వీడియో ఇదిగో.. పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్ర.. మిత్రుడిని తలుచుకుని కన్నీళ్లు పెట్టుకున్న హరీశ్ రావు..
harish Rao Tears
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో బీఆర్ఎస్ నేత హరీష్ రావు కన్నీళ్లు పెట్టుకున్నారు. తన ఆప్త మిత్రుడికి తుది వీడ్కోలు పలికేందుకు వచ్చిన మాజీ మంత్రి హరీశ్ రావు స్నేహితుడిని తలుచుకుని ఒక్కసారిగా భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. బీఆర్ఎస్ నాయకులతో కలిసి అంతిమయాత్రలో పాల్గొన్న ఆయన.. సుదర్శన్ రెడ్డితో ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు.
పెద్ది సుదర్శన్ రెడ్డికి చివరి వీడ్కోలు పలికేందుకు వేలాదిగా ప్రజలు నర్సంపేటకు తరలివచ్చారు. అభిమాన నాయకుడిని చివరిసారిగా చూసేందుకు చిన్నా, పెద్దా తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు భారీగా తరలిరావడంతో పట్టణమంతా జనసంద్రంగా మారింది. ఆయన పార్థివదేహం నర్సంపేటకు చేరుకున్నప్పటి నుంచి ప్రజలు బారులు తీరుతూ అశ్రునివాళి అర్పించారు.
అభిమానుల భారీ రద్దీ కారణంగా నర్సంపేట ప్రధాన రహదారులపై సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. వాహనాలు నెమ్మదిగా కదలడంతో పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ ఏర్పాట్లు చేసి పరిస్థితిని నియంత్రించారు. అంతిమయాత్రలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పెద్ది సుదర్శన్ రెడ్డికి కన్నీటి వీడ్కోలు పలికారు.
- నిష్కామ కర్మయోగి… చుక్కా రామయ్య..
- బిజెపి, ఆర్ఎస్ఎస్ సంస్థలకు భారీగా విదేశీ నిధులు
- అగ్రనాయక త్రైపాక్షిక సమ్మిట్ ఏమి సాధించింది ?
- CEC, EC నియామక చట్టంపై సుప్రీంకోర్టులో కీలక పరిణామం.. రీకాల్ పిటిషన్పై విడిగా విచారణకు నో.. అసలు వివాదం ఏమిటి?
- AI in Banking: ఏఐ తప్పిదాలతో ఆర్థిక సంస్థలకు భారీ ముప్పు.. అప్రమత్తత అవసరమని బ్యాంకులకు ఎస్బీఐ చీఫ్ హెచ్చరిక..