన్నా సభకు సమర్పించిన అంతిమ పాఠం వెనుక అంబేద్కర్‌ ఆలోచన ఉంది అని తాజా పరిశోధకుల భావన. ఎన్నో చర్చలు, మార్పుల తర్వాత 21 ఫిబవ్రరి1948 న అంబేద్కర్‌ పీఠిక చివరి పాఠాన్ని రాజ్యాంగ సభ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్‌ కు సమర్పించారు.
ఇక్కడ సామాజిక న్యాయం అంటే కుల, మత, జాతి భేదాలకు అతీతంగా అందరికీ వివక్ష లేకుండా న్యాయం జరగటం. ఆర్థిక న్యాయం అంటే ఉపాధి అవకాశాలు, సంపద వికేంద్రీకరణ, రాజకీయ న్యాయం అంటే ఒక మనిషి, ఒక ఓటు. సామా జిక న్యాయం అనే భావం అంబేద్కర్‌ రచనల్లో నిబిడీకృతమై ఉంది. ఆయన దృష్టిలో ప్రజాస్వామ్యం అంటే సమాన త్వం, స్వేచ్ఛ రాజకీయ సంబంధంలో అనిశ్చితి భావిలో పౌరులు తమని తాము నిర్వచించుకోవడమే. నెహ్రూ న్యాయం పొందేందుకు” అని అంటే అంబేద్కర్‌ సాంఘిక, ఆర్థిక, రాజకీయ అసమానతల నిర్మూలనగా చూసారు. సావర్కర్‌ స్వరాజ్‌ భావనను విమర్శిస్తూ ముస్లింల మీద హిందువుల సామ్రాజ్యం సుస్థిర శాంతి నివ్వదని, దానికి ముస్లింలు ఇష్టపూర్వక విధేయత చూపించరని అంబే ద్కర్‌ చెప్పారు. బుద్ధిజం ఆధారిత దళిత స్వరాజ్య భావం నొక్కి చెబు తూ స్వరాజ్‌ అనేది హిందూ, ముస్లింలు ఒకరి నొకరు ఓడించే అవకాశం కాక పజ్రాస్వామ్య ప్రభుత్వమని, అలా కానిపక్షంలో అది భ్రాంతిగా మిగులుతుందని అన్నారు. స్వరాజ్‌ భారత్‌ కు ఎలా అవసరమో, మత మార్పు అస్పృశ్యులకు అవసరం .రెండు ఉద్యమాల అంతర్గత ఉద్దేశం స్వేచ్ఛా భావం అని చెప్పారు. సమాజంలో చారితక్రంగా ఉన్న స్థాయివారీ అసమానతల్ని అంబేద్కర్‌ వ్యతిరేకించారు. తాను రాసిన ప్రాచీన భారతంలో విప్లవం మరియు ప్రతీఘాత విప్లవం పుస్తకంలో గర్భితంగా ఉన్న హోదా మరియు అవకాశం యొక్క సమానత్వం అనే పదాలు రాజ్యాంగ పీఠికలో చోటు చేసుకున్నాయి. బుద్ధిజం హేతువాదంతో కుల, లైంగిక అసమానతలను ఎదుర్కొంది. పుష్యమిత్ర శృంగుని కాలం అయిన నాల్గవ శతాబ్ది నుంచి తిరిగి తలెత్తిన బ్రాహ్మణిజం బౌద్ధులను పీడించి వారు తరువాత కాలంలో ఇస్లాంలోకి వెళ్ళేటట్లు చేసింది. అంతకు ముందు రాజ్యాంగ ముసాయిదాలు తయారు చేసిన శ్రీ నారాయణ అగ ర్వాల్‌, ఎం. ఎన్‌. రాయ్‌ , జయ పక్రాష్‌ నారాయణ మొదలగు వారు ఎవరూ ప్రతిపాదించని సౌభ్రాతృత్వం, పదాన్ని అంబేద్కర్‌ ప్రతిపాదించడాన్ని ఠాకూర్‌ దాస్‌ భార్గవ, ఆచార్య కృపలానీ ఎంతో ప్రశంసించారు.
రాజ్యాంగ ఆత్మ పీఠికలో ఉంది అని భార్గవ అనగా, ఆ సౌభ్రాతృత్వం అనే పదం ప్రజాస్వామ్యానికి సన్నిహితమని, తాము అందరూ చెప్పినవి కేవలం చట్టపర, రాజ్యాంగపర, ఫార్మల్‌ సూత్రాలు కాదని, అవి నైతిక సూత్రాలు అని, వాటిని అందరూ ప్రజా జీవితంలోనూ, వ్యక్తిగత జీవితాల్లోనూ పాటిస్తేనే రాజ్యాంగం సఫలీకృతం అవుతుందని ఆచార్య కృపలానీ అన్నారు. ఈ పదం చేర్చేందుకు నేపథ్యంగా అంబేద్కర్‌ తన కుల నిర్మూలన పుస్తకంలో చెప్పినట్లు ప్రజాస్వామ్యమంటే కలిసి జీవించే విధాన మని , కలిసి అనుభవాలు పంచుకోవడమని, సారాంశంలో తోటివారి పట్ల గౌరవం కలిగిఉండటమనే భావన తోడ్పడింది. ఈ సౌభ్రాతృత్వం పదంలో అంబేద్కర్‌ బౌద్ధ సూత్రమైన మైత్రిని ( మనుష్యులతోనే కాక తోటి ప్రాణుల పట్లసహ అనుభూతి) నిబిడీ కృతం చేశారు. రాజ్యాంగ నీతి అలవర్చు కోవాలని అన్నా రు. అంబేద్కర్‌ కుల వ్యవస్థతెచ్చిన స్థాయివారీ అసమానతల నిర్మూ లన ప్రధానమని చెప్పారు. ఫ్రెంచి విప్లవం స్పూర్తితో వచ్చిన నినాదాలైన స్వేచ్ఛ, సమానత్వం ,సౌభ్రాతృత్వం మొదలగు నినా దాలు తాను బౌద్ధమతం నుంచి తీసుకున్న మత నైతిక సూత్రాలు అని అంబేద్కర్‌ చెప్పారు. స్వేచ్ఛ, సమానతలు అపరిమితమై పరస్పర నాశనం జరగకుండా ఉండేందుకు సౌభ్రాతృత్వం కారణమని, అదే ప్రజాస్వామ్యానికి వేరులాంటిది అని చెప్పారు. అలాగే పీఠికలో డిగ్నిటీ ఆఫ్‌ ఇండివిడ్యుయల్‌ (‘వ్యక్తిగౌరవం’)పదానికి ఇతర నేతలకు భిన్నంగా గౌరవం అనేది అంతర్గతమైం దని , అంతస్తు గురించి కాదని అంబేద్కర్‌ ఆలోచన. ఈ పదాన్ని ‘యూనిటీ’ మరియు ‘ఇంటెగ్రిటీ అనేపదాల ముందు చేర్చాలని అందరి అంగీకారం వెనుక అంబేద్కర్‌ భావం భారత జాతి, ఒకే మతం, భాష, సాహిత్యం మీద ఆధారపడింది కాదని, ప్రాచీన గత కీర్తి వైపు చూపు కాక భావిలో కులాతీతంగా జాతి రూపొందటానికి నూతన రాజ్యాంగం బాటలు వేయాలని ఆయన భావించారు.
ఫాసిజానికి దారితీసే హిందూ రాష్ట్ర చింతనకు, అంబేద్కర్‌ భావనా ధారకు నక్కకు, నాగ లోకానికి ఉన్నంత తేడా ఉంది. భిన్నత్వంలో ఏకత్వం సాకారమవ్వాలంటే ఐక్యత పేరుతో ఏకరూపతను అనుసరిస్తూ భిన్నత్వాన్ని చదును చేసే చర్యలకు పాలకులు స్వస్తిచెప్పాలి. రాజ్యాంగ పీఠిక రాజ్యాంగంలో అంతర్భాగమని కేశవానంద భారతి వెర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ (1973) కేసు తీర్పులో సుప్రీం కోర్టు తెలిపింది. ప్రజాస్వామ్యం మౌలిక స్వరూప లక్షణమని కిహోటో హాలోహాన్‌ వెర్సెస్‌ జచిల్లు (1992) కేసులోనూ, సెక్యులరిజం మరియు ఫెడరలిజం మౌలిక లక్షణాలని ఏస్‌ ఆర్‌ బొమ్ము వెర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా (1994) కేసులో , డా.బలరాం సింగ్‌ వెర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా (2024) కేసులో ‘సెక్యులర్‌’ , ‘సోషలిస్టు’ పదాలు పీఠికలో భాగమని, సమానత్వ భావ అంశాలని సుప్రీం కోర్టు తీర్పులు ఇచ్చింది.

ట్యాగ్‌లు: Indian Politics Today news