Skip to content
జాతీయం వార్తలు

CJP Protest March Video: నిరసనకారులపై పోలీసుల దౌర్జన్యం.. గాయపడ్డ వారిపై మానవత్వం మరిచి దాడి..

Prajapaksham 20 Jul 2026 1 నిమిషాల పఠనం జాతీయం
CJP Protest March Video: నిరసనకారులపై పోలీసుల దౌర్జన్యం.. గాయపడ్డ వారిపై మానవత్వం మరిచి దాడి..

CJP Protest March Video: నిరసనకారులపై పోలీసుల దౌర్జన్యం.. గాయపడ్డ వారిపై మానవత్వం మరిచి దాడి..

నీట్ పరీక్ష లీకేజీ కి నిరసనగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ, సి జె పి ఆధ్వర్యంలో నిర్వహించిన చలో పార్లమెంటు ఈరోజు ఉద్రిక్తంగా మారింది. నిరసనకారులపై పోలీసులు తీవ్రంగా లాఠీ చార్జ్ చేశారు. ర్యాలీలో పాల్గొన్న యువతపై పోలీసులు ఎడాపెడా ఇష్టా రీతిన గాయపడేలా లాఠీలతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో గాయాలతో ఒకరు కింద పడిపోగా అతనిని ఎత్తుకొని తీసుకెళ్లడానికి వచ్చిన సన్నిహితుల పైన కూడా లాఠీచార్జి చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. . అంతేకాదు మానవత్వం లేకుండా వారిని చుట్టుముట్టి లాఠీలతో ఎలా పెడ కొట్టిన పోలీసులు బాధతో రోదిస్తున్న వినిపించుకోకుండా, విద్యార్థులపై పైశాచికత్వం ప్రదర్శించారని సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది.

. ఈరోజు ఉదయం జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు మొదలైన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. విద్యార్థులు ముందస్తుగా పిలుపునిచ్చిన మేరకు పార్లమెంటు లాన్స్ లో ప్రవేశించి మరీ నిరసన తెలియజేశారు. దీంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలో జరిగిన లాఠీచార్జిలో పలువురు విద్యార్థులు రక్తసితమయ్యేలా గాయపడ్డారు. ఇదిలా ఉంటే పార్లమెంటులో వర్షాకాల సమావేశాలు నిరసనల దృష్ట్యా న్యూఢిల్లీలో సెక్షన్ 163 (గతంలో సెక్షన్ 144) విధించినట్లు డీసీపీ సచిన్ శర్మ తెలిపారు. దీని ప్రకారం, ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం, నిరసనలు, ఊరేగింపులు లేదా ధర్నాలు నిషేధించినట్లు తెలిపారు. అయితే శాంతియుత ప్రదర్శనలకు జంతర్ మంతర్ వద్ద మాత్రమే, ముందస్తు అనుమతితో అనుమతి ఉంది. ఈ నిషేధాజ్ఞలను ఉల్లంఘించే వారిపై సెక్షన్ 223, ఇతర చట్టపరమైన నిబంధనల కింద కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

అయినప్పటికీ కాక్రోచ్ జనతా పార్టీ నిరసనకారులు పార్లమెంటుకు తమ పాదయాత్రను ప్రారంభించేందుకు జంతర్ మంతర్ నుండి బయలుదేరడానికి ప్రయత్నించారు. వారు పోలీసు బారికేడ్లను ఛేదించుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. విద్యార్థులు అడ్డుకునేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులను కూడా జంతర్ మంతర్‌లోకి ప్రవేశించకుండా పోలీసులు అడ్డుకున్నారు. నిరసనకారులు ఆర్పీఎఫ్ సిబ్బందితో ఘర్షణ పడ్డారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి, పోలీసులు మరియు ఆర్పీఎఫ్ లాఠీఛార్జ్ చేసి నిరసనకారులను చెదరగొట్టారు.