Skip to content
ఆంధ్రప్రదేశ్ వార్తలు

Jr NTR: జూలై 18న ఏం జరగబోతోంది… జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ…?

Prajapaksham 12 Jul 2026 0 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
Jr NTR: జూలై 18న ఏం జరగబోతోంది… జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ…?

జూలై 18న ఏం జరగబోతోంది... జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ...?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త చాప్టర్ ప్రారంభం కాబోతోందా… జూలై 18వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ ఒక కొత్త నిర్ణయం తీసుకోబోతున్నారా… అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే ఈ జూలై 18వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులను ప్రత్యేకంగా కలుస్తానని సభ ఏర్పాటు చేశారు.

ఇది ఎటువైపు దారి తీస్తుంది, ఈ సభ ఎందుకు ఏర్పాటు చేశారు అనేది వివరాలు ఇంకా తెలియరాలేదు. కానీ ఇంటర్నల్‌గా జరుగుతున్న చర్చ ప్రకారం చూసినట్లయితే ఇది పూర్తిగా జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ నిర్ణయం ఉండే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా తన అభిమానులను జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా కలవడానికి దీనికి పెద్ద ఎత్తున పొలిటికల్ మైలేజీ వచ్చేలా ఇప్పటికే సోషల్ మీడియాలో వార్తలు సిద్ధమవుతున్నాయి.

ఏపీ రాజకీయాల్లో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ పక్షంలో వైఎస్సార్సీపీ, అధికార పక్షంలోనే జనసేన ఉన్నాయి. ఇలా ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ దిశ ఎటువైపు ఉండే అవకాశం ఉంది అనే చర్చ కూడా సాగుతోంది. ఎందుకంటే ఆయన గతంలో 2009 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ ప్రచారంలో పాల్గొన్నారు. రాష్ట్రమంతా పర్యటించి పార్టీ కండువాతో ప్రచారం చేశారు. ఈ ప్రచారంలో భాగంగా ఆయనకు యాక్సిడెంట్ కూడా జరిగి ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.

ఆ తర్వాత జరిగిన మహానాడులో సైతం జూనియర్ ఎన్టీఆర్ పాల్గొనడం చూడవచ్చు. గతంలో తెలుగుదేశం పార్టీ తరపున కొడాలి నాని, వల్లభనేని వంశీలకు టికెట్లను ఇప్పించుకున్నది కూడా జూనియర్ ఎన్టీఆర్ అని స్వయంగా ఆయనే గతంలో కొన్ని సందర్భాల్లో మీడియాతో పేర్కొన్న సంగతి తెలిసిందే.

మరి ఇలాంటి పొలిటికల్ టచ్ ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ సైలెంట్‌గా ఉంటారా… అంటే కాదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఒకసారి పొలిటికల్ రుచి చూసిన తర్వాత వెనక్కు వెళతారు అనుకోవడం పొరపాటే అవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇప్పటికే తమిళనాడులో విజయ్ పొలిటికల్ ఎంట్రీ, ఆ తర్వాత సీఎం సీటు దిశగా విజయం అన్ని చకచక జరిగిపోయాయి. ఈ పరిణామాలు చూసిన తర్వాత సరైన ప్లానింగ్‌తో వెళితే సీఎం సీటు కొట్టడం పెద్ద అసాధ్యమేమీ కాదని విజయ్ ఉదాహరణ చెబుతోంది.

ఎందుకంటే ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా పెద్ద ఎత్తున విస్తరించింది. మారుమూల పల్లెటూరు వరకు చీమ చిటుక్కుమన్నా తెలిసే పరిస్థితి ఏర్పడింది. అందుకే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు ఇదే సరైన సమయం అని జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితులు కూడా భావిస్తున్నారు.

అయితే నిజానికి జూలై 18వ తేదీన కేవలం ఫ్యాన్స్ మీట్ మాత్రమే ఉంటుందని ఫిలింనగర్ వర్గాల్లో చర్చ నడుస్తున్నప్పటికీ కూడా, ప్రస్తుతం ఎలాంటి సమయం, సందర్భం లేకుండా ఇప్పుడు మీటింగ్ ఏంటి అని అంతా ఆరా తీస్తున్నారు.

అయితే ప్రస్తుతం మాత్రం దీనిపై సినిమా ఇండస్ట్రీతో పాటు అటు రాజకీయ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇక జూలై 18వ తేదీ కోసం మెయిన్‌స్ట్రీమ్ మీడియా నుంచి సోషల్ మీడియా వరకు అందరూ ఎదురు చూస్తున్నారు.

మరి జూనియర్ ఎన్టీఆర్ తన పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నారా… లేదా ఎప్పటిలా ఊరించి ఉసూరుమనిపిస్తారా అనేది వేచి చూడాల్సిందే.

ట్యాగ్‌లు: andhra pradesh jr ntr