యుపి ఎమ్మెల్సీ ఎన్నికలు బిజెపిలో కలవరం
The Modi Government's Dilemma Sparks Political Debate
డాక్టర్ జ్ఞాన్‌పాఠక్
ఎం.ఎల్.సి. ఎన్నికల ఫలితాలు వెలువడిన తదుపరి అక్టోబర్ 28న కాంగ్రెస్ నష్టాన్ని గేలిచేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పోస్టు పెట్టారు. బిజెపి ఆర్‌ఎస్‌ఎస్ గోత్రీకులు దాన్ని అనుసరించారు. ప్రధానమంత్రి పోస్టు ఇలా వుంది “4 పెద్ద రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్, కర్నాటకల్లో 28సీట్లకు శాసనమండలి సభ్యుల కోసం ఎన్నికలు జరిగాయి. బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు జరిపారు. కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలిచిందో ఊహించండి?”. బిజెపి నాయకుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవీస్ నుంచి జవాబు వచ్చింది “పెద్ద సున్న! కాంగ్రెస్ నిలకడగా ఉంది” అని ఆయన రీ పోస్టు చేశారు.
బిజెపి ప్రధాన కార్యదర్శి ఒకరు ముంబయి నుంచి ఇలా పోస్టు పెట్టారు : “బ్యాలెట్ పేపర్ లేదా ఇవిఎం కాంగ్రెస్ ఫలితం ఒక్కటే!”. అయితే ఆ తర్వాత వెలువడిన మహారాష్ట్ర ఫలితం పడ్నవీస్‌ను ఎంతో అవమానభారంలో పడేసింది. ఎందుకంటే ఆయన సొంత జిల్లా నాగపూర్ సీటును కాంగ్రెస్ గెలుచుకుంది. అది ఆర్‌ఎస్‌ఎస్ కేంద్ర కార్యనిర్వాహక కేంద్రం కూడా. పడ్నవీస్ సిగ్గుతో తన పోస్టు తొలగించారు.
ఇవిఎంల్లో ఓట్లు తారుమారు చేస్తున్నారని ఆరోపిస్తూ, అన్ని ఎన్నికలు బ్యాలెట్ పేపర్‌తో జరపాలని కాంగ్రెస్ చేస్తున్న డిమాండ్‌ను గుర్తు చేస్తూ ప్రధాని తమ ట్వీట్‌లో బ్యాలెట్ పేపర్ ప్రస్తావన చేశారు. అయితే 2014 నుంచి తాను లోక్‌సభలో ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో పట్టభద్రులు, ఉపాధ్యాయులు రెండు ఎంఎల్‌సి స్థానాలను సమాజ్‌వాది పార్టీకి కోల్పోయినందుకు నరేంద్రమోదీ సిగ్గుపడలేదు. ఆయన కాళ్ల కింద రాజకీయ ఇసుక కదులుతున్నది. మండలి ఎన్నికలు పార్టీ గుర్తులతో జరగవు. రాజకీయ పార్టీలు అభ్యర్థుల ను బలపరుస్తాయి.
రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఎంపిగా ఉన్న లక్నోలో కూడా సమాజ్‌వాది ఒక సీటు గెలుచుకుంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సొంత నియోజకవర్గం గోరఖ్‌పూలోని గోరఖ్‌పూర్ టీచర్స్ సీటును బిజెపి కేవలం 307 ఓట్ల ఆధిక్యతతో గెలుచుకుంది. సమాజ్‌వాది పార్టీ తమకు 2020లో ఉన్న మూడు సీట్లను ఐదుకు పెంచుకోగా, బిజెపి తమకున్న 6సీట్లు నిలుపుకుంది. ఆరు టీచర్ల సీట్లలో బిజెపి 4, ఎస్‌పి2 గెలుచుకున్నాయి. గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాల్లో చెరి రెండు గెలుపొందాయి. ఆగ్రాలో బిజెపి కార్యకర్త లు ఎస్‌పి అభ్యర్థిని బెదిరించటం, అతను కళ్ళనీళ్లపర్యంతం కావటం జరిగింది. చివరకు, ఎస్‌పి అభ్యర్థి గెలుపొందారు. సమాజ్‌వాది పార్టీ తమ పిడిఎ (పి డి ఎ పునాదిని పటిష్టం చేసుకోవటంతోపాటు శక్తివంతమైన బ్రాహ్మణ సమాజం నుంచి అదనపు మద్దతు పొందినట్లు ఓటింగ్ సరళి
తెలుపుతున్నది.
ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పోటీ చేయలేదు. ఇండియా కూటమి భాగస్వామి అయిన ఎస్‌పి అభ్యర్థులను బలపరిచింది. వారణాసిలోని రెండు సీట్లు సహా ఐదు ఎస్‌పి గెలవటం, మోదీకి, బిజెపికి ఆందోళన కలిగించే విషయం. అభిప్రాయాలను తీర్చిదిద్దే విద్యావంతులు బిజెపికి దూరమైనారు. 2027 ప్రథమార్ధంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఇండియా కూటమి బలంపుంజుకుంటున్నది. బిజెపి ప్రధాన ప్రత్యర్థి సమాజ్‌వాది పార్టీయే. కాంగ్రెస్, ఎస్‌పి మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు జరుగుతున్నాయి.
తూర్పు ఉత్తరప్రదేశ్‌లో మోదీ ప్రభావం తగ్గుదలలో ఉన్నట్లు ఈ ఫలితాలు సూచిస్తున్నాయి. పశ్చిమ యుపిలో బిజెపి బలంగా ఉంది మీరట్ పట్టభద్రుల, టీచర్ స్థానాలు నిలుపుకుంది. బరేలీ మొరాబాద్, లక్నో టీచర్స్ సీట్లు, ఆగ్రా పట్టభద్రుల సీటు గెలుచుకుంది. అయితే ఎస్‌పి కూడా ఆగ్రా టీచర్స్ సీటు, అలహాబాద్ పట్టభద్రుల సీటు గెలుచుకుని పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో కూడా తాము బలపడుతున్నట్లు రుజువుచేసుకుంది.
బిహార్ కూడా బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఎ పరిపాలనలో ఉంది. 8 సీట్లకు ఎన్నికలు జరిగాయి. బిజెపి ౩, జెడి(యు)1, ఆర్‌జెడి1, జనసురాజ్ పార్టీ (తొలిసారి)1, ఇండిపెండెంట్లు 2 సీట్లు గెలుచుకున్నారు.
ఎన్‌డిఎ 2020లో గెలుచుకున్న 4 స్థానాల సంఖ్యను నిలుపుకుంది. అయితే బిజెపి అభ్యర్థి గత 5 పర్యాయాలు గెలిచిన పట్నా టీచర్ సీటులో ఓడిపోవటం ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ. ఆర్‌జెడి అభ్యర్థి గెలుపొందారు. తిర్‌హాట్ స్థానాన్ని సిపిఐ నుంచి గెలుచుకోవటం బిజెపి ముఖ్యమైన విజయం. దర్భాంగా సీటును కాంగ్రెస్ ప్రశాంత్ కిశోర్ పార్టీ జెఎస్‌పికి కోల్పోయింది.
బిజెపి పాలిత మహారాష్ట్రలో ఐదు సీట్లకు ఎన్నికలు జరగ్గా, పాలక మహాయుతికి రెండు సీట్లే దక్కాయి (బిజెపి1, శివసేన ప్రతిపక్ష మహావికాస్ అగాఢి(ఎంవిఎ) మూడు సీట్లు గెలుచుకుంది ఎన్‌సిపి (శరద్‌పవార్2, కాంగ్రెస్ 1. కాంగ్రెస్ నాగపూర్ గెలుచుకోవటం ముఖ్యమంత్రి పడ్నవీస్‌కు, కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీకి నిజంగా అవమానకరం. అది ఆర్‌ఎస్‌ఎస్ కేంద్ర కార్యాలయ స్థానమేగాక, గడ్కరి 2014లో కేంద్ర రాజకీయాల్లోకి వచ్చేవరకు 24సంవత్సరాలు ఆ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు.
అయితే కర్నాటకలో పాలక కాంగ్రెస్ మొత్తం నాలుగు ఎంఎల్‌సి స్థానాలను కోల్పోయింది. ఇది ఆ పార్టీకి, దాని పరిపాలనకు గట్టి ఎదురుదెబ్బ. అంతర్గత కుమ్ములాటలు విడనాడి పార్టీ నాయకులంతా ఐక్యంగా పనిచేయకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత చింతించి లాభం ఉండదు.