Telangana DA News: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్.. రెండు డీఏలు విడుదల చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..?
Revanth Reddy: ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి ఊరట.. రూ.50 లక్షల అటాచ్మెంట్ రద్దు
Telangana DA News: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. చాలాకాలంగా పెండింగ్లో ఉన్న కరవు భత్యం (DA) విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో జరిగిన చర్చల అనంతరం రెండు డీఏలను విడుదల చేసేందుకు ప్రభుత్వం అంగీకరించినట్లు సమాచారం. దీంతో డీఏ కోసం ఎదురుచూస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరట కలగనుంది.
ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో బుధవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు, పెండింగ్లో ఉన్న డిమాండ్లపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా డీఏ బకాయిల అంశాన్ని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
చర్చల అనంతరం పెండింగ్లో ఉన్న రెండు డీఏలను చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించినట్లు సమాచారం. ఇందులో మొదటి డీఏను అక్టోబర్ నెల జీతంతో కలిపి చెల్లించనున్నట్లు ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఉద్యోగులకు అక్టోబర్ జీతంతో పాటు డీఏ ప్రయోజనం అందే అవకాశం ఉంది.
ఇక రెండో డీఏను ఉగాది పండుగ సందర్భంగా విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. దీంతో ఉద్యోగులకు రెండు విడతల్లో డీఏ ప్రయోజనం అందనుంది. మొదటి డీఏ అక్టోబర్ జీతంతో కలిపి, రెండో డీఏ ఉగాది సందర్భంగా చెల్లించే విధంగా ప్రభుత్వం అంగీకరించినట్లు తెలుస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ చెల్లింపులు గతంలో కూడా ప్రభుత్వ చర్చల్లో కీలక అంశంగా ఉన్నాయి. 2026 జనవరిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగులకు సంబంధించిన డీఏ ఫైలుపై సంతకం చేసినట్లు తెలంగాణ ప్రభుత్వ అధికారిక పోర్టల్ వెల్లడించింది. ఆ సమయంలో డీఏ కారణంగా ప్రభుత్వంపై నెలకు సుమారు రూ.225 కోట్ల అదనపు భారం పడుతుందని సీఎం పేర్కొన్నారు.
PRCపై మాత్రం ఇంకా స్పష్టత లేదు
డీఏ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ, ఉద్యోగ సంఘాలు చాలాకాలంగా కోరుతున్న పే రివిజన్ కమిషన్ (PRC) అమలుపై మాత్రం తాజా సమావేశంలో స్పష్టత రాలేదు. PRC అమలు, వేతన సవరణపై ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా PRC నివేదిక అందిన వెంటనే తదుపరి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
దీంతో ప్రభుత్వం డీఏలపై నిర్ణయం తీసుకోవడం ఉద్యోగులకు కొంత ఊరటనిచ్చినా, PRCపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశం ఇప్పుడు కీలకంగా మారింది. ఉద్యోగ సంఘాలు కూడా PRC అమలుపై ప్రభుత్వంతో మరిన్ని చర్చలు జరిపే అవకాశం ఉంది.
- ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. సీపీఎస్ ఉద్యోగులకు ఓపీఎస్ ఛాన్స్… తెలంగాణలో పరిస్థితి ఏంటి?
- AP CPS to OPS Conversion: ఏపీ ఉద్యోగులకు గుడ్న్యూస్.. CPS నుంచి OPSకు మారేందుకు ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..
- Telangana High Court: కోర్టు ధిక్కరణ కేసులో రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు 6 నెలల జైలు శిక్ష.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు..
- Uttar Pradesh Politics: యూపీ బాధ్యతలు ప్రియాంక గాంధీకి.. ఎస్పీతో పొత్తు చర్చలకు ముందు రాహుల్ గాంధీ కీలక నిర్ణయం!
- Maharashtra Politics: మళ్లీ ఒక్కటవనున్న ఎన్సీపీ ? శరద్ పవార్, అజిత్ పవార్ వర్గాల విలీనంపై ఉత్కంఠ.. మహారాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతోంది..