Skip to content
బిజినెస్ వార్తలు

Real Estate: ఖాళీ స్థలం ప్లాట్ కొంటె లాభమా..? ఇండిపెండెంట్ ఇల్లు లేదా ఫ్లాట్ కొంటే లాభమా..?

Prajapaksham 08 Jul 2026 0 నిమిషాల పఠనం బిజినెస్
Real Estate: ఖాళీ స్థలం ప్లాట్ కొంటె లాభమా..? ఇండిపెండెంట్ ఇల్లు లేదా ఫ్లాట్ కొంటే లాభమా..?

Real Estate: ఖాళీ స్థలం ప్లాట్ కొంటె లాభమా..? ఇండిపెండెంట్ ఇల్లు లేదా ఫ్లాట్ కొంటే లాభమా..?

రియల్ ఎస్టేట్ అనేది తిరుగులేని పెట్టుబడిగా చెప్పవచ్చు బంగారం షేర్ మార్కెట్ ఇలా ఎన్ని రకాల పెట్టుబడులు ఉన్నప్పటికీ కూడా రియల్ ఎస్టేట్ ను మించిన పెట్టుబడి లేదు అని చెప్పవచ్చు ఎందుకంటే భూమిని నమ్ముకున్న వాడు ఎప్పుడూ మోసపోడని భూమి ఎప్పటికైనా బంగారం కన్నా విలువైనదని పెద్దలు చెబుతూ ఉంటారు అందుకు తగ్గట్టుగానే రియల్ ఎస్టేట్ రంగం అనేక మందిని శ్రీమంతులుగా మార్చింది. ప్రతి ఒక్కరు తమ కష్టార్జితంలో తప్పనిసరిగా సొంత ఇంటి కోసం దాచుకుంటారు ఎందుకంటే ఎప్పటికైనా సొంత ఇంట్లో జీవించాలి అనేది వారి జీవితకాలపు కల. అయితే ఈ కలను నెరవేర్చుకోవడానికి చాలామంది ఖాళీ స్థలం లేదా ప్లాట్ కొనుగోలు చేస్తూ ఉంటారు. లేదంటే ఇండిపెండెంట్ ఇల్లు కుదరదు అనుకుంటే అపార్ట్మెంట్ ఫ్లాట్ కొనుగోలు చేస్తారు. అయితే చాలామందికి సందేహాలు ఉంటాయి లాభమా కన్స్ట్రక్షన్ పూర్తయినటువంటి ఇల్లు కొంటె లాభమా వంటి సందేహాలు ఉంటాయి వీటి పైన మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుందాం.

ఖాళీ స్థలం లేదా ప్లాట్ కొంటే లాభమా…? నష్టమా…?
రియల్ ఎస్టేట్లో చాలామంది భూమిపైన పెట్టుబడి పెడుతుంటారు అంటే ఖాళీ స్థలం కొనుగోలు చేస్తుంటారు కొంతమంది వ్యవసాయ భూములు కొనుగోలు చేస్తే మరి కొంత మంది రెసిడెన్షియల్ ప్లాట్స్ కొనుగోలు చేస్తారు అయితే రెసిడెన్షియల్ ప్లాట్స్ కొనుగోలు చేసే సమయంలో చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ముందుగా ఆ భూమికి సంబంధించినటువంటి పూర్తి డాక్యుమెంట్స్ పక్కాగా ఉన్నాయా లేదా ఒకసారి తనకి చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత మాత్రమే మీరు ఖాళీ స్థలం లేదా ఫ్లాట్ అనేది కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సాధారణంగా ప్లాట్లు కొనుగోలు చేసినప్పుడు అవి కొన్ని సంవత్సరాల తర్వాత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది అప్పుడు మీరు పెట్టిన పెట్టుబడి కన్నా పెద్ద మొత్తంలో డబ్బు రిటర్న్ లభించే అవకాశం ఉంటుంది. అయితే ఖాళీ స్థలం లేదా ప్లాట్ అనేది మీరు ఎంపిక చేసుకున్నటువంటి లొకేషన్ ను బట్టి అది ఆధారపడి ఉంటుంది కొన్నిసార్లు రోడ్డుకు దగ్గర కానీ ఏవైనా కొత్త ప్రాజెక్టులు చేపట్టినప్పుడు గాని ఆ సమీప ప్రాంతాల్లో ప్లాట్లను కనుక కొనుగోలు చేసినట్లయితే, మీకు పెద్ద మొత్తంలో రిటర్న్ లభించే అవకాశం ఉంటుంది. అయితే మీరు ఒకవేళ లోన్ తీసుకొని ఖాళీ స్థలం లేదా ప్లాట్ లాంటిది కొనుగోలు చేసినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఖాళీ స్థలం లేదా ప్లాట్ నుంచి మీకు ఎలాంటి ఆదాయం లభించదు. కానీ మీరు ప్రతి నెల ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది దీని దృష్టిలో ఉంచుకొని మీరు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

ఇండిపెండెంట్ ఇల్లు లేదా అపార్ట్మెంట్ ప్లాట్ కొంటే లాభమా నష్టమా…?
నిజానికి పూర్తిగా నిర్మాణం జరిగినటువంటి ఇల్లు లేదా అపార్ట్మెంట్ ఫ్లాట్ గనుక కొనుగోలు చేసినట్లయితే అందులో మీరు వెంటనే వెళ్లి నివాసం ఉండవచ్చు తద్వారా మీకు ఇంటి అద్దె చెల్లించాల్సిన పని ఉండదు. . ఒకవేళ మీరు ఆ ఇంటి నుంచి ఆదాయం పొందాలి అనుకున్నట్లయితే దాన్ని రెంటుకు ఇచ్చినట్లయితే చక్కటి ఆదాయం ఇంటి అద్దె రూపంలో లభిస్తుంది. మీరు సొంత ఇంటిని కొనుగోలు చేయడానికి లోన్ గనుక తీసుకున్నట్లయితే మీరు అందులో నివాసం ఉండటంతో పాటు ప్రతినెల ఇఎంఐ చెల్లించుకున్నట్లయితే ఆ ఇల్లు మీ సొంతం అవుతుంది. ఇలా మీకు ఇండిపెండెంట్ ఇల్లు లేదా అపార్ట్మెంట్ ప్లాట్ కొనుగోలు చేయడం వల్ల లాభాలు ఉన్నాయి. ఇక నష్టాల విషయానికి వచ్చినట్లయితే సరైన అనుమతులు లేకపోయినట్లయితే ఆ ఇంటిని ప్రభుత్వం స్వాధీనం సైతం చేసుకునే అవకాశం ఉంటుంది కనుక డాక్యుమెంట్స్ అన్నీ జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత మాత్రమే మీరు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

ట్యాగ్‌లు: business news real estate