Skip to content
తెలంగాణ వార్తలు

Telangana Assembly Session: కోటి ఎకరాలు అనేది అవాస్తవం.. సెక్షన్ 22-Aపై కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు.. ఏడో రోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు..

jagan 16 Sep 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Telangana Assembly Session: కోటి ఎకరాలు అనేది అవాస్తవం.. సెక్షన్ 22-Aపై కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు.. ఏడో రోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు..

Telangana Assembly Sessions

Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏడో రోజు ప్రారంభమయ్యాయి. ఈరోజు(బుధవారం) ఉదయం శాసనసభ మొదలైన వెంటనే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. రాష్ట్రంలో వివిధ సమస్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇస్తున్నారు. ఈ రోజు సమావేశాల్లో సెక్షన్ 22-A లో భారీగా భూములు చేరడం, తద్వారా ఎదురవుతున్న సమస్యలపై గత సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వివరణ ఇచ్చారు. దీనిపై నేడు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సభలో ప్రత్యేకంగా మాట్లాడి, ప్రభుత్వ విధానంపై పూర్తి స్థాయి వివరణ ఇవ్వనున్నారు. పేదల భూములను 22-A నుంచి మినహాయించడంపై రేవంత్ కీలక ప్రకటన చేయనున్నారు. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంపై లఘు చర్చ జరగనుంది. ఎల్‌నినో పరిస్థితుల వల్ల రాష్ట్రంలో ఏర్పడిన వాతావరణ మార్పులు, వర్షపాత లోటు, వ్యవసాయ రంగంపై పడిన ప్రభావం మరియు రైతాంగానికి అందించాల్సిన ఊరట చర్యలపై సభలో స్వల్పకాలిక చర్చ జరుగుతుంది. కాగా నేడు సెక్షన్ 22-Aపై సీపీఐ ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావు నేడు అసెంబ్లీలో మాట్లాడారు.. కోటి ఎకరాలు అనేది అవాస్తవం అని తేల్చి చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు లైవ్ ఇక్కడ చూడవచ్చు.