Donald Trump on Iran: వారు బాత్రూమ్కు వెళ్లినా మాకు క్షణాల్లో తెలిసిపోతుంది.. ఇరాన్‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
US-Venezuela oil deal: వెనుజులా ఆయిల్ వ్యాపారంలోకి అమెరికా...మీకు మూరెడు...మాకు బారెడు : చమురు వ్యాపారంలో పెంటగాన్‌కు 35% వాటా..?
Donald Trump on Iran: ట్రంప్ గతంలో ఇరాన్‌పై అమెరికాకు అత్యాధునిక నిఘా సామర్థ్యాలు ఉన్నాయని, అక్కడ జరుగుతున్న పరిణామాలను సన్నిహితంగా గమనిస్తున్నామని బహిరంగంగా వ్యాఖ్యానించారు.
Donald Trump on Iran: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య దౌత్యపరమైన, సైనిక ఉద్రిక్తతలు మళ్లీ పతాక స్థాయికి చేరాయి. ఇరాన్‌పై తమ నిఘా వ్యవస్థ అత్యంత పకడ్బందీగా ఉందని, ఆ దేశంలో జరుగుతున్న ప్రతి పరిణామాన్నీ ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అవసరమైతే ఇరాన్‌పై మరొకసారి ప్రతిఘటన దాడి చేసేందుకు తమ దళాలు సిద్ధంగా ఉన్నాయని ఆయన తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.
శ్వేతసౌధంలోని ఓవల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన ట్రంప్, తాజా సైనిక ఘర్షణ ఎక్కువ కాలం కొనసాగబోదని అభిప్రాయపడ్డారు. ఇరాన్ అంతర్గత కదలికలపై తమ వద్ద సమగ్ర సమాచారం ఉందని చెబుతూ.. వాళ్లు బాత్రూమ్కు వెళ్లినా మాకు తెలిసిపోతుందని వ్యాఖ్యానించడం ద్వారా అమెరికా నిఘా సామర్థ్యాన్ని పునరుద్ఘాటించారు. అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిపై తమకే పూర్తి పట్టు ఉందన్నారు. ఈ ప్రాంతంలో ఇరాన్ ఏర్పాటు చేస్తున్న రాడార్లు, క్షిపణి వ్యవస్థలను గుర్తించామని, సముద్రంలో మైన్స్ వేసేందుకు ఆ దేశం సిద్ధం చేసిన రాకెట్‌ను తమ దాడుల్లో ధ్వంసం చేశామని వెల్లడించారు.
ఇదిలా ఉండగా, ఇరాన్‌పై అమెరికా జరిపిన తాజా దాడుల్లో కనీసం 18 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 108 మంది తీవ్రంగా గాయపడ్డారు. హర్మూజ్ సమీపంలోని కుహెస్తాక్ వద్ద ఒక వివాహ వేడుక జరుగుతున్న ప్రదేశంపై కూడా దాడులు జరిగాయని టెహ్రాన్ ఆరోపించింది.
ఈ దాడులకు ప్రతిచర్యగా ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు దిగింది. కువైట్, జోర్డాన్, యూఏఈ, బహ్రెయిన్ మరియు ఇరాక్‌లోని కుర్దిస్థాన్ ప్రాంతాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. అయితే ఇరాన్ నుంచి వచ్చిన క్షిపణి, డ్రోన్ దాడులను తమ సైనిక వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్నాయని కువైట్ ప్రకటించింది. మధ్యప్రాచ్యంలో ఇరు దేశాల మధ్య చోటుచేసుకున్న ఈ పరిణామాలు గ్లోబల్ విపత్తుకు దారితీస్తాయేమోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
- Viral Video: పిడుగు పడినా ప్రాణాలతో బయటపడ్డాడు.. వైరల్ అవుతున్న వీడియో ఇదే..
- Donald Trump on Iran: వారు బాత్రూమ్కు వెళ్లినా మాకు క్షణాల్లో తెలిసిపోతుంది.. ఇరాన్‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
- Vivo T5 5G Smart Phone Launch: కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా..అయితే వివో 5జీ ఫోన్ అతి తక్కువ ధరకే మీ కోసం…ఓ లుక్ వేయండి..
- Philips S7221 5G Smart Phone: మార్కెట్లోకి ఫిలిప్స్ స్మార్ట్ ఫోన్…ధర, కెమెరా, ఫీచర్లు ఇవే…
- 10న ‘మారెమ్మ’