Skip to content
జాతీయం వార్తలు

ఆధునిక కవితా విప్లవం వచన కవిత

Prajapaksham 22 Jun 2026 0 నిమిషాల పఠనం జాతీయం
ఆధునిక కవితా విప్లవం వచన కవిత

Vachana Kavitha: The Revolution That Redefined Modern Poetry

తెలుగు సాహితీ వనంలో సాంప్రదాయ ఛందోబద్ధ కవిత్వం నుండి ఆధునిక వచన కవిత్వం వైపు సాగిన ప్రయాణం ఒక గొప్ప చారిత్రక పరిణామం. పద్యం యొక్క కట్టుబాట్లను, ప్రాస నియమాలను తెంచుకుని, సామాన్యుడి భాషలో, సమకాలీన సామాజిక అంశాలను వస్తువుగా చేసుకుని పుట్టుకొచ్చిందే ‘వచన కవిత’. ఇది కేవలం ఒక ప్రక్రియ మాత్రమే కాదు; భావ ప్రకటన స్వేచ్ఛకు, సామాజీక చైతన్యానికి నిదర్శ నిరక్షరాస్యులకు సైతం సులభంగా అర్థమై, వారి హృదయాలను కదిలించగల శక్తి వచన కవితకు ఉంది.తెలుగులో వచన కవితా పితామహుడిగా కుందుర్తి ఆంజనేయులు గారిని పేర్కొంటారు. ఆయన వచన కవితా ఉద్యమాన్ని ఒక బలీయమైన శక్తిగా మార్చారు.
అంతకుముందు గురజాడ అప్పారావు గారు ముత్యాల సరాలతో ఛందస్సును సరళతరం చేయగా, శ్రీశ్రీ ద్వారా కవిత్వ వస్తువును, శైలిని పూర్తిగా మార్చివేశారు. ఆ తర్వాత వచ్చిన కవులు పద్య నియమాలను పూర్తిగా పక్కనబెట్టి, వచన రూపంలోనే అద్భుతమైన కవిత్వాన్ని పండించవచ్చని నిరూపించారు. కవితలో మాత్రా ఛంద స్సు గానీ, గణ నియమాలు గానీ, ప్రాస నియమాలు గానీ ఇందులో ఉండవు. గ్రాంథిక భాష కు బదులుగా, ప్రజలు నిత్య జీవితంలో మాట్లాడే వాడుక భాషను (శిష్టవ్యవహారికం) ఇందులో ఉపయోగిస్తారు. రాజుల వంశ చరితలు, దేవుళ్ళ లీలల స్థానంలో… సామాన్యుడి కష్టం, ఆకలి, నిరుద్యోగం స్త్రీవాదం, దళిత సమస్యలు, ప్రపంచీకరణ వంటి సమకాలీన అంశాలు కవిత్వ వస్తువులయ్యాయి. పైకి వచనంలా కనిపించినా, చదివేటప్పుడు ఒక అంతర్గతమైన లయ మరియు భావ తీవ్రత వచన కవితకు ప్రాణం పోస్తాయి. కవిత తెలుగు సాహిత్యాన్ని ‘సార్వజనీనం‘ చేసింది. ఒకప్పుడు కవిత్వం రాయాల చదవాలన్నా పండితులకు మాత్రమే సాధ్యమయ్యేది. కానీ వచన కవిత ద్వారా కవిత్వం సా ఆయుధంగా మారింది.
‘కాదేదీ కవితకనర్హం‘ అన్న శ్రీశ్రీ సూక్తిని వచన కవులు అక్షరాలా నిజం చేశారు. కుక్కపిల్ల, అగ్గిపుల్ల, రొట్టెముక్క… ఇలా ఏదైనా కవిత్వానికి వస్తువు కాగలదని నిరూపించారు. కాలాల్లో వచ్చిన సా మాజిక ఉద్యమాలకు వచన కవిత అద్దం పట్టిం ది. అభ్యుదయ కవిత్వం శ్రామికుల కష్టాలను, పెట్టుబడిదారీ వ్యవస్థపై తిరుగుబాటును చాటిం ది, దిగంబర కవిత్వం సమాజంలోని కుళ్లును, నైతిక పతనాన్ని నిలదీసింది.స్త్రీవాద, దళితవాద కవిత్వాలు సమాజంలో శతాబ్దాలుగా అణచివేతకు గురైన వర్గాల గొంతుకగా మారి, హక్కుల కోసం పోరాడే చైతన్యాన్ని రగిల్చాయి. వస్తున్న పద్య సంకెళ్లను తెంచుకు ని, స్వేచ్ఛా విహంగంలా ఎగిరిన వచన కవిత, ఆధునిక తెలుగు సాహిత్యంలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రక్రియగా నిలిచింది. కాలంతో పాటు మారుతూ, సరికొత్త ధోరణులను సంతరించుకుంటూ నేటికీ సమాజంలోని అన్యాయాలపై అక్షర శరాలను సంధిస్తూనే ఉంది. కేవలం రూపంలోనే కాదు, భావంలోనూ విప్లవాన్ని తెచ్చిన వచన కవిత తెలుగు వారి ఆలోచనా సరళిని ఆధునీకరించడంలో కీలక పాత్ర పోషించిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
సుధాకర్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *