Skip to content
జాతీయం వార్తలు

Vijay Viral Video: సార్.. మిమ్మల్ని హగ్ చేసుకోవచ్చా?’.. సీఎం విజయ్‌ను కోరిన జూనియర్ డాక్టర్.. ముఖ్యమంత్రి రియాక్షన్ ఏంటంటే..

Prajapaksham 14 Jul 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Vijay Viral Video: సార్.. మిమ్మల్ని హగ్ చేసుకోవచ్చా?’.. సీఎం విజయ్‌ను కోరిన జూనియర్ డాక్టర్.. ముఖ్యమంత్రి రియాక్షన్ ఏంటంటే..

Vijay Viral Video: సార్.. మిమ్మల్ని హగ్ చేసుకోవచ్చా?'.. సీఎం విజయ్‌ను కోరిన జూనియర్ డాక్టర్.. ముఖ్యమంత్రి రియాక్షన్ ఏంటంటే..

Vijay Viral Video: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మరోసారి మంచి మనసు చాటుకున్నారు. ఇప్పటికే తన నిరాడంబరతతో, సామాన్య ప్రజల పట్ల చూపే ఆప్యాయతతో ఎన్నోసార్లు వార్తల్లో నిలిచిన సీఎం తాజాగా మరోసారి ప్రజల అభిమానాన్ని గెలుచుకున్నారు. చెన్నైలో నిర్వహించిన ఒక అధికారిక ప్రభుత్వ కార్యక్రమంలో ముఖ్యమంత్రి హోదాను.. కఠినమైన ప్రోటోకాల్స్‌ను పక్కనపెట్టి ఒక యువ జూనియర్ డాక్టర్‌ను ఆయన ఆప్యాయంగా కౌగిలించుకున్న తీరు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికలపై అందరి హృదయాలను గెలుచుకుంటోంది.

తమిళనాడు వైద్యారోగ్య శాఖలో కొత్తగా నియమితులైన అభ్యర్థులకు నియామక పత్రాలను పంపిణీ చేసేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ వేదికపై ముఖ్యమంత్రి విజయ్ చేతుల మీదుగా మొత్తం 2,144 మందికి నియామక ఉత్తర్వులు అందించారు. వీరిలో 751 మంది అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్లు, 1,393 మంది హెల్త్ ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు. ఈ క్రమంలోనే నియామక పత్రం అందుకోవడానికి వేదికపైకి వచ్చిన ఒక యువ డాక్టర్.. తన అభిమాన నాయకుడు, ముఖ్యమంత్రిని చూసిన ఆనందంలో సార్, మిమ్మల్ని ఒకసారి హగ్ చేసుకోవచ్చా అని అభ్యర్థించారు. దానికి సీఎం విజయ్ ఏమాత్రం సంకోచించకుండా చిరునవ్వుతో అంగీకరించి, ఆ యువకుడిని ఆప్యాయంగా హత్తుకుని అభినందించారు.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి విజయ్ తన ప్రజానుకూల శైలితో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. గతంలో కూడా ఒక గర్భిణీ అభ్యర్థిని నియామక పత్రం అందుకోవడానికి ఇబ్బంది పడుతుండటం గమనించి, ఆయనే స్వయంగా స్టేజ్ దిగి కిందకు వచ్చి ఆమెకు పత్రాన్ని అందించి తన పెద్దమనసు చాటుకున్నారు. తాజా ఘటనతో ప్రజల ముఖ్యమంత్రిగా.. అందరికీ అందుబాటులో ఉండే ఒక నిరాడంబరమైన నాయకుడిగా ఆయనపై ప్రశంసల వర్షం కురుస్తోంది.