Skip to content
వినోదం వార్తలు

ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో ‘ఆపరేషన్ గంగా’

Prajapaksham 08 Sep 2026 1 నిమిషాల పఠనం వినోదం
ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో ‘ఆపరేషన్ గంగా’

Mohanlal

మలయాళ నటుడు మోహన్‌లాల్ హీరోగా శ్రీ గోకులం మూవీస్ బ్యానర్‌పై గోకులం గోపాలన్ నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ టైటిల్‌ను ప్రకటించారు. ఎల్367గా తెరకెక్కుతున్నఈ చిత్రానికి విష్ణు మోహన్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు ‘ఆపరేషన్ గంగా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. బైజు గోపాలన్, వి.సి. ప్రవీణ్ కో-ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తుండగా, కృష్ణమూర్తి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు.విష్ణు మోహన్ దర్శకత్వం వహిస్తున్న మూడో సినిమా ఇది. ఆయన తొలి చిత్రం ‘మెప్పడియాన్’తోనే నేషనల్ అవార్డు అందుకుని గుర్తింపు తెచ్చుకున్నారు.‘ఆపరేషన్ గంగా’ ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో భారత్ చేపట్టిన చారిత్రాత్మక ఎవాక్యుయేషన్ మిషన్. ఈ సినిమా షూటింగ్ జార్జియాలో ప్రారంభమైంది. త్వరలో మోహన్‌లాల్ షూటింగ్‌లో జాయిన్ కానున్నారు. పోలాండ్, జార్జియా, కజకిస్థాన్, ఢిల్లీ, డెహ్రాడూన్, కొచ్చి ప్రాంతాల్లో మొత్తం 180 రోజుల పాటు షూటింగ్ జరిపేలా ప్లాన్ చేశారు.మోహన్‌లాల్‌తో పాటు బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్, అదిల్ హుస్సేన్, భాగ్యశ్రీ బోర్సే, పార్తిబన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ‘ఆపరేషన్ గంగా’కు మరో ప్రత్యేకత కూడా ఉంది. ‘ధురంధర్’ పాన్ ఇండియా సినిమా భారీ విజయాన్ని అందుకున్న తర్వాత ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ శశ్వత్ సచ్‌దేవ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ‘పుష్ప 1’, ‘పుష్ప 2’ సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన మిరోస్లావ్ కుబా బ్రోజెక్ ఈ సినిమాకు కెమెరా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ‘ధురంధర్’, ‘కిల్’ చిత్రాలకు యాక్షన్ డైరెక్టర్‌గా పనిచేసిన సే యంగ్ ఓ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు.