Telangana Weather Update: తెలంగాణలో 7 రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు యెల్లో అలర్ట్
ai generated image
తెలంగాణలో 7 రోజుల పాటు వర్షాలు
ప్రజాపక్షం/హైదరాబాద్ : రాష్ట్రంలో వచ్చే వారం రోజుల పాటు వర్షాలు కొనసాగనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలి పారు. (Telangana Weather Update) రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముండగా, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వెల్ల డించారు. ఉరుములు, మెరుపులు, గంటకు 3040 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశముందని హెచ్చరించారు. వాతావరణ కేంద్రం గురు వారం మధ్యాహ్నం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం గురువారం నుంచి శుక్రవారం వరకు ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శుక్ర, శనివారాల్లో మంచిర్యాల, జగి త్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్త గూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని చెప్పారు.
శని, ఆదివారం ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామా రెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక జారీ చేశారు. సోమవారం ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. సోమ, మంగళవారం రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల ల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలి పారు. ఈనెల 30 నుంచి జూలై 2 వరకు రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందన్నారు. ఇక రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గే అవకాశం ఉందన్నారు. ఆ తర్వాత పెద్దగా మార్పులు ఉండకపోవ చ్చని అధికారులు తెలిపారు.
తరచుగా అడిగే ప్రశ్నలు FAQs
Q. తెలంగాణలో ఎంతకాలం వర్షాలు పడనున్నాయి?
A. వాతావరణ శాఖ ప్రకారం వచ్చే 7 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Q. ఏ జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక ఉంది?
A. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, రంగారెడ్డి తదితర జిల్లాలకు వేర్వేరు రోజుల్లో భారీ వర్షాల హెచ్చరికలు జారీ అయ్యాయి.
Q. ఉష్ణోగ్రతల్లో మార్పు ఉంటుందా?
A. రానున్న రెండు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2–5 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.