Kidney Health Alert: మీ కిడ్నీలను కాపాడుకోవాలంటే ఈ 6 అలవాట్లకు దూరంగా ఉండండి.. లక్షణాలు వెంటనే బయటపడని ఇవే..
kidney Health
Kidney Health Alert: కిడ్నీల్లో సమస్యలు మొదలైనప్పుడు ఆరంభంలో ఎలాంటి నొప్పి లేదా స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవడం వల్ల చాలామంది అంతా బాగానే ఉందనే భ్రమలో ఉంటారు. కానీ మన రోజువారీ జీవితంలో చేసుకునే కొన్ని చిన్నపాటి పొరపాట్లు కిడ్నీలపై క్రమంగా ఒత్తిడి పెంచి, తీవ్ర నష్టానికి దారితీస్తాయి. నిపుణుల ప్రకారం కిడ్నీల ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఆ ఆరు కీలక అలవాట్లు ఇవే:
- పెయిన్ కిల్లర్స్ మితిమీరి వాడటం:
తలనొప్పి, నడుము నొప్పి లేదా కీళ్ల నొప్పులు వచ్చిన ప్రతిసారీ వైద్యుల సలహా లేకుండా పెయిన్‌కిల్లర్స్ వేసుకోవడం కిడ్నీలకు తీవ్ర హాని కలిగిస్తుంది. ఇవి కిడ్నీలకు జరిగే రక్తప్రసరణను తగ్గించి, ఒక్కసారిగా వైఫల్యానికి గురయ్యే ప్రమాదాన్ని పెంచుతాయి. ముఖ్యంగా డీహైడ్రేషన్, వాంతులు, విరేచనాలు ఉన్నప్పుడు ఇవి మరీ ప్రమాదకరం. - ఆహారంలో సోడియం (ఉప్పు) ఎక్కువ కావడం:
కేవలం వంటల్లో వేసే ఉప్పు మాత్రమే కాకుండా ప్యాకెట్ స్నాక్స్, నిల్వ పచ్చళ్లు, సాస్‌లు, ఇన్స్టంట్ నూడుల్స్ మరియు హోటల్ ఆహారంలో ఉండే అధిక సోడియం శరీరంలో నీటిని నిల్వ చేసి రక్తపోటును పెంచుతుంది. ఇది దీర్ఘకాలంలో కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. - ప్యాకేజ్డ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్‌పై ఆధారపడటం:
ప్యాక్ చేసిన స్నాక్స్, చక్కెర పానీయాలు, ప్రాసెస్డ్ ఫుడ్స్ రోజువారీ ఆహారంలో భాగమైతే అందులోని క్యాలరీలు, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు అధిక బరువు, ఇన్సులిన్ నిరోధకత మరియు బిపికి దారితీసి చివరికి కిడ్నీలను దెబ్బతీస్తాయి. - నీటి వినియోగంలో క్రమం లేకపోవడం:
కిడ్నీల పనితీరుకు తగినంత నీరు చాలా అవసరం. ఎండలు, వ్యాయామం, జ్వరం ఉన్న సమయాల్లో డీహైడ్రేషన్‌కు గురికాకూడదు. అదే సమయంలో అవసరానికి మించి లీటర్ల కొద్దీ అతిగా నీళ్లు తాగడం కూడా సరైన పద్ధతి కాదు. శరీర అవసరాలు, వాతావరణాన్ని బట్టి నీటిని తీసుకోవాలి. - పొగతాగే అలవాటు (స్మోకింగ్):
స్మోకింగ్ కేవలం ఊపిరితిత్తులకే కాక, రక్తనాళాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఆరోగ్యకరమైన రక్తప్రసరణపై ఆధారపడి పనిచేసే కిడ్నీలకు పొగతాగడం వల్ల రక్తం సరిగ్గా అందక అదనపు భారం పెరుగుతుంది. - బిపి, షుగర్ స్థాయిలను గమనించకపోవడం:
మధుమేహం (షుగర్), అధిక రక్తపోటు (బిపి)లు కిడ్నీలు పాడవడానికి ప్రధాన కారణాలు. ఇవి లక్షణాలు లేకుండానే కిడ్నీలను దెబ్బతీస్తాయి. అందుకే కుటుంబంలో కిడ్నీ సమస్యల చరిత్ర ఉన్నవారు లేదా షుగర్, బిపి ఉన్నవారు క్రమం తప్పకుండా క్రియాటినిన్, eGFR, మూత్రంలో uACR వంటి పరీక్షలు చేయించుకోవడం అవసరం.
- India Bloc March: ఉద్రిక్తంగా మారిన ఇండియా బ్లాక్ పాదయాత్ర… ‘Gyanesh, it’s done bro’ ప్లకార్డుతో బారికేడ్ పైకి ఎక్కి నిలబడ్డ రాహుల్ గాంధీ…
- ఇండియా బ్లాక్ మార్చ్: రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు నేతలు అదుపులోకి
- Hyderabad Water Crisis: రిజర్వాయర్లు అడుగంటుతున్నాయ్.. హైదరాబాద్‌కు తాగునీటి సంక్షోభం ముంచుకొస్తుందా..?
- Andhra Pradesh: బస్సులో పరిచయం.. ప్రేమ పేరుతో మోసం చేసిన కండక్టర్
- Land Pooling Policy: తెలంగాణలో కొత్త ల్యాండ్ పూలింగ్ పాలసీ.. భూయజమానులకు నగదు బదులు డెవలప్డ్ ప్లాట్లు..?