మతోన్మాదానికి బలైన అహింసామూర్తి గాంధీజీ
Gandhi
మన్నవ హరిప్రసాద్
మానవజాతిని ప్రభావితం చేసిన మహోన్నత వ్యక్తులలో గౌతమ బుద్ధుడు, ఏసుక్రీస్తు, మహ్మదు, వీరి ప్రబోధాలు మతాలుగా నేటికీ ప్రపంచంలో వర్ధిల్లుతున్నాయి. కారల్ మార్క్, ఫ్రెడరిక్ ఏంగిల్స్ మహాశయులు, శాస్త్రీ య సోషలిస్టు సిద్ధాంతాన్ని, తత్వ శాస్త్రా న్ని అందించారు. లెనిన్, స్టాలిన్‌లు మార్క్ బోధనలను అనుసరించి రష్యాలో ప్రధమ సోషలిస్టు వ్యవస్థను నిర్మించారు, మావో జన చైనాను నిర్మించారు.
పై మహాశయులతో పాటు భారత జాతిపిత మహాత్మా గాంధీని చెప్పుకోవచ్చు. సత్యం, శాంతి, అహింస, సహాయ నిరాకర ణ ఉద్యమం, స్వదేశీ ఉద్యమం మొదలగు పోరాట పద్ధతుల ద్వారా సత్యాగ్రహం అనే ఆయుధం తోటి బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా భారత ఉపఖండంలో మహోన్నత ఉద్యమాన్ని నిర్మించారు. గాంధీ మహాత్ముడు అనుసరించిన రాజకీ య విధానాలతోటి పూర్తి ఏకీభావం లేని వారు కూడా ప్రారంభంలో మహాత్మా గాంధీ ప్రభావంతో జాతీయోద్యమంలోకి, రాజకీయాల్లోకి వచ్చినవారే. కానీ తను రూపొందించినటువంటి సత్యాగ్రహం అనే సిద్ధాంత ఆయుధంతో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదులను భారత ఉపఖండమునుండి తరిమి కొట్టటానికి గొప్ప ఉద్యమాన్ని నిర్మించిన మహా నేత మహాత్మాగాంధీ.
1869 అక్టోబర్ 2వ తేదీన గుజరాత్ రాష్ట్రంలో పోర్ బందర్‌లో కరంచంద్ గాంధీ, పుతిలి బాయిలకు జన్మించారు మోహన్‌దాస్. ప్రాథమిక విద్యను పోరు బందర్‌లో చదివిన గాంధీ, హైస్కూల్ విద్యను రాజ్ కోటలోనూ, కాలేజీ విద్యను భావనగరంలో సామల్ దాస్ కాలేజీలోనూ చదివి, న్యాయ శాస్త్రం అభ్యసించడానికి 1888 లో లండన్ వెళ్లి 1891లో భారతదేశానికి తిరిగి వచ్చారు. 1893 వ సంవత్సరంలో న్యాయవాద వృత్తిలో భాగంగా ఒక భారతీయ వ్యాపారవేత్త తరుఫున దక్షిణాఫ్రికా వెళ్లారు.
దక్షిణాఫ్రికాలో భారతీయ సమాజం ఎదుర్కొంటున్న వర్ణ వివక్ష కు వ్యతిరేకంగా 1894లో నేషనల్ ఇండియన్ కాంగ్రెస్ ను స్థాపించి సత్యాగ్రహాన్ని ఆయుధంగా ఎంచుకొని పోరాడారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారతదేశంలో 1885 లో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడింది. మహాత్మాగాంధీ 1915 లో భారతదేశానికి తిరిగి వచ్చారు. నాటి నుండి ఈ దేశం నుండి బ్రిటిష్ వాడు వెళ్లిపోయేంతవరకు ఆ సేతు హిమాచలం భారతదేశం అంతా గాంధీ రోజుకి 18 కిలోమీటర్ల చొప్పున కాలినడకన 79 వేల కిలోమీటర్లు ప్రయాణం చేశారు. విభిన్న కుల, మతాలు, జాతులు, భాషలు, సంస్కృతులు కలిగినటువంటి ఈ దేశ ప్రజల జీవన పరిస్థితులను అధ్యయనం చేశారు. ప్రజలను సత్యాగ్రహం మార్గంలో జాతీయోద్యమం వైపు మళ్ళించారు. ఈ దేశంలో బ్రిటిష్ వాడు ఏ మాత్రం ఉండటానికి వీలులేదని శాంతియుత పద్ధతుల్లో ఆయన ప్రజలకు ప్రబోధించి ఉద్యమింపజేశారు. కులవృత్తులను గౌరవిస్తూ అంటరానితనానికి వ్యతిరేకంగా కృషి చేశారు. దళితులకు దేవాలయ ప్రవేశం, రెండు బావుల నీటి సిద్ధాంతానికి వ్యతిరేకత, విదేశీ వస్తు బహిష్కరణ, సహాయ నిరాకరణ ఉద్యమం మొదలగు అనేక పోరాట పద్ధతులను అనుసరించా డు. భారత జాతీయ నాయకుల్లో ఎన్నో విభేధాలున్నాయి. వారినందరినీ ఐక్యంగా బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా నిలబెట్టటానికి ఆయన ఎంతో కృషి చేశారు. లండన్‌లో మూడు రౌండ్ టేండ్ సమావేశాల్లో ఆయన ఒక సమావేశంలోనే పాల్గొనారు.
భారతదేశంలో రెండు ప్రధాన మతాలు హిందూ, ఇస్లాం. సామ్రాజ్యవాదులు ఈ దేశాన్ని చీల్చటానికి అనేక కుయుక్తులు పన్నా రు. ప్రారంభంలో జాతీయ కాంగ్రెస్‌లో ముస్లిం నాయకులు కూడా కలిసి ఉన్నారు. కానీ బ్రిటిష్ వాడు విభజించి పాలించు అనే సూత్రం అనుసరించి భారత ప్రజల మధ్య హిందూ- మత చిచ్చును రగిల్చాడు.
ఈ ‘విభజించి పాలించు’ విధానమే చివరకు దేశ విభజనకు పునాది వేసింది. స్వాతంత్య్ర ఉద్యమం అనేది బ్రిటిష్ వారిని దేశం నుండి వెళ్లగొట్టడానికి జరిగిన పోరాటం. కానీ విభజన అనేది దేశం లోపల ఉన్న రాజకీయ, మతపరమైన భయాల వల్ల (హిందూ ఆధిక్య దేశంలో ముస్లింల హక్కులకు రక్షణ ఉండదనే భయంతో) ముస్లిం లీగ్ తెచ్చిన ఒత్తిడి వల్ల జరిగింది.
మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ వంటి దేశనాయకులు అఖండ భారతదేశ స్వాతంత్య్రం కోసమే పోరాడారు. వారు దేశ విభజనను తీవ్రంగా వ్యతిరేకించారు, కానీ చివరకు దేశంలో అల్లర్లు, హింసను ఆపడానికి వేరే మార్గం లేక విభజనకు అంగీకరించాల్సి వచ్చింది. 1947 ఆగస్టు 15 ఇండియా, పాకిస్తాన్ గా భారత ఉపఖండం చీలికకు గురి అయింది. ఢిల్లీ ఎర్రకోట పైన పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయగా జాతిపిత మహాత్మా గాంధీ మాత్రం ఇండియా విభజనలో జరిగినటువంటి అల్లర్లనూ, హింసనూ వ్యతిరేకిస్తూ కలకత్తాలో ఎంతో వేదనతో సత్యాగ్రహంలో కూర్చున్నారు.
1925లో సెప్టెంబర్ 27వ తేదీన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం హెగ్డేవార్ మొదటి సంచాలకుడుగా ఏర్పడింది. ఆయన ఎవరు హిందువు? అనే గ్రంథాన్ని రచించాడు. హెగ్డే వార్ రాజకీయ గురువు బి.ఎస్.మూంజే. 1931 లండన్‌లో జరిగిన రెండు రౌండ్ టేండ్ సమావేశాల్లో బిఎస్ మూంజే పాల్గొని అచట నుండి ఇటలీ వెళ్లి నియంత ముస్సోలిని కలిసి ఫాసిస్టు తరహా పద్ధతులను అధ్యయనం చేసి వచ్చాడు. 1935లో బోన్సాల్లోనూ, నాసిక్‌లోను ఫాసిస్ట్ తరహా మిలిటరీ స్కూల్ లను ఏర్పాటు చేశాడు. హిందూ మహాసభ నాయకుడు గోల్వాల్కర్ బంచ్ హాఫ్ థాట్స్ అనే గ్రంధాన్ని రచించాడు. ఈనాడు ఆర్‌ఎస్‌ఎస్‌కి ప్రపంచంలోని 150 దేశాల్లో శాఖలు ఉన్నాయి. జాతీయ ఉద్యమంలో ఎటువంటి పాత్ర లేనటువంటి, బ్రిటీష్ సామ్రాజవాదులకు లొంగుబాటు ఉత్తరాలు రాసినటువంటి ఆర్‌ఎస్‌ఎస్ నేతలు మహాత్మా గాంధీని చంపటానికి కుట్రపన్నారు. అంబేద్కర్ కూల్చిన భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించిన వారిలో ముఖ్యుడు వినాయక దామోదర సావర్కర్. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించిన దినం. మరుసటి దినమే ఆర్‌ఎస్‌ఎస్ నేతలు భారత రాజ్యాంగంగా మనుస్మృతి ఉండాలన్నారు. వాజ్ పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వినాయక దామోదర సావర్కార్ చిత్రపటాన్ని పార్లమెంటులో పెట్టారు. భారత రాజ్యాంగ ప్రవేశికలో చెప్పినట్లుగా భారతదేశం సార్వభౌమ, లౌకిక, సామ్యవాద, గణతంత్ర, ప్రజాతంత్ర స్ఫూర్తికి ఆర్‌ఎస్‌ఎస్/బిజెపి వ్యతిరేకం. గాంధీజీ కలలు కన్న మతసామరస్యానికి ఆర్‌ఎస్‌ఎస్ వ్యతిరేకం. ఎన్పీఆర్, ఎన్‌ఆర్‌సి, సిఎ.ఎ., సర్., చట్టాలు కానీ, కాశ్మీర్ కు స్వయంప్రతిపత్తి ని ఇచ్చిన ఆర్టికల్స్ 370, 35 రద్దు కానీ ఫాసిస్టు తరహా క్రోనీ క్యాపిటలిస్ట్ పాలనలో భాగమే. 1948 జనవరి 30వ తేదీన బిర్లా మందిరములో ప్రార్థనకు బయలుదేరిన మహాత్మా గాంధీని హిందూ మతోన్మాద ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త నాథూరామ్ గాడ్సే రివాల్వర్ తో కాల్చి చంపాడు. హే రామ్ అంటూ జాతిపిత నేల కొరిగాడు.
గాంధీని మొట్టమొదటసారిగా విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మహాత్మా అని సంబోధించాడు. జాతిపిత మహాత్మా గాంధీ గురించి ఆల్బర్ట్ ఐన్ స్టీన్ వంటి ప్రపంచ ప్రముఖులు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా అభివర్ణించారు. ఈ భూమండల మీద రక్తమాంసాలతో ఇలాంటి వ్యక్తి మనుగడ సాగించాడంటే ముందు తరాలు నమ్మలేకపోవచ్చు అనిఅన్నారు. మహాత్ముడు కలలుగన్న లౌకిక తత్వం, శాంతి, సౌఖ్యం ప్రేమ, అహింసల భారతదేశం కోసం మనమంతా ఈ గాంధీ జయంతి సందర్భంగా దీక్ష పూనాల్సిన అవసరం ఉన్నది. అది మహాత్మునికి మనం అర్పించే నివాళి.
- Ames Meteorite Crater: ఉల్క దాడి 10 కోట్ల ఏళ్లు ఆలస్యంగా జరిగిందా.. Ames క్రేటర్‌పై శాస్త్రవేత్తల కొత్త అంచనా.. ఓక్లహామా ఉల్కాబిలంపై సంచలన పరిశోధన
- Bathukamma Secret: బతుకమ్మ పండుగలో దాగి ఉన్న అసలు సీక్రెట్ ఇదే.. పూల పండుగ వెనుక ఇంత పెద్ద కథ ఉందా?
- Boddemma Festival: బతుకమ్మకు ముందు వచ్చే బొడ్డెమ్మ పండుగ ప్రత్యేకత ఏంటి.. 7 రోజుల పాటు ఎందుకు జరుపుకుంటారు..
- CEC Gyanesh Kumar Row: CEC జ్ఞానేశ్ కుమార్‌ను సస్పెండ్ చేయాలన్న పిటిషన్లపై విచారణ.. కేంద్రం, ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు..
- Russia-Ukraine War: ఉక్రెయిన్‌లో భారత ఫార్మా ప్లాంట్‌పై రష్యా డ్రోన్ దాడి.. ఒకరు మృతి, రూ.400 కోట్లకు పైగా నష్టం..