LPG Booking Rules Changed: LPG వినియోగదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఇక 45 రోజులు వేచి ఉండాల్సిన అవసరం లేదు..
LPG Booking Rules Changed
LPG Booking Rules Changed: దేశంలోని వంట గ్యాస్ (LPG) వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఎల్పీజీ సిలిండర్ రీఫిల్ బుకింగ్ చేసుకోవడానికి ఉన్న సమయ పరిమితి వ్యవధిని 45 రోజుల నుంచి 25 రోజులకు తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పట్టణ, గ్రామీణ ప్రాంతాలు అనే వ్యత్యాసం లేకుండా దేశవ్యాప్తంగా అందరికీ 25 రోజుల నిబంధనే అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ఈ సడలింపులను తక్షణమే అమలు చేయాలని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL), భారత్ పెట్రోలియం (BPCL), హిందూస్థాన్ పెట్రోలియం (HPCL) వంటి ప్రభుత్వ రంగ చమురు సంస్థలను కేంద్రం ఆదేశించింది.
కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు, పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేశ్ గోపీ సోమవారం ఈ వివరాలను అధికారికంగా వెల్లడించారు. దేశంలో ప్రస్తుతం ఎల్పీజీ సరఫరా పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుందని, రీఫిల్ బకాయిలు (Backlog) కూడా గణనీయంగా తగ్గాయని ఆయన తెలిపారు. గతంలో సరఫరా సమస్యల వల్ల విధించిన పరిమితులు ప్రస్తుతం అవసరం లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
పశ్చిమాసియాలో సంభవించిన యుద్ధ పరిస్థితులు, ఉద్రిక్తతల వల్ల ఈ ఏడాది ఫిబ్రవరిలో అంతర్జాతీయంగా ఎల్పీజీ సరఫరాపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. అప్పట్లో ఇంధన డిమాండ్‌ను నియంత్రించేందుకు పట్టణాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల నిబంధనను కేంద్రం అమలులోకి తెచ్చింది. కొత్త నిర్ణయంతో రీఫిల్ బుకింగ్ వ్యవధిలో పట్టణ, గ్రామీణ వినియోగదారుల మధ్య ఉన్న వ్యత్యాసం పూర్తిగా తొలగిపోయింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఎల్పీజీపై ఎక్కువగా ఆధారపడే వినియోగదారులకు తీవ్రమైన గ్యాస్ కొరత సమస్యల నుంచి పెద్ద ఎత్తున ఊరట లభించనుంది.
- Telangana Assembly Tragedy: వీడియో ఇదిగో.. అసెంబ్లీలో ఒక్కసారిగా కుప్పకూలిన అధికారి.. వెంటనే CPR చేసిన మంత్రి వాకిటి శ్రీహరి..
- Konidela Susmitha: విజయవాడ దుర్గగుడి ట్రస్ట్ బోర్డుకు ప్రత్యేక ఆహ్వానితురాలిగా కొణిదెల సుస్మిత నియామకం…
- KCR Farmhouse Protest: ఎర్రవల్లిలో హైటెన్షన్.. కేసీఆర్ ఫాంహౌస్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపు
- ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో ‘ఆపరేషన్ గంగా’
- BRS MLC Arrest: స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలు.. తాతా మధు, నవీన్ రెడ్డి అరెస్ట్