September 17 Telangana Armed Struggle Day Wishes: మీ స్నేహితులు, బంధు మిత్రులకు తెలంగాణ సాయుధ పోరాట దినోత్సవ శుభాకాంక్షలు ఇమేజెస్ ఉపయోగించి విషెస్ తెలియజేయండిలా..
Telangana Armed Struggle Day
September 17 Telangana Armed Struggle Day Wishes: 1947 ఆగస్టు 15న దేశమంతటా స్వాతంత్ర్య సంబరాలు అంబరాన్నంటినా, హైదరాబాద్ సంస్థానం మాత్రం నైజాం నిరంకుశ పాలన, రజాకార్ల భీకర అరాచకాల కోరల్లోనే ఉండిపోయింది. భూమి, భుక్తి, ఆత్మగౌరవం కోసం పారించిన రక్తం, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య వంటి వీరులు రగిల్చిన సాయుధ పోరాట అగ్నిజ్వాలలు నైజాం కోటల పునాదులను కదిలించాయి. ప్రజా తిరుగుబాటుకు తోడు, కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభభాయ్ పటేల్ చేపట్టిన ‘ఆపరేషన్ పోలో’ (పోలీస్ యాక్షన్) చర్యతో 1948 సెప్టెంబర్ 17న నైజాం సర్కార్ లొంగిపోయింది. ఆ రోజే హైదరాబాద్ రాజ్యం అధికారికంగా భారత యూనియన్‌లో విలీనమై, తెలంగాణ ప్రజలకు నిజమైన స్వేచ్ఛ లభించింది. బానిస సంకెళ్లు తెంచుకుని తెలంగాణ ప్రజాశక్తి గెలిచిన ఈ చారిత్రాత్మక ఘట్టం మన వీరుల పోరాటానికి నిలువెత్తు నిదర్శనం.









