India’s Ghost Chilli: ఇది భారత మిరపకాయ కాదు.. ఫైర్ బాంబ్.. గిన్నిస్ రికార్డ్ సాధించిన భుట్ జోలోకియా..
India’s Ghost Chilli:
India’s Ghost Chilli: మిరపకాయ అనగానే గుర్తుకువచ్చేది ఘాటు. కానీ, ఈశాన్య భారతానికి చెందిన ‘భుట్ జోలోకియా’ ముందు మిగతా మిరపకాయలన్నీ దిగదుడుపే. చిన్నగా, ముడతలతో కనిపించే ఈ ప్రత్యేక మిరపకాయ ఒక్కసారి వంటలో పడితే చాలు.. దాని తీవ్రత వెంటనే తెలిసిపోతుంది. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిరపకాయగా ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకెకెక్కి ప్రత్యేక గుర్తింపు సాధించింది.
‘ఘోస్ట్ పెప్పర్’, ‘నాగ జోలోకియా’ పేర్లతో పిలిచే భుట్ జోలోకియా ఘాటు స్థాయిని 2007లో సైంటిస్టులు పరీక్షించగా ఏకంగా 10,01,304 స్కోవిల్ హీట్ యూనిట్లు (SHU)గా నమోదైంది. న్యూ మెక్సికో స్టేట్ యూనివర్సిటీలోని చిలీ పెప్పర్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్త పాల్ బోస్లాండ్ బృందం ఈ పరీక్షలు నిర్వహించగా.. రెండు స్వతంత్ర ప్రయోగశాలలు కూడా ఈ ఫలితాలను ధ్రువీకరించాయి. సాధారణంగా వాడే ‘జలపెనో’ మిరపకాయలలో కొన్ని వేల ఎస్‌హెచ్‌యూ మాత్రమే ఉండగా, ఇది పది లక్షల మార్కును దాటడం విశేషం.
ముఖ్యంగా అసోం, నాగాలాండ్ రాష్ట్రాలతో ఈ భుట్ జోలోకియాకు విడదీయరాని బంధం ఉంది. నాగాలాండ్‌లోని పెరెన్ జిల్లాకు ‘నాగ కింగ్ చిలీ’ పేరుతో జీఐ (GI) ట్యాగ్ కూడా లభించింది. ఈశాన్య ప్రాంతంలో చట్నీలు, ఊరగాయలు, మసాలా పేస్టులు, మాంసాహార వంటకాల్లో దీనిని విస్తృతంగా ఉపయోగిస్తారు. కొద్దిపాటి మోతాదులోనే ఇది వంటకానికి అపారమైన ఘాటును, రుచిని అందిస్తుంది. తర్వాతి కాలంలో ఇతర మిరపకాయలు దీని రికార్డును దాటినప్పటికీ, భారతీయ మిరపకాయలకు ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చిన ఘాటుగా భుట్ జోలోకియా ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంది.
భుట్ జోలోకియా (Bhut Jolokia) మిరపకాయ గురించిన తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
ప్ర: భుట్ జోలోకియా అంటే ఏమిటి? దీని ప్రత్యేకత ఏంటి?
జ: ఇది ఈశాన్య భారతదేశంలో (ముఖ్యంగా అసోం, నాగాలాండ్) పండే ఒక ప్రత్యేకమైన మిరపకాయ రకం. దీనిని ‘ఘోస్ట్ పెప్పర్’ అని కూడా పిలుస్తారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిరపకాయలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది.
ప్ర: గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో దీనికి స్థానం ఉందా?
జ: అవును. 2007లో 10,01,304 స్కోవిల్ హీట్ యూనిట్ల (SHU) తీవ్రతతో ఇది ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిరపకాయగా గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో చోటు సంపాదించుకుంది.
ప్ర: దీనికి జీఐ (GI) ట్యాగ్ ఉందా?
జ: అవును, నాగాలాండ్‌లోని పెరెన్ జిల్లాకు చెందిన ‘నాగ కింగ్ చిలీ’ పేరుతో దీనికి భౌగోళిక సూచిక (GI Tag) లభించింది.
ప్ర: ఈ మిరపకాయను సాధారణంగా ఏ వంటకాల్లో ఉపయోగిస్తారు?
జ: ఈశాన్య ప్రాంతంలో చట్నీలు, ఊరగాయలు, మసాలా పేస్టులు మరియు వివిధ రకాల మాంసాహార వంటకాల తయారీలో దీనిని కొద్దిపాటి మోతాదులో ఉపయోగిస్తారు.
ప్ర: సాధారణ మిరపకాయలతో పోలిస్తే ఇది ఎంత ఘాటైనది?
జ: సాధారణంగా వాడే జలపెనో వంటి మిరపకాయల ఘాటు కేవలం కొన్ని వేల ఎస్‌హెచ్‌యూ మాత్రమే ఉండగా, భుట్ జోలోకియా ఘాటు ఏకంగా 10 లక్షల ఎస్‌హెచ్‌యూ దాటుతుంది.
- India Bloc March: ఉద్రిక్తంగా మారిన ఇండియా బ్లాక్ పాదయాత్ర… ‘Gyanesh, it’s done bro’ ప్లకార్డుతో బారికేడ్ పైకి ఎక్కి నిలబడ్డ రాహుల్ గాంధీ…
- ఇండియా బ్లాక్ మార్చ్: రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు నేతలు అదుపులోకి
- Hyderabad Water Crisis: రిజర్వాయర్లు అడుగంటుతున్నాయ్.. హైదరాబాద్‌కు తాగునీటి సంక్షోభం ముంచుకొస్తుందా..?
- Andhra Pradesh: బస్సులో పరిచయం.. ప్రేమ పేరుతో మోసం చేసిన కండక్టర్
- Land Pooling Policy: తెలంగాణలో కొత్త ల్యాండ్ పూలింగ్ పాలసీ.. భూయజమానులకు నగదు బదులు డెవలప్డ్ ప్లాట్లు..?