Skip to content
వినోదం వార్తలు

Allu Arjun Forbes Magazine Video: అల్లు అర్జున్ ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ ఫోటో షూట్ వైరల్ వీడియో మీ కోసం..

Krishna Rao 29 Aug 2026 1 నిమిషాల పఠనం వినోదం
Allu Arjun Forbes Magazine Video: అల్లు అర్జున్ ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ ఫోటో షూట్ వైరల్ వీడియో మీ కోసం..

Allu Arjun Forbes Magazine Video: అల్లు అర్జున్ ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ ఫోటో షూట్ వైరల్ వీడియో మీ కోసం..

Allu Arjun Forbes Magazine Video: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజీ పైన మోడల్ గా నిలిచారు. ఈ మ్యాగజైన్ పైన మోడల్ గా నిలిచిన తొలి టాలీవుడ్ నటుడిగా అల్లు అర్జున్ పేరు సంపాదించుకున్నారు. అయితే అల్లు అర్జున్ ఈ సందర్భంగా నిర్వహించిన ఫోటోషూట్ ను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ గ్లోబల్ స్టార్ గా పుష్ప 2 సినిమా అనంతరం ఎదిగారు అని చెప్పవచ్చు. పుష్ప 2 చిత్రం భారతదేశంలోనే అత్యధికంగా వసూళ్లు సాధించి దాదాపు 2000 కోట్ల రూపాయల కలెక్షన్లతో నెంబర్ వన్ సినిమాగా ఇప్పటికీ రికార్డు నిలుపుకుంది. గతంలో బాహుబలి కంక్లూజన్ సినిమా ఇదే స్థాయిలో రికార్డులను నిలబెట్టగా, ప్రస్తుతం పుష్ప 2 సినిమా కూడా సరికొత్త రికార్డులు సృష్టిస్తూ రూ. 2000 కోట్ల మార్కును అందుకుంది. అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో నటిస్తుండగా ఈ సినిమాను సన్ పిక్చర్స్ వాళ్లు నిర్మిస్తున్నారు. అనంతరం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సైతం అల్లు అర్జున్ నటిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అనంతరం పుష్ప 3 సినిమా కోసం అల్లు అర్జున్ మళ్లీ సిద్ధమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే పుష్ప 2 సినిమా అనంతరం పుష్ప 3 సినిమా తీస్తామని సినిమా ముగింపులో ప్రకటించారు. కథను ఇంకా ముగించకుండానే ఒక సస్పెన్స్ ప్రేక్షకుల్లో క్రియేట్ చేశారు. ఈ నేపథ్యంలో తప్పనిసరిగా పుష్ప 3 సినిమా ఉంటుందని చెప్పకనే చెప్పారు.

మరోవైపు అల్లు అర్జున్ వరుసగా అవార్డులను దక్కించుకుంటూ రికార్డులను సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జాతీయ ఉత్తమ నటుడిగా పుష్ప సినిమా కోసం అల్లు అర్జున్ రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. మరోవైపు ప్రపంచ స్థాయి బ్రాండ్లకు సైతం బ్రాండ్ అంబాసిడర్ గా అల్లు అర్జున్ ఉన్నారు. ప్రస్తుతం భారతదేశంలోనే అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకునే నటులలో ఒకరిగా అల్లు అర్జున్ పేరు సంపాదించుకున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ తీసుకునే పారితోషికం దాదాపు 300 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. భారతదేశంలో అందుకునే నటుల్లో అల్లు అర్జున్ నెంబర్ వన్ అని చెప్పవచ్చు. ఇదే స్థాయిలో ప్రభాస్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్ సైతం పారితోషికం అందుకుంటున్నారు.

మరోవైపు అల్లు అర్జున్ ఇటీవల తన అభిమానుల కోసం ప్రత్యేకంగా అభిమాన సంఘాన్ని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ పేరిట గుర్తింపు పొందిన సంస్థను ప్రారంభించారు. తమ అభిమానులకు జీవిత బీమా కల్పించడం, గుర్తింపు ఇవ్వడమే లక్ష్యంగా అల్లు అర్జున్ ఈ తరహా వినూత్నమైన కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీంతో ప్రస్తుతం అల్లు అర్జున్ రాజకీయాల వైపు కూడా అడుగులు వేసే అవకాశం ఉందా అనే సందేహం చాలామందిలో వ్యక్తమవుతోంది. మరి ముందు ముందు అల్లు అర్జున్ ఎలాంటి స్థాయికి చేరుకుంటారు అనేది కాలమే నిర్ణయించాలి.

ట్యాగ్‌లు: allu arjun