Skip to content
వినోదం వార్తలు

టీచర్‌ ప్రేమ కథ ‘సర్కారు బాయి’

Prajapaksham 24 Sep 2026 1 నిమిషాల పఠనం వినోదం
టీచర్‌ ప్రేమ కథ ‘సర్కారు బాయి’

Sarkaru Bai

శ్రీరామ్‌ నిమ్మల, వర్షిక హీరో హీరోయన్స్‌ గా నటిస్తున్న సినిమా ’సర్కారు బాయి’. ఈ చిత్రాన్ని డెక్కన్‌ ఫిలింస్‌ సమర్ఫణలో ప్రొడ్యూసర్‌ తుమ్మల ప్రఫుల్‌ రాం రెడ్డి నిర్మిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో తెలంగాణ ప్రాంతంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు లారా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అప్పటి తెలంగాణ సమాజాన్ని ప్రతిబింబిస్తూ నీటి సమస్యలు, కుల వివక్ష, అణగారిన వర్గాల జీవిత పోరాటం వంటి అంశాలను దర్శకుడు లారా కళ్లకు కట్టినట్లు తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్‌ చేసిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ కు హ్యూజ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. హీరోయిన్‌ వర్షిక పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ మూవీ టీమ్‌ బర్త్‌ డే పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. ‘సర్కారు బాయి‘ సినిమాలో వర్షిక కల్పన టీచర్‌ పాత్రలో నటిస్తోంది. ఈ బర్త్‌ డే పోస్టర్‌ లో చీరకట్టులో ట్రెడిషనల్‌ లుక్‌ లో వర్షిక కనిపించి ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ‘సర్కారు బాయి‘ సినిమా షూటింగ్‌ తుది దశకు చేరుకుంది. ఇటీవలే చేగుంట సమీపంలోని రెడ్డిపల్లి, పరిసర ప్రాంతాల్లో భారీ షెడ్యూల్‌ కంప్లీట్‌ చేశారు. మరోవైపు ఎడిటింగ్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ కూడా జరుగుతున్నాయి. హీరో శ్రీరామ్‌ నిమ్మల, హీరోయిన్‌ వర్షిక, బాహుబలి ప్రభాకర్‌, నాగ మహేష్‌ లాంటి ప్రధాన నటీనటులు పాల్గొన్న ఈ లెంగ్తీ షెడ్యూల్‌ లో చాలా వరకు సినిమా చిత్రీకరించారు. త్వరలోనే ‘సర్కారు బాయి‘ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రొడ్యూసర్‌ తుమ్మల ప్రఫుల్‌ రాం రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీరామ్‌ నిమ్మల, వర్షిక, బాహుబలి ప్రభాకర్‌, వివ రెడ్డి, నాగ మహేష్‌, చలాకీ చంటి, నుపూర్‌ ముఖర్జీ, జ్యోతి, దేవరాజ్‌ పాలమూరు, మాధవి, కవిత, తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి డీవోపీ – అమర్‌.జి, మ్యూజిక్‌ – శివా.కె, ఎడిటర్‌ – బి.యన్‌.రెడ్డి, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: కె. మాధురి.