శ్రీ లీల ఐరన్ లెగ్… అందుకే లెనిన్ నుంచి తప్పించారా..? చింటూ మాటలతో అమ్మడి కెరీర్ డ్యామేజ్…
శ్రీ లీల ఐరన్ లెగ్... అందుకే లెనిన్ నుంచి తప్పించారా..? చింటూ మాటలతో అమ్మడి కెరీర్ డ్యామేజ్...
టాలీవుడ్ సంచలనం కుర్ర హీరోయిన్ శ్రీలీలకు ఉన్న క్రేజ్ తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఏ హీరోయిన్‌కూ లేదు అని చెప్పవచ్చు. పెళ్లి సందడి సినిమాతో తెలుగు సినిమాల్లో సందడి మొదలుపెట్టిన ఈ అమ్మడు ధమాకాతో తొలి హిట్టు అందుకుంది. కానీ అదే దురదృష్టమో ఏమో వరుసగా పెద్ద హీరోలతో సినిమాలు ఓకే అయినా ఒక హిట్టు కూడా లేకుండా ప్రయాణం కొనసాగుతోంది.
మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ పోతినేని, రవితేజ ఇలా ఇండస్ట్రీలోని పెద్ద హీరోలు అందరి సరసన వరుసగా అమ్మడికి అవకాశాలు వచ్చాయి. కానీ అదేం బ్యాడ్ లక్కో అర్థం కాలేదు, వరుసగా అన్ని ఫ్లాపులే… మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ సరసన అమ్మడు హీరోయిన్‌గా చేసిన గుంటూరు కారం పైన పెద్దగా ఆశలు పెట్టుకుంది. కానీ గుంటూరు కారం బాక్సాఫీస్ వద్ద తన ఘాటు చూపించలేకపోయింది.
ఇక పవన్ కళ్యాణ్‌తో సుదీర్ఘంగా కొనసాగుతూ వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఉసూరుమనిపించింది. రామ్ పోతినేనితో కలిసి ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన స్కంద కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక తమిళంలో కూడా అమ్మడు ఎంట్రీ ఇచ్చి పరాశక్తి అంటూ తన అదృష్టం పరీక్షించుకుంది. అక్కడ కూడా వర్కౌట్ అవ్వలేదు.
మధ్యలో కేవలం బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాలో మాత్రం ముఖ్యమైన పాత్ర పోషించి ఒక సక్సెస్ మాత్రం అందుకుంది. కానీ అందులో గ్లామర్ ఏమాత్రం లేకపోవడం అమ్మడికి మైనస్ అని చెప్పవచ్చు.
సరిగ్గా ఇలాంటి సమయంలోనే అఖిల్ లెనిన్ సినిమాలో శ్రీలీలను ఎంపిక చేసుకున్నారు. షూటింగ్ కూడా ప్రారంభమైంది. సినిమాకు సంబంధించిన టైటిల్ రిలీజ్ చేసినప్పుడు హీరో అఖిల్ వెనుక భయపడుతూ రెండు జడలతో పల్లెటూరు అమ్మాయి గెటప్‌లో శ్రీలీల కనిపించింది. దీంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా రచ్చ మొదలైంది.
అయ్యగారు అఖిల్ గారికి ఇప్పటివరకు ఒక హిట్టు కూడా లేదు. అలాంటిది శ్రీలీల లాంటి ఐరన్ లెగ్గుతో సినిమా చేయిస్తే ఇక అయ్యగారు అస్సామే అని సోషల్ మీడియాలో పెద్దగా జోకులు పేలాయి.
దీంతో నిర్మాత సూర్యదేవర నాగవంశీ రంగంలోకి దిగి, హీరోయిన్‌గా శ్రీలీలను తప్పించి, భాగ్యశ్రీ బోర్సేతో రీప్లేస్ చేశాడు. ఇక శ్రీలీల కూడా అఖిల్‌కు మార్కెట్ లేకపోవడంతో, సినిమా ఛాన్స్ తప్పినా ఆమె పెద్దగా ఫీల్ అవ్వలేదు.
కానీ అనూహ్యంగా లెనిన్ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఇప్పుడు శ్రీలీల అభిమానులు అయ్యో ఈ సూపర్ హిట్ సినిమాలో శ్రీలీల ఉండి ఉంటే బాగుండేది అని నాలుక కరచుకుంటున్నారు.
ఇక పుండు మీద కారం చల్లినట్టు నిర్మాత సూర్యదేవర నాగవంశీ అలియాస్ చింటూ లెనిన్ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ, ఒక జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు మొహమాటం లేకుండా సమాధానం చెబుతూ శ్రీలీలను తప్పించడం తమకు కలిసి వచ్చిందని అనే అర్థంలో మాట్లాడారు.
అయితే కావాలని తప్పించలేదని, శ్రీలీలకు డేట్లు అడ్జస్ట్ కాకపోవడంతోనే తాము తప్పించాల్సి వచ్చిందని చింటూ చెప్పకనే చెప్పేశాడు. కానీ ఇది శ్రీలీల కెరీర్‌కు పెద్ద డ్యామేజ్ అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
ఇప్పటికే సోషల్ మీడియాలో శ్రీలీలను ఐరన్ లెగ్ అంటూ ట్రోలింగ్ చేస్తుంటే, వాటికి బలం చేకూర్చేలా నిర్మాత సూర్యదేవర నాగవంశీ అలియాస్ చింటూ చేసిన వ్యాఖ్యలు మరోసారి సంచలనంగా మారాయి అని చెప్పవచ్చు.
నిర్మాత చేసిన వ్యాఖ్యలపై అటు శ్రీలీల అభిమానులు కూడా గుర్రుగా ఉన్నారు. హిట్టు ఫ్లాపు అనేవి హీరోయిన్ నిర్ణయించదని, దర్శకుడి ప్రతిభ నిర్ణయిస్తుందని, సినిమాలు ఫ్లాప్ అయినా ఎవరూ కూడా శ్రీలీల పర్ఫార్మెన్స్ బాలేదని వ్యాఖ్యలు చేయలేదని గుర్తు చేస్తున్నారు.
అవును నిజమే. ఎందుకంటే లెనిన్ సినిమాకు ముందు భాగ్యశ్రీకి కూడా వరుస ఫ్లాప్స్ ఉన్నాయి. మంచి సినిమా పడితే సినిమా హిట్ అవుతుంది, హీరో హీరోయిన్ కెరీర్ సెట్ అవుతుంది. అంతేకానీ హీరోయిన్ వల్ల సినిమాలు హిట్ ఫ్లాపు కావు అని శ్రీలీల అభిమానులు సోషల్ మీడియాలో తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు.