Skip to content
జాతీయం › వార్తలు

‘ఆలస్యం చేస్తే… తర్వాత చింతించి లాభం లేదు’

Prajapaksham 15 Nov 2026 0 నిమిషాల పఠనం జాతీయం
‘ఆలస్యం చేస్తే… తర్వాత చింతించి లాభం లేదు’

India Bloc

డాక్టర్‌ అరుణ్‌ మిత్రా


భారతదేశం గూర్చి చర్చించేటప్పుడు, ప్రాథమికంగా విరుద్ధమైన రెండు భావజాలా లు ఇప్పుడు నేరుగా సంఘర్షణలో ఉన్న వాస్తవాన్ని గుర్తించాలి. ఒకటి ద్వేషం, విభజన, హింసపై వృద్ధి చెందుతున్నది. రెండవది సెక్యులరిజం, ప్రేమ, సామరస్యం, న్యాయమైన, సమసమాజ నిర్మాణం కోరుకుంటున్నది. అందువల్ల, ఈ రెండు భావజాలాల స్రవంతు ల మధ్య ఘర్షణను మాత్రమే పరిశీలిస్తే సరిపోదు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఆర్‌ఎస్‌ఎస్‌ తోడ్పాటు పొందుతున్న మోదీ ప్రభుత్వం విధానాలు, రాజకీయ దృక్పథం గుర్చి కూడా పరిశీలించాలి.ఇందుకు గాను మనం అంతర్జాతీయంగా, మన దేశంలోపల సంభవిస్తున్న పరిణామాలను పరిశీలించటం అవసరం.
అమెరికాలో మధ్యంతర ఎన్నికల ఫలితాలు డోనాల్డ్‌ ట్రంప్‌ను గట్టి దెబ్బకొట్టాయి. ప్రతినిధుల సభ, సెనేట్‌ రెండింటిలోనూ డెమోక్రటిక్‌ పార్టీ తన స్థితిని పటిష్టం చేసుకుంది. ఇది ట్రంప్‌ తన విధానా ల్లో అనేకం ముందుకు నెట్టటాన్ని కష్టం చేస్తుంది: ఆయన చర్యలను ప్రతిఘటించేందుకు ఎక్కువ అవకాశం కల్పిస్తుంది. ట్రంప్‌ ఇప్పుడు లేమ్‌
(లాంఛనప్రాయ) ప్రెసిడెంట్‌గా అభివర్ణించబడుతున్నాడు. అయితే ఆయనకున్న వీటో అధికారం విస్మరించరానిది. ఎన్నికల్లో ఆయనకు ఎదురుదెబ్బకు కారణమైన అనేక అంశాల్లో ఆయన మితవాద విధానాలకు ప్రజల నుంచి పెరుగుతున్న ప్రతిఘటన ముఖ్యమైంది. ఆశ్రిత పక్షపాత విధానాలకు ప్రతిఘటన కూడా అందులో ఉంది. రాజకీయ అధికారం బడా వ్యాపారవర్గం మధ్య బంధం నుంచే ఆశ్రిత పక్షపాతం ఉద్భవిస్తుంది. మిచిగన్‌లో ముస్లిం డెమోక్రటిక్‌ అభ్యర్థి అబ్దుల్‌ సయేద్‌ను ఓడించేందుకు భారీగా వెచ్చించిన ధనం ఆ బంధానికి నిదర్శనం. అయినా వారి ప్రయత్నాలు విఫలమైనాయి.
అదేవిధంగా, బ్రెజిల్‌లో ఇటీవలి ఎన్నికల్లో తమ తొత్తు ఫ్లాలియో బోల్సనారో విజయం కోసం అమెరికా అధ్యక్షుడు చేయని ప్రయత్నం లేదు. పెద్ద ఎత్తున ధనం వెచ్చించినా, మీడియాపై, టెక్నాలజీపై పలుకుబడి ఉపయోగించినా ఆ ప్రయత్నాలు విఫలమైనాయి. ట్రేడ్‌యూనియన్‌ నాయకుడు లూయిజ్‌ ఇనాసియో లులా డ సిల్వా బ్రెజిల్‌ అధ్యక్షునిగా మరోసారి ఎన్నికైనారు. బోల్సనారో గెలిచి ఉంటే బ్రెజిల్‌ ఆర్థిక విధానాల్లో, రాజకీయ దృక్పథంలో పెద్ద మలుపు వచ్చి ఉండేది. బ్రిక్స్‌ వంటి సంస్థలు బలహీనపడేవి. అమెరికా పొరుగున ఒక పెద్ద దేశం అమెరికా నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ స్వతంత్ర రాజకీయ పంథా అనుసరించటం చిన్న విషయం కాదు.
బ్రెజిల్‌ ఒంటరి ఉదాహరణ కాదు. సెర్బియాలో కూడా యువతరం ప్రజాస్వామిక సమీకరణ, ఎన్నిక ల్లో పాల్గొనటం ద్వారా, 14ఏళ్లుగా నిరంకుశ, అవినీతి పాలన సాగిస్తున్న అధ్యక్షుడు అలెగ్జాండర్‌ ఉసిక్‌ను ఓడించారు. బల్గేరియాలో కూడా ప్రభుత్వం మారింది. ఈలోపు ఫ్రాన్స్‌, అల్బేనియా, జర్మనీ, ఇంకా అనేక ఐరోపా దేశాల్లో యువకులు, కార్మికులు తమ హక్కు ల కోసం, ప్రజా సంక్షేమ చర్యల కోసం, ప్రజాతంత్ర సంస్థల పరిరక్షణ కోసం పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వస్తున్నారు.
భారతదేశం కూడా అటువంటి పరిణామాలే చూస్తున్నది. పోలీసులు తీవ్రమైన నిర్బంధ చర్యలకు ఒడిగట్టినప్పటికీ, యువతరం జంతర్‌మంతర్‌ వద్ద భారీ ప్రదర్శనలు జరిపింది.లక్షల మంది పాల్గొన్నారు. అణచివేత చర్యలను ఎదుర్కొన్నారు. ఇండియా కూటమి బ్యానర్‌ కింద ప్రతిపక్షపార్టీలు ప్రజాస్వా మ్య పరిరక్షణ బాధ్యత తీసుకున్నాయి. పాలక పార్టీ ఫాసిస్టు ధోరణులను సవాలు చేస్తున్నవి. ఓట్‌ చోరీకి వ్యతిరేకంగా ముఖ్యంగా నవంబర్‌ 1న రాంలీలా మైదాన్‌లో జనసమీకరణ గొప్పగా విజయవంతమైంది.
ప్రజాస్వామిక రాజకీయ పార్టీలు, ప్రజా సంఘా లు, ప్రగతిశీల మేథావులు తాము దేశాన్ని ఏ దిశ గా తీసుకెళ్ళాలనుకుంటున్నారో ఇప్పుడు స్పష్టంగా ఎంచుకోవాలి. ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న పార్టీలు మహా సంపన్నుల ప్రయోజనాల కోసం పనిచేస్తున్న ప్రభుత్వాన్ని అధికారం నుంచి దించేందుకు ఐక్యతను పటిష్టం చేసుకోవాలి. దాని కార్పొరేట్‌ (విదేశీ, స్వదేశీ) అనుకూల విధానాలకు, సమాజాన్ని విభజించి దేశ భిన్నత్వాన్ని, ఐక్యతను, సమగ్రతను విచ్ఛిన్నం చేసే విధానాలకు వ్యతిరేకంగా నిరంతరం, నిలకడగా పోరాటం చేయాలి. నితీశ్‌
కుమార్‌, చంద్రబాబునాయుడు ప్రజల తీర్పుకు ద్రోహం చేయకుండా ఉన్నట్లయితే మోదీ ప్రభుత్వం 2024 ఎన్నికల్లోనే అధికారం కోల్పోయేది. రాజకీయంగా ఎన్ని కుతంత్రాలు చేసినా ఈ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావటం కష్టం అనే సూచనలు కనిపిస్తున్నాయి.
అయితే ఈ శక్తుల ప్రమాదాన్ని తక్కువ అంచనా వేయరాదు. వాటికి వ్యతిరేకంగా ఎన్ని ర్యాలీలు, ప్రదర్శనలు, బహిరంగ సభలు నిర్వహించినా ఈ శక్తులతో నిర్ణయాత్మక పోరాటం ఎన్నికల్లో చేయాల్సి ఉంటుంది. అందువల్ల 2027 ఆరంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఎన్నికల వ్యూహాలపై ఇండియా కూటమి తక్షణం సీరియస్‌గా చర్చలు ప్రారంభించాలి. పెద్ద పార్టీలు సంకుచిత రాజకీయ గణాంకాలకు అతీతంగా చిన్న పార్టీలను కలుపుకుపోయే సర్దుబాటు చూపాలి. కలిసికట్టుగా పనిచేయ టం, అందర్నీ వెంట తీసుకుపోవటం తక్షణావసరం.
ఇండియా కూటమి ఎన్నికల ఏర్పాటు దశను దాటి విశ్వసనీయమైన ప్రత్నామ్నాయంగా ఆవిర్భవించాలి. భారతదేశ విదేశాంగ విధానం, దేశీయ ఆర్థిక విధానాలు, సామాజిక న్యాయం, లింగ సమానత్వం, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, ఉపాధి తదితర కీలక అంశాలపై సమగ్రమైన ప్రత్యామ్నాయ కార్యక్రమం రూపొందించాలి. ఈ కార్యక్రమాన్ని మీటింగులు, సమావేశాలకు పరిమితం చేయకుండా ప్రతి ఒక్కరి వద్దకు తీసుకెళ్లాలి, విస్తృతంగా ప్రచారం ఇవ్వాలి. ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీల్లో అనేక ఆకాంక్షలు, అభిప్రాయాలు ఉంటాయి. అయితే వాటన్నిటినీ సమన్వయపరిచి దేశ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా స్థూల ఏకాభిప్రాయంతో కనీస ఉమ్మడి కార్యక్రమం రూపొందించాలి.
ఈ పోరాటంలో విజయం కచ్చితంగా సాధ్యమే. అయితే ఎడతెగని ప్రయత్నం, రాజకీయ పరిపక్వత, అన్నిటికీ మించి ప్రయోజనం మమేకత అవసరం. అంతర్జాతీయ రాజకీయ దృశ్యంలో మార్పు వస్తున్నది. మనదేశంలో కూడా మోదీ ప్రభుత్వ ప్రభావం క్రమంగా తగ్గుతున్నది. అన్నిటికన్నా ముఖ్యంగా యువతరం రాజకీయ దృక్పథం, ఆలోచనలో సానుకూలమైన మార్పు వస్తున్నది. పెరుగుతున్న ప్రజాస్వామిక చైతన్యం ఆశాభావానికి ముఖ్యమైన వనరు. ఈ చైతన్యాన్ని ప్రోదిచేయటం, ఉమ్మడి కనీస కార్యక్రమం ద్వారా ప్రజాతంత్ర శక్తుల ఐక్యతను, ప్రతిఘటనను పటుతరం చేయటం, ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని శక్తివంతమైన ప్రజాతంత్ర ఉద్యమంగా పరివర్తనగావించటం ఇప్పటి అవసరం. ఈ అవకాశం చేజారటాన్ని మనం అనుమతించరాదు.
సంకుచిత రాజకీయ లేదా ఎన్నికల పరిగణనల కారణంగా రానున్న ఎన్నికల్లో ఐక్యతను ప్రదర్శించటంలో ప్రతిపక్షం విఫలమైతే, ఫాసిస్టు శక్తులు తిరిగి అధికారంలోకి వస్తే, మార్టిన్‌ నీమొల్లర్‌ ప్రసిద్ధమైన పదాలు బాధాకరంగా ప్రాసంగికమవుతాయి: “వారు (నాజీ సైనికులు) ముందుగా సోషలిస్టుల కోసం వచ్చారు. నేను సోషలిస్టును కానందున నేను మాట్లాడలేదు. ఆ తర్వాత ట్రేడ్‌ యూనియనిస్టుల కోసం వచ్చారు నేను ట్రేడ్‌ యూనియనిస్టును కానందున మాట్లాడలేదు. తర్వాత యూదుల కోసం వచ్చారు నేను యూదును కాదు కాబట్టి మాట్లాడలేదు. ఆ తర్వాత వారు నా కోసం వచ్చారు నా కోసం మాట్లాడటానికి అక్కడ ఎవ్వరూ లేదు.”