Telangana: విలీన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడానికి భయమెందుకు.. ప్రభుత్వానికి సూటి ప్రశ్న సంధించిన సీపీఐ నేతలు..
CPI Leaders
Telangana: ప్రపంచ చరిత్రలోనే 4500 మంది అమరవీరుల రక్తతర్పణంతో లిఖించబడిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను గుర్తించేందుకు, విలీన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడానికి పాలకులకు భయమెందుకని సిపిఐ నాయకులు ప్రశ్నించారు. తెలంగాణ విలీన దినోత్సవ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తే కొంత మంది బాధపడతారని గత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు చెప్పిన విషయాలనే నేటి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ కూడా చెబుతున్నారని విమర్శించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరుల త్యాగాల ఫలితమే నాటి హైదరాబాద్ సంస్థానం విలీనం, నేటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమని వారు స్పష్టం చేశారు. ఆ వీరోచిత సాయుధ పోరాట చరిత్రను గుర్తించాల్సిందేనని, వీలిన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాల్సిందేనని వారు డిమాండ్ చేశారు.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సందర్భంగా సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ ఎగ్జిబిషన్ మైదానంలో ‘పోరాట స్పూర్తి సభ’ జరిగింగింది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన జరిగిన సభలో సిపిఐ జాతీయ కార్యదర్శులు పల్లా వెంకట రెడ్డి, కె.రామకృష్ణ, సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె.నారాయణ, సిపిఐ మాజీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు తక్కళ్ళపల్లి శ్రీనివాస్, ఈ.టి. నరసింహా ప్రసంగించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పశ్య పద్మ, బాగం హేమంతరావు, కలవేన శంకర్, ఎం.బాల నర్సింహ, వి.ఎస్.బోస్, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, సిపిఐ సీనియర్ నాయకులు సయ్యద్ అజీజ్ పాషా, డాక్టర్ బి.వి.విజయలక్ష్మి, పి.ప్రేమ్ పావని, మౌలానా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వివిధ జిల్లాల కార్యదర్శులు వేదికపై ఆశీనులయ్యారు.
రేవంత్ వచ్చిన తర్వాతే కాంగ్రెస్ ప్రజాపాలనా?: పల్లా వెంకట రెడ్డి
తెలంగాణ స్వాతంత్ర దినోత్సవమైన సెప్టెంబర్ 17ను కాంగ్రెస్ ప్రభుత్వం ‘ప్రజా పాలన దినోత్సవం’గా బిఆర్ ‘సమైక్యత దినోత్సవం’, బిజెపి ‘విమోచనం దినోత్సవం’ పేరుతో బహిరంగ సభలను నిర్వహించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పల్లా వెంకట రెడ్డి అన్నారు. తెలంగాణ విలీన దినోత్సవం అధికారికంగా నిర్వహించడం వల్ల కొంత మంది బాధపడుతారని గతంలో నాటి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నిసిగ్గుగా చెప్పాన విషయాలనే నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్నారని విమర్శించారు. దేశాన్ని, రాష్ట్రాన్ని అంత్యంత ఎక్కువ కాలం పాలించింది కాంగ్రెసేనని, సిఎంగా రేవంత్ అధికారం చేపట్టిన తర్వాతే కాంగ్రెస్ ప్రజా పాలన కొనసాగిస్తున్నదా? అంతకు ముందు ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రులది ప్రజా పాలన కాదా అని వెంకట రెడ్డి ప్రశ్నించారు. కమ్యూనిస్టుల నిజమైన చరిత్రను చెప్పే దమ్ము, ధైర్యం లేకనే కాంగ్రెస్, బిజెపి, బిఆర్ నాయకులు కేవలం రాజకీయ లబ్ది కోసమే ఈ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు.

బిజెపి ఏకంగా తమ మొదటి శత్రువులు కమ్యూనిస్టులగా భావిస్తూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చరిత్రను పూర్తిగా వక్రీకరిస్తూ దేశంలో మళ్లీ అర్ధ భూసామ్య వ్యవస్థను, మనువాద సిద్దాంతాన్ని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోందన్నారు. అందులోభాగంగానే బిజెపి ప్రభుత్వం కమ్యూనిజాన్ని నామ రూపాలు లేకుండా చేయాలనే తలంపుతో మొదటగా మావోయిస్టులను ఏరివేసే కార్యక్రమం చేపట్టి ప్రస్తుతం కమ్యూనిస్టులను అర్భన్ నక్సలైట్లుగా ముద్ర వేస్తున్నదన్నారు. గత 12 ఏళ్లుగా దేశాన్ని పరిపాలిస్తూ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న బిజెపిని గద్దె దించడమే లక్షంగా ‘బద్లావ్ జరూరీ హై’ నినాదంతో సిపిఐ దేశ వ్యాప్తంగా పాద యాత్రలు, ప్రజా ప్రచార యాత్రలు నిర్వహించి సెప్టెంబర్ 1న ఢిల్లీలో బహిరంగ సభను నిర్వహించిందన్నారు. ఈ క్రమంలోనే బీహర్ జరిగిన ఉప ఎన్నికల్లో గత 50 ఏళ్లుగా గెలుపొందుతూ వస్తున్న బిజెపి ఆ స్థానంలో ఓడిపోవడం ద్వారా మార్పునకు నాంది పలికిందన్నారు.
కమ్యూనిస్టులే దేశ భవిష్యత్
“రాజకీయ ప్రత్యామ్నయం కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రత్యామ్నయం ఉన్న చోట ప్రజా వ్యతిరేక పాలకులను ప్రజలు ఖచ్చితంగా ఓడిస్తారు. ఆ ప్రత్యామ్నాయం కమ్యూనిస్టులే కావాలని, అందుకు కమ్యూనిస్టు పార్టీలన్నీ ఏకం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు” అని పల్లా వెంకట రెడ్డి అన్నారు. ఇందుకు వామపక్ష పార్టీలు ఇప్పటికిప్పుడు ఏకం కాకపోయినా ఎన్నికల్లో మాత్రం కమ్యూనిస్టు పార్టీలన్నీ ఒకే గుర్తుపై పోటీ చేస్తే ప్రజలు ఆలోచిస్తున్న ప్రత్యామ్నయం కమ్యూనిస్టులు కాగలుగుతారని, ఆ దిశగా వామపక్ష పార్టీల నాయకులు కలిసి రావాలని పల్లా వెంకట రెడ్డి కోరారు.

బిజెపి నాయకులు ఎక్కడి నుంచి ఏమి విమోచన చేశారు? కూనంనేని సాంబశివరావు
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వారుసులుగా సెప్టెంబర్ 17ను ‘తెలంగాణ స్వాతంత్ర దినోత్సవం’ పేరుతో ఉత్సవాలు జరుపుకుంటున్నాం. కాంగ్రెస్ ’ప్రజాపాలన’ బిఆర్ ‘సమైక్యత దినోత్సవం’, బిజెపి ‘విమోచన దినోత్సవం’ పేరుతో సభలు జరుపుకోవడం సిగ్గుచేటని కూనంనేని సాంబశివరావు విమర్శించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చరిత్రను చరిత్రగా గుర్తించలేని కాంగ్రెస్, బిజెపి నాయకులు చరిత్ర నిర్మాణకారులు కాదని, వారు చరిత్ర విచ్చిన్నకారులని అగ్రహాం వ్యక్తం చేశారు. విమోచన దినం’ పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తున్న బిజెపి నాయకులు ఎక్కడి నుంచి ఏమి విమోచన చేశారు? ఎందుకు ఆ పేరు పెట్టుకున్నారో చెప్పాలని సాంబశివరావు ప్రశ్నించారు.

తెలంగాణ సాయుధ పోరాటంలో ఆ పార్టీకి చెందిన ఒక్క నాయకుడైనా పాల్గొన్నాడా, వారి వారుసులు ఒక్కరైనా ఉన్నారా చెప్పాలని ఆయన నిలదీశారు. “హైదరాబాద్ సంస్థానాన్ని మా సర్దార్ వల్లభాయ్ పల్ విమోచన చేశారని బిజెపి నాయకులు అంటున్నారు. నిజాంను రాజ్ ప్రముఖ్ (గవ్నరర్) నియమిస్తూ నియామక పత్రాన్ని ఇచ్చింది మీ సర్దార్ వల్లభాయ్ పలే. గాంధీజి గాడ్సే హత్య చేసిన అనంతరం ఆర్ నిషేధించింది కూడా మీ సర్దార్ వల్లభాయ్ పలే. మీ అనుకుంటున్న సర్దార్ వల్లభాయ్ పల్ ఇప్పుడు బతికి ఉం మీలాంటి మూర్ఖులు, మీలాంటి మతమౌఢ్యులకు నేను నాయకుడిని ఎలా అయ్యాను” అని చింతించేవారని కూనంనేని సాంబశివరావు అన్నారు.
ఎర్రజెండా వారసులమంతా ఒక్కటవుద్దాం
కమ్యూనిస్టులుగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట నిజమైన వారసులుగా ఈ నేల కోసం, పేదవాడి కోసం అమరులు చిందించిన రుధిర చుక్కలన్నీ కలబోసిన ఆ ఎర్రజెండాను భుజన వేసుకున్న కమ్యూనిస్టులమంతా ఒక్కటవుదామని వామపక్ష పార్టీలకు కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. అలా ఒక్కటైన కమ్యూనిస్టులంతా ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎటువంటి కష్టాలకైనా సిద్ధపడదామని, అవి జైళ్లు గాని, లాఠీలు గాని, తుటాలు గాని దేనికైనా సిద్ధపడదామన్నారు. తద్వారా పోరాటం, త్యాగం, వీరత్వం, జాలి, కరుణ అం కమ్యూనిస్టులని, దేనికైనా సరే మనుషుల కోసం పుట్టిన సిద్ధాంతమే కమ్యూనిజమని నిరూపిద్దామని కూనంనేని సాంబశివరావు అన్నారు.
పొరాట చరిత్రలేని బిజెపి వారు సర్టిఫికేట్లు ఇస్తుండడం సిగ్గుచేటు : కె.రామకృష్ణ
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలోనే కాదు దేశ స్వాతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొనని ఆర్ బిజెపి నాయకులు నేడు దేశభక్తులు, దేశభక్తులు కాదని సర్టిఫికెట్లు ఇస్తుడడం సిగ్గుచేటని కె.రామకృష్ణ అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం రెండు మతాలు, కులాల మధ్య జరిగిన పోరాటం కాదని, భూమి, భుక్తి, నిజాం పాలన నుంచి విముక్తి కోసం సాగిన ప్రజా పోరాటమని ఈ పోరాటంతో ఏ సంబంధం లేని బిజెపి, ఆర్ శక్తులు చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆర్థిక, రైతు, నిరుద్యోగ సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని, కేవలం మతాల మధ్య చిచ్చు పెట్టి ప్రజలను విభజించే రాజకీయాలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకికవాద పరిరక్షణకు లౌకిక శక్తులన్నీ ఐక్యంగా ముందుకు రావాలని ఆయన కోరారు. వామపక్ష పార్టీలన్నీ ఐక్యమై కమ్యూనిస్టు ఉద్యమ పునరేకీకరణకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఉపరాష్ట్రపతితో అబద్దాలు చెప్పిస్తున్నారు : డాక్టర్ నారాయణ
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతో ఏ సంబంధంలేని బిజెపి విమోచనం దినం పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తూ దేశ ద్వితీయ పౌరుడైన ఉపరాష్ట్రపతితో అబ్దదాలను చెప్పించే స్థాయికి ఆ పార్టీ నాయకులు దిగజారడం విచారకరమని డాక్టర్ కె.నారాయణ అన్నారు. చరిత్రను వక్రీకరించే కుటిల ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో ఏ భూమి కోసమైతే కమ్యూనిస్టులు నిలబడ్డారో వారు బలహీనపడటంతోనే భూమి కోసం ఇతర శక్తులు పోటీ పడుతున్నాయన్నారు. అదే కమ్యూనిస్టు ఉద్యమం బలంగా ఉండి ఉం పేదలకు ఆ భూమి దక్కేదని పేర్కొన్నారు.

‘దున్నేవాడికే భూమి’ నినాదంతో కమ్యూనిస్టులు సాగించిన పోరాట స్ఫూర్తితో పేదలకు భూములు దక్కేలా ఉద్యమాలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. కేవలం నిరసనలు, ఫొటోలకు పరిమితం కాకుండా స్థానికంగా ప్రజలను సమీకరించి ప్రత్యక్ష, సమరశీల పోరాటాలు నిర్వహించాలని కోరారు. జనాభా పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద దేశమైన భారత ప్రధాని అమెరికా అధ్యక్షుడి ముందు మోకరిల్లడం సిగ్గుచేటని పేర్కొన్నారు. దేశం నుంచి చమురు కొనాలో వద్దో డొనాల్డ్ ట్రంప్ నిర్ణయిస్తే ప్రధాని మోదీ దానిని పాటించడం ఆక్షేపనీయమన్నారు. ట్రంప్ ప్రధాని మోదీ బానిసగా మారితే మోదీకి ఎపి ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, తెలంగాణలో బిఆర్ కార్యనిర్వాహక అధ్యక్షులు కెటిఆర్ బానిసలుగా మారి సమర్థిస్తున్నారని ఆయన విమర్శించారు.
తెలంగాణ అమరవీరుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి: చాడ వెంకట రెడ్డి
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్ర, అమరుల త్యాగాలు శాశ్వతంగా ఉండాలం ‘తెలంగాణ అమరవీరుల కార్పొరేషన్’ ఏర్పాటు చేయడంతో పాటు త్యాగధనుల చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని చాడ వెంకట రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని మొదటి నుంచి కనుమరుగు చేసే కుట్ర సాగిందని, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తర్వాత కెసిఆర్ ప్రభుత్వం ఇప్పడు రేవంత్ ప్రభుత్వం కూడా అదే చేస్తోందన్నారు. నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసులుగా వారి స్ఫూర్తితో దున్నేవాడికే భూమి, పేదవాడికి నివేశన స్థలం నినాదంతో ఉదృతమైన భూపోరాటలకు కంకణబద్దులు కావాలని చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.
- KCR Farm House: కేసీఆర్ ఫాంహౌస్ కేంద్రంగా రేవంత్ పుట్టిస్తున్న భూకంపం…గులాబి బాసు కాళ్లకింద ల్యాండ్ మైన్ అవుతుందా..?
- KTR At ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టులో విచారణకు.. కేటీఆర్ హాజరు..ఫార్ములా-ఈ కేసు విచారణ అక్టోబర్ 30కి వాయిదా
- Telangana Minister Ponguleti: అసైన్డ్ భూముల పట్టాలు ఉన్నవారిని ఎలాంటి ఇబ్బంది పెట్టము.. వట్టి నాగుల పల్లె భూమి నాది కాదు… మంత్రి పొంగులేటి స్పష్టం..
- Telangana 22A Land Issues: 22A భూముల సమస్యలకు హై లెవల్ కమిటీ.. ఫాస్ట్ ట్రాక్‌లో పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం
- Tata Group Stocks: టాటా గ్రూప్‌లో ఛైర్మన్ కొట్లాట.. భారీగా పడిపోయిన కంపెనీ షేర్లు.. కారణం ఏంటంటే..