కాంగ్రెస్ ప్రకటించిన యూత్ డిక్లరేషన్ తెలంగాణలో డెత్ డిక్లరేషన్ గా మారింది..యువ సంగ్రామ సభలో కేటీఆర్.. (Video)
కాంగ్రెస్ ప్రకటించిన యూత్ డిక్లరేషన్ తెలంగాణలో డెత్ డిక్లరేషన్ గా మారింది..యువ సంగ్రామ సభలో కేటీఆర్..
బీఆర్ఎస్ యువజన సంగ్రామ సభలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రకటించిన “యూత్ డిక్లరేషన్” తెలంగాణలో “డెత్ డిక్లరేషన్”గా మారిందని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ హామీలు యువతకు ఉపయోగపడలేదని, రాష్ట్రంలో యువతను ప్రభుత్వం మోసం చేసిందని కేటీఆర్ విమర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసి ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. “20,000 పోలీస్ ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి, వాటిని నింపాలి” అని చెప్పి మీరందరూ దిల్సుఖ్నగర్లో ఆందోళన చేస్తుంటే, ఇవాళ రేవంత్ రెడ్డి అంటున్నాడు. “మీరు ఎండ్రిన్ తాగి సచ్చినా, బాయిలో దుంకినా నేను ఇయ్యను గాక ఇయ్యను” అంటున్నాడు. నీ అయ్య జాగీరా? నీ అయ్య సొమ్మా? ఎందుకు ఇయ్యవు? కేసిఆర్ గారు 48,000 పోలీస్ ఉద్యోగాలు ఇచ్చినప్పుడు నువ్వు ఎందుకు ఇయ్యవు? “నీ అయ్య జాగీరా?” అని నేను అడుగుతా ఉన్నా. ఉద్యోగాలు అడిగితే ఎండ్రిన్ తాగి చావమంటావా? దమ్ముంటే రేవంత్ రెడ్డి, సెక్యూరిటీ లేకుండా రేపు పొద్దున ఎల్బీ గ్రౌండ్ కి రా. ఎవడు బతకాలో, ఎవడు చావాలో, ఎవడేందో మా పోలీస్ అభ్యర్థులే తేలుస్తారని కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు.
అలాగే కేటీఆర్ నిరుద్యోగుల తల్లిదండ్రులను ఉద్దేశించి కూడా మాట్లాడారు. అందులో ప్రధానంగా ” టీవీలలో, పేపర్లలో, సోషల్ మీడియాలో ఈ సభలో మాట్లాడిన మాటలు విన్న తల్లిదండ్రులను కూడా నేను అడుగుతా ఉన్నా. ఈ విద్యార్థుల, నిరుద్యోగుల తల్లిదండ్రులని నేను అడుగుతా ఉన్నా, ఎవరికి ఓటు వేసినమో, ఎవరిని ఎన్నుకున్నామో ఇప్పటికన్నా మీకు అర్థమయిందని నేను అనుకుంటా ఉన్నా. మీరు పొలాలకు నీళ్లు అడిగితే “కోసి నెత్తురు చల్లుకోండి” అంటున్నాడు. మీ బిడ్డలు కొలువులు అడిగితే “ఎండ్రిన్ తాగండి, బాయిలో దుంకండి” అంటున్నాడు. ఎట్లాంటి ఉన్మాద పార్టీకి, ఎంత కావురం, ఎంత అహంకారం తలకెక్కిన దుర్మార్గుడికి మీరు ఓట్లు వేసినారో ఇప్పటికన్నా మీకు అర్థమయిందని నేను అనుకుంటా ఉన్నాను. అని గుర్తు చేశారు.
“25,000 మెగా డీఎస్సీ ఎక్కడ? దగా డీఎస్సీ చేసినావ్ నువ్వు, మెగా డీఎస్సీ కాదు ఇచ్చింది” అంటే, మళ్ళీ “నీ గుడ్లు వీకి గోటీలాడతాం” అని చిల్లర మాటలు మాట్లాడతాడు. వయోపరిమితి ఆనాడు కేసిఆర్ గారు పెంచినరు, “నువ్వు ఎందుకు తగ్గించినావ్? అట్లే ఉంచు” అంటే దాని మీద స్పందన ఉండదు. ఎందుకు ఇంత అహంకారం? ఎందుకు ఇంత బలుపు? ఈ అవమానాలు, ఈ అవహేళనలు తెలంగాణ పిల్లలు మర్చిపోతారు అనుకుంటున్నావా రేవంత్ రెడ్డి? ఎన్నికలకు ముందు మళ్ళీ ఒక గారడీ చేస్తా, ఏదో ఒక మాట చెప్తా, అంతా మాయామశ్చింద్ర చేసి గాయబ్ చేయొచ్చు అనుకుంటున్నావా? అని తీవ్ర విమర్శలు చేశారు.
నేడు ఇస్రోలో విక్రమ్ – 1 రాకెట్ లాంచ్ సందర్భాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ మాట్లాడుతూ.. టీ-హబ్ లో పురుడు పోసుకున్న ఒక కంపెనీ, దాని పేరు స్కైరూట్. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 79 ఏళ్లు అయింది. ఇయ్యాల ఆ స్కైరూట్ అనే కంపెనీ, ప్రపంచ చరిత్రలో కాదు, భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక ప్రైవేట్ రాకెట్ ను అంతరిక్షంలోకి పంపిన కంపెనీ మన టీ-హబ్ నుంచి వచ్చింది. ఇవ్వాళ ఉదయమే ఆ కార్యక్రమం జరిగింది. ఒకసారి గట్టిగా స్కైరూట్ వాళ్ళకి చప్పట్లతో అభినందనలు చెప్పాలని కోరుతా ఉన్నాను. అని కేటీఆర్ అభినందనలు తెలియజేశారు.