Hyderabad Rain Alert: హైదరాబాద్ వాసులారా జాగ్రత్త..రాత్రికి వాన కుమ్ముడే కుమ్ముడు.. అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్ హెచ్చరిక..
Sajjanar
Hyderabad Rain Alert: హైదరాబాద్ నగరంలో ఈ రోజు రాత్రి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని సీపీ వీసీ సజ్జనార్ సూచించారు. వర్ష తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా ఖాతా ‘ఎక్స్’ (ట్విట్టర్) ద్వారా నగరవాసులకు పలు కీలక సూచనలు చేశారు:
అనవసర ప్రయాణాలు వద్దు: అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరారు.
త్వరగా ఇళ్లకు చేరుకోవాలి: ప్రస్తుతం పనుల నిమిత్తం బయట ఉన్నవారు వర్షం తీవ్రరూపం దాల్చకముందే తమ పనులను త్వరగా ముగించుకుని క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలని సూచించారు.
లోతట్టు ప్రాంతాల్లో ప్రయాణం వద్దు: రహదారులపై నీరు నిలిచిన చోట్ల, వర్షపు నీటితో ముంపునకు గురయ్యే లోతట్టు ప్రాంతాల గుండా ప్రయాణించడం అస్సలు సురక్షితం కాదని హెచ్చరించారు.
వాహనదారులకు హెచ్చరిక: రహదారులపై ప్రయాణించే వాహనదారులు వేగం తగ్గించి, అత్యంత జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని స్పష్టం చేశారు. అత్యవసర సమయాల్లో అందరూ అప్రమత్తంగా ఉంటూ, సురక్షిత ప్రాంతాల్లో లేదా ఇళ్లలోనే ఉండాలని సజ్జనార్ కోరారు.
- Supreme Court: అరెస్టు చేసిన 24 గంటల నిబంధనపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. అదుపులోకి తీసుకున్న క్షణం నుంచే గడువు లెక్కింపు
- Telangana Urban Projects: తెలంగాణకు మరో రూ.3,892 కోట్లు.. ఐదు పట్టణాభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
- Fake Rythu Bharosa Messages: రైతు భరోసా పేరుతో నకిలీ ఎస్ఎంఎస్ల కలకలం.. 2.73 లక్షల మంది రైతులకు మెసేజ్లు, సైబర్ క్రైమ్ డీజీపీకి ఫిర్యాదు చేసిన వ్యవసాయ శాఖ
- Conductor Pravalika: కండక్టర్ ప్రవళికకు కన్నీటి వీడ్కోలు.. మణుగూరులో అంత్యక్రియలు.. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన యువతి..
- Delhi Building Collapse: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. చావ్రి బజార్లో 3 అంతస్తుల భవనం కూలి ఇద్దరు మృతి, పలువురికి గాయాలు.. వీడియో ఇదిగో..