Danam Nagender: ఓట్ల తొలగింపుపై భగ్గుమన్న దానం..పునరుద్ధరించకుంటే హైదరాబాద్ మొత్తం తగలబడిపోతుందని సంచలన వ్యాఖ్యలు..
Danam Nagender
Danam Nagender: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపుపై మాజీ మంత్రి దానం నాగేందర్ ఎన్నికల సంఘం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం తన వైఖరిని మార్చుకోకపోతే ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ క్రమంలో హైదరాబాద్ మొత్తం తగలబడిపోతుందని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. హిమాయత్‌నగర్ డివిజన్లో సీసీ రోడ్ల పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా దానం నాగేందర్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.
ఎన్నికల సంఘం అధికారులు బీజేపీతో కుమ్మక్కై పనిచేస్తున్నారని దానం నాగేందర్ ఆరోపించారు. హిమాయత్‌నగర్ డివిజన్ పరిధిలోనే సుమారు 20 వేల ఓట్లను ఏకపక్షంగా తొలగించారని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ కేంద్రంగా బీజేపీ నాయకులు వ్యవస్థీకృతంగా ‘ఓట్ చోరీ’కి పాల్పడుతున్నారని విమర్శించారు. ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్‌లో నివసిస్తున్న ప్రజల ఓట్లను తొలగించడం ప్రజాస్వామ్య హక్కులకు విరుద్ధమని ఆయన వ్యాఖ్యానించారు.
తన నియోజకవర్గ పరిధిలో ప్రతి ఒక్కరి ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని దానం నాగేందర్ అన్నారు. ఓటర్ల జాబితా నుంచి తొలగించిన పేర్లను వెంటనే పునరుద్ధరించాలని ఆయన ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఈసీ స్పందించకపోతే నిరసనలు, ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఇదిలా ఉండగా, దానం నాగేందర్‌కు సంబంధించి ఇటీవల కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడంతో తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేసింది. ఈ తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థించడంతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీగా ప్రకటించబడింది.
- El Niño Alert: సూపర్ ఎల్ నినో ముప్పు.. రానున్న 10 నెలలు అత్యంత కీలకం.. సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక
- Parliament Special Session: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు కేంద్రం సన్నాహాలు.. డీలిమిటేషన్, మహిళా కోటా బిల్లులే అజెండా..
- Weather Alert: గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వానలు కురుస్తాయని ఐఎండీ ప్రకటన
- డబ్బుల కోసం నటించాలనుకోను.. ‘క్రేజీ కల్యాణం‘ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్
- ‘అమ్మ కదిలి వచ్చె’ సాంగ్ రిలీజ్