Telangana Assembly Session: 22ఏ సమస్య ఒక్కరోజులో పుట్టింది కాదు..గత ప్రభుత్వాల నుంచి వారసత్వంగా వచ్చిన సమస్య .. అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి..
CM Revanth Reddy
Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రారంభ రోజే బీఆర్‌ఎస్ సభ్యులు బాధ్యతారహితంగా వ్యవహరించారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. 22ఏ భూముల అంశంపై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 22ఏ విషయంలో విపక్షాలు ప్రజల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ఈ అంశంపై చర్చ జరపాలని ప్రభుత్వం ముందుగానే నిర్ణయించిందని స్పష్టం చేశారు. 22ఏ సమస్యతో పాటు గత ప్రభుత్వాల నుంచి వారసత్వంగా వచ్చిన పలు అంశాలపై కూడా సభలో చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు.
సభ ప్రారంభం రోజే కొందరు ప్రజాప్రతినిధులు వ్యవహరించిన తీరు సమర్థనీయం కాదని సీఎం అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగకూడదనే ఉద్దేశంతోనే బీఆర్‌ఎస్ సభ్యులు ఆందోళనలకు దిగారని విమర్శించారు. రాష్ట్రంలో సమస్యలు రావాలని కోరుకుంటూ పక్క రాష్ట్రాలకు వెళ్లి క్షుద్రపూజలు చేశారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సభలో చర్చకు దారితీశాయి. 22ఏతో పాటు గతంలో జరిగిన తప్పిదాలపై అసెంబ్లీలో చర్చ జరుగుతుందని బీఆర్‌ఎస్‌కు ముందే తెలుసని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
రైతులు, పేదలకు తమ ప్రభుత్వం ఎలాంటి అన్యాయం చేయదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అసెంబ్లీ నిర్వహణలో గత ప్రభుత్వం పాటించిన నిబంధనలనే ప్రస్తుత ప్రభుత్వం కూడా అనుసరిస్తోందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా సభలో వ్యవహరించిన కారణంగానే బీఆర్‌ఎస్ సభ్యులపై సస్పెన్షన్ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. 22ఏ సమస్య ఒక్కరోజులో పుట్టింది కాదని, గత ప్రభుత్వాల నుంచి వారసత్వంగా వచ్చిన సమస్యగా పేర్కొన్నారు.
22ఏ అంశం ద్వారా కొందరు వ్యక్తులు, కొన్ని రాజకీయ వర్గాలు భూ వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడ్డాయనే ఆరోపణలు ఉన్నాయని సీఎం అన్నారు. గతంలో జరిగిన తప్పిదాలను గుర్తించి వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చరిత్రను అర్థం చేసుకుని భవిష్యత్ ప్రణాళికలను రూపొందించుకోవాలని సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న తప్పిదాలు, ప్రభుత్వ భూముల పరిరక్షణ, భూముల అన్యాక్రాంతం వంటి అంశాలపై సభలో చర్చ జరగాల్సిందేనని స్పష్టం చేశారు.
ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించిన అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించకుండా ఉండలేమని రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ చర్చలు మీడియా ద్వారా ప్రజల్లోకి వెళ్తాయని చెప్పారు. విద్యార్థుల సంక్షేమం, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి అంశాలపై కూడా సభలో చర్చించాల్సిన బాధ్యత ఉందన్నారు.
గత ప్రభుత్వాల నుంచి ప్రస్తుత ప్రభుత్వానికి సంక్రమించిన సమస్యలపై కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని సీఎం పేర్కొన్నారు. కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించాలంటూ గతంలో ప్రజాప్రతినిధులు చేపట్టిన కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై వారు చేసిన ఆందోళనలు కూడా సభ చర్చలో భాగం కావాల్సి ఉంటుందన్నారు. ఇలాంటి అంశాలు చర్చకు వస్తాయని తెలిసి సభ ప్రారంభం రోజే అనాగరికంగా వ్యవహరించడం సరికాదని విమర్శించారు.
మహిళల గౌరవానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మహిళలను అవమానించేలా ఎవరైనా వ్యవహరించినా ప్రభుత్వం సహించబోదన్నారు. పోలీసు శాఖలో కింది స్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల వరకు, ప్రజాప్రతినిధుల నుంచి సాధారణ పౌరుల వరకు అందరూ చట్టం ముందు సమానమేనని చెప్పారు. ఎవరూ చట్టానికి అతీతులు కాదని, ప్రతి మహిళ ఆత్మగౌరవాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని సీఎం పేర్కొన్నారు.
- India Pakistan Tension: ఇండియా-పాక్ మధ్య మరోసారి ఉద్రిక్తత.. అరేబియా సముద్రంలో నౌకలు ఢీ కొనడంపై పాకిస్తాన్ దౌత్యవేత్తకు సమన్లు..
- Telangana Assembly Session: 22ఏ సమస్య ఒక్కరోజులో పుట్టింది కాదు..గత ప్రభుత్వాల నుంచి వారసత్వంగా వచ్చిన సమస్య .. అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి..
- Hyderabad Water Crisis: నీటి సంక్షోభం దిశగా హైదరాబాద్.. భారీగా పడిపోయిన గ్రౌండ్‌వాటర్ లెవల్స్..ఏడాదిలోనే 4.84 మీటర్ల పతనం
- Telangana Assembly Session: ఆ ప్రైవేటు భూములను వెంటనే నిషేధిత జాబితా నుండి బయటకు తీసుకురండి.. ప్రభుత్వానికి సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక సూచన
- Telangana Assembly Session: కోటి ఎకరాలు అనేది అవాస్తవం.. సెక్షన్ 22-Aపై కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు.. ఏడో రోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు..