Skip to content
ప్రపంచం › వార్తలు

అమెరికా కార్పొరేట్‌ రంగంలో ‘గూఢచర్య ప్రేమాయణం’ కలకలం

Prajapaksham 15 Nov 2026 0 నిమిషాల పఠనం ప్రపంచం
అమెరికా కార్పొరేట్‌ రంగంలో ‘గూఢచర్య ప్రేమాయణం’ కలకలం

Jensen Huang resigns as Nvidia CEO

అంజన్‌ రాయ్‌

అతిపెద్ద అమెరికన్‌ కంపెనీ ఎన్‌విడియా సిఇఒగా ఒక వెలుగువెలిగిన జెన్సెన్‌ హుయాంగ్‌ అదృష్టం వారం రోజుల్లోనే తిరగబడింది. ఆయన గత బుధవారం తన సిఇఒ పదవికి, బోర్డ్‌ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తాత్కాలిక సిఇఒగా ఉపాధ్యక్షురాలు కొలెట్‌ క్రెస్‌ నియమితులైనారు. ఈ ఆకస్మిక పరిణామాలకు కారణం చైనా యువతి అలైస్‌ లీతో ఆరోపించబడిన జెన్సెన్‌ వివాహేతర సంబం ధం. ఆమె చైనా గూఢచారి అనే అభియోగం. ఆమెకు జెన్సెన్‌ తమ చిప్‌ కంపెనీ సాంకేతిక రహస్యాలు వెల్లడించి ఉంటారనే అనుమానం. వారిరువురి సంబంధం వెల్లడైనాక 4 ట్రిలియన్‌ డాలర్ల ఎన్‌విడియా కంపెనీ షేర్ల ధరలు గణనీయంగా పడిపోయాయి. లక్షలకోట్ల సంపద ఆవిరైంది. పారిశ్రామిక ప్రపంచంలో ఇటువంటివి కొత్తకాకపోయినా ‘గూఢచర్యం’ ఆరోపణ హైటెక్‌ పరిశ్రమలో, అమెరికా భద్రతా వ్యవస్థలో కలకలం సృష్టించింది. అసలేం జరిగింది?
ఇది అమెరికా యూనియన్‌ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధకాలంలోలాగా ఆశ్చర్యం గొలిపే గూఢచారి కథ.
ఒక గూఢచారి గోప్యంగా వచ్చారు ఆమె ఎవరో ఏమిటో ధృవీకరణ జరిగేలోపే డిటెక్టివ్‌ కథల్లోలాగా చీకటిలోకి అదృశ్యమైంది. ఒక చైనా జాతీయురాలు ఆకస్మికంగా తెరపైకి వచ్చింది; ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీ ముఖ్య కార్యనిర్వహణాధికారి, దాని వ్యవస్థాపకుల్లో ఒకరైన జెన్సెన్‌ హుయాంగ్‌ హృదయం దోచుకుంది.
జెన్సెన్‌ హుయాంగ్‌ జీవితంలోకి ఏదో అసాధారణ ఉనికి సంభవించినట్లు దాదాపు సంవత్సరంగా అనుమానాలు సూచిస్తున్నాయి. ఆ అందమైన చైనా కార్పొరేట్‌ ఎగ్జిక్యూటివ్‌ యువతి అట్లాంటిక్‌లో పలుచోట్ల ఉన్నతస్థాయి కార్పొరేట్‌ సమావేశాలు, పరిశ్రమ రహస్య సంభాషణల సమయంలో జెన్సెన్‌తో ఉన్నట్లు కనిపించారా?
సింగపూర్‌, తైవాన్‌లలో పరిశ్రమ సమావేశాల్లో జెన్సెన్‌ హుయాంగ్‌ పక్క సీట్లో ఆయనకన్నా ఎంతో పిన్న వయస్కురాలైన స్త్రీ కూర్చోవ టం కనిపించింది. ఆ తర్వాత తైపేలో జెన్సెన్‌ సీనియర్ల స్థాయి అతిథులకు ఇచ్చిన డిన్నర్‌ నుంచి ఆయన కారులో వెళ్లిపోవటం ఫోటోలు తీశారు. ఆయన సహచరిగా ఉన్న హుయాంగ్‌ లీ అనే స్త్రీ ఉన్నతస్థాయిలో ఉన్నట్లు ధృవీకరణ జరిగింది. ఇంకా లోతు గా వాకబు చేయగా, హుయాంగ్‌ లీ గూర్చి మరికొన్ని విషయాలు తెలిశాయి. హుయాంగ్‌ లీ అంతకుముందు చైనీస్‌ జర్నలిస్టుగా పనిచేశారు. త్వరలోనే ఫైనాన్స్‌ పరిశ్రమలో ఎగ్జిక్యూటివ్‌గా మారారు. ఆ తర్వాత హై టెక్నాలజీ క్లౌడ్‌ కంప్యూటింగ్‌ కంపెనీ, 7 రోడ్స్‌లో కీలకమైన వ్యక్తిగా అవతారమెత్తారు. అత్యంత క్లిష్టమైన డిజిటల్‌ గేమ్స్‌ అభివృద్ధిలో నైపుణ్యంగల కంపెనీ అది. ఇందు కు ఉన్నతస్థాయి సెమీకండక్టర్లు అవసరం. అత్యున్నతస్థాయి చిప్‌మేకర్స్‌ వద్దనే అవి లభ్యమవుతాయి. తదుపరి కథ ప్రచ్ఛన్నయుద్ధం కాలంలో లీ క్యార్రీ నవలల్లోని మిస్టరీని తలపిస్తోంది. గేమింగ్‌ కంపెనీ పేరు మెగాస్పీడ్‌ డేటా సర్వీసెస్‌ కంపెనీగా మారింది. అది సింగపూర్‌లో ఏర్పాటైంది. ఆ కొత్త కంపెనీకి హుయాంగ్‌ లీ డైరెక్టర్‌ అయినారు. ఆ కంపెనీ అభివృద్ధి అంతుచిక్కదు. చైనీయుల మెగా కార్పొరేషన్‌ అలీబాబా మెగాస్పీడ్‌ డేటా సెంటర్‌ కార్యకలాపాలకు అపారంగా నిధులు సమకూర్చింది. డేటాసెంటర్లకు హైస్పీడ్‌ చిప్స్‌ అవసరం. కృత్రిమ ఇంటెలిజెన్స్‌ (ఎఐ)మోడల్స్‌ అభివృద్ధి చేసేందుకు అవసరమైన అధునాతన చిప్స్‌ను మెగాస్పీడ్‌ కంపెనీ కనీసం 4బిలియన్‌ డాలర్ల విలువైన వాటిని కొనుగోలు చేసింది. ఎఐ కంప్యూటింగ్‌ అంతర్గత వసతులకు అత్యావశ్యకమైన ఎంతో క్లిష్టమైన గుణకారాలు చేసేందుకు ఈ సెమీ కండక్టర్లు అవసరం. వాటిని ఎన్‌విడియా మాత్రమే తయారు చేస్తోంది. యుద్ధతంత్రం, పారిశ్రామిక ఎఐ రెండింటిలోనూ అమెరికా ఆధిపత్యం కొనసాగించేందుకై ఈ కంపెనీపై అమెరికా గూఢచారి సర్వీసుల నిఘానేత్రం ఎప్పుడూ ఉంది.
శాంతాక్లారాలో ఎన్‌విడియాను ప్రమోట్‌ చేసినవారు ముగ్గురు. అయినా ప్రపంచంలోనే అత్యంత విలువైన ఈ కంపెనీ ప్రమోటర్‌గా ప్రాచుర్యం పొంది న వ్యక్తి జెన్సెన్‌ హుయాంగ్‌. టెక్నాలజీ ప్రపంచంలో ప్రసిద్ధుడు మాత్రమేగాక దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులతో కనిపిస్తుండేవారు.
డోనాల్డ్‌ ట్రంప్‌ రెండవసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తరువా జెన్సెన్‌ ఆయన పక్కన ఎక్కువగా కనిపిస్తుండేవారు. ఎఐకి సంబంధించి ట్రంప్‌ వైఖరి స్థూలంగా జెన్సెస్‌ వైఖరిని పోలి ఉండేది. చైనాకు ఎన్‌విడియా శక్తిమంతమైన చిప్‌ల ఎగుమతిని అమెరికా పూర్తిగా నిషేధించింది. ఎఐ పరిశ్రమను ప్రభుత్వం నియంత్రిస్తున్నట్లు వదంతులు వినిపించాయి. చైనాకు ఎన్‌విడియా చిప్‌ల ఎగుమతి నిషేధాన్ని జెన్సెన్‌ వ్యతిరేకించాడు. ఆ విధంగా కంపెనీ ఎప్పుడూ అమెరికా ఫెడరల్‌ దర్యాప్తు సంస్థల రాడార్‌లో ఉంది.
హైటెక్‌ ఎగుమతులు, ఎఐ పరిశ్రమలో ఎత్తులు, పై ఎత్తులపై నిఘా ఉంచిన యాంటెన్నా సిగ్నల్స్‌ పరిశ్రమ నాయకుడు జెన్సెన్‌ హువాంగ్‌ అలైస్‌ హుయాంగ్‌తో మరీ సన్నిహితంగా ఉన్నట్లు పట్టేశాయి. తైపేలో పరిశ్రమ ఉన్నతస్థాయి సమావేశం తర్వాత జెన్సెన్‌, అలైస్‌ కలిసి కారులో వెళ్లటంతో వారి సంబంధం కార్పొరేట్‌ ప్రపంచానికి తెలిసింది.
అప్పటికి అలైస్‌ పూర్వాపరాలు గూఢచారి సంస్థ ఆపరేటర్లకు తెలియవు. ఆమె చైనా గూఢచారి సంస్థ సర్వీసులో ఉన్నట్లు అనుమానంతో అమెరికన్‌ గూఢచారులు నిఘాపెంచి శోధించసాగారు. వెనక జరగుతున్న పరిణామాలు జెన్సెన్‌కు లేదా అలైస్‌ హుయాంగ్‌కు తెలియదు. చివరకు జెన్సెన్‌ దొరికిపోయాడు. తన కంపెనీ స్టాఫ్‌ముందు, కుటుంబం ముందు విషయం ఒప్పుకున్నాడు. జెన్సెన్‌ హుయాంగ్‌ చైనీస్‌
ఇప్పుడు ప్రశ్న భద్రత, రహస్య సమాచారం ఏదైనా ఆ గూఢచారిగా అనుమానించబడుతున్న యువతి ద్వారా ఆయన చైనావారికి అందించాడా? అతను అమాయకుడైనా, కాకపోయినా
40లక్షల కోట్ల డాలర్ల కంపెనీ మార్కెట్‌ విలువ గణనీయంగా పడిపోయింది. ఎఐ పరిశ్రమ సంక్షోభంలో పడింది.

ట్యాగ్‌లు: World News