September 17th Telangana Armed Struggle Day: తెలంగాణ సాయుధ పోరాట దినోత్సవ శుభాకాంక్షల ఇమేజెస్ మీ కోసం..వాట్సప్ ద్వారా షేర్ చేసుకోండిలా..
September 17th Telangana Armed Struggle Day: సెప్టెంబర్ 17వ తేదీ తెలంగాణ చరిత్రలో అత్యంత కీలకమైన రోజు. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, నైజాం నిరంకుశ పాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానానికి మాత్రం స్వేచ్ఛ లభించలేదు. ఏడో నైజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన రాజ్యాన్ని స్వతంత్రంగా ఉంచుకోవడానికో లేదా పాకిస్తాన్‌లో కలపడానికో ప్రయత్నించగా, రజాకార్లు ప్రజలపై విపరీతమైన అరాచకాలకు ఒడిగట్టారు. దీనికి నిరసనగా ‘భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం’ తెలంగాణ రైతాంగం, కవులు, ప్రజాపోరాట యోధులు సాయుధ పోరాటాన్ని ఉధృతం చేశారు. ప్రజల తిరుగుబాటు, పరిస్థితుల తీవ్రతను గమనించిన కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభభాయ్ పటేల్ 1948 సెప్టెంబర్ 13న ‘ఆపరేషన్ పోలో’ (పోలీస్ యాక్షన్) ప్రారంభించారు. భారత సైన్యం చర్యతో లొంగిపోయిన నైజాం నవాబు, 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా సెప్టెంబర్ 17ను తెలంగాణ సాయుధ పోరాట దినోత్సవంగా ప్రజలంతా జరుపుకుంటున్నారు.







