USA Strike Iran: భారత్ నిర్మించిన చాబహార్ పోర్టుపై అమెరికా దాడి… ప్రతీకార దాడులు ప్రారంభించిన ఇరాన్..
USA Strike Iran: భారత్ నిర్మించిన చాబహార్ పోర్టుపై అమెరికా దాడి... ప్రతీకార దాడులు ప్రారంభించిన ఇరాన్.. ( Image: Meta)
ఇరాన్తో కాల్పుల ఒప్పందం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు ట్రంపు ప్రకటించిన అనంతరం ప్రస్తుతం ఇరాన్ పై అమెరికా పెద్ద ఎత్తున వైమానిక దాడులకు దిగింది ఈ దాడుల్లో కనీసం ఒకరు మరణించినట్లు ఇరాన్ మీడియా తాజాగా పేర్కొంది అంతేకాదు బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ దాడులు జరిగినట్టు నిర్ధారించింది హార్మోజు జల సంధి లో వాణిజ్య నౌకలపై జరిగిన దాడులకు ప్రతిస్పందనగానే తాము ఈ వైమానిక దాడులను చేపట్టినట్టు కాల్పుల ఒప్పందాన్ని ముగిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణకు మభ్యంతర ఒప్పందం జరిగినా నెల రోజులు గడవకముందే అమెరికా మరోసారి దాడులకు దిగడం గమనించవచ్చు. రాజాగా యూఎస్ సెంట్రల్ కమాండ్ తన ఎక్స్ ఖాతాలో ఈ విధంగా రాసింది కీలకమైన అంతర్జాతీయ జల మార్గాల్లో ప్రయాణిస్తున్న వాణిజ్య నూకలు పౌర సిబ్బంది పైన అన్యాయం పద్ధతుల్లో ఇరాన్ దురాక్రమణ చర్యలకు పాల్పడుతోందని అందుకు అమెరికా తగిన బుద్ధి చెబుతుందని పేర్కొంది. ఇదిలా ఉంటే టర్కీలో జరుగుతున్న నాటో శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న అనంతరం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో విలేకరులతో మాట్లాడుతూ ఇరాన్ ఇప్పటికీ కూడా తమతో సంప్రదించడానికి ప్రయత్నం చేస్తుందని అందుకు వారు అర్హులో కాదో త్వరలో తేలుస్తా అని పేర్కొన్నారు. ఇరాన్తో కుదుర్చుకున్న సీస్ ఫైర్ ముగిసిందని ఇక దాడులు మాత్రమే మిగిలాయని ట్రంప్ హెచ్చరించారు. ఇదిలా ఉంటే హర్మూజ్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ హెచ్చరిస్తుండగా, చమురు కేంద్రాలపై దాడి చేస్తామని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.
చాబహార్ పోర్టుపై అమెరికా దాడి
ఇదిలా ఉంటే అమెరికా తాజాగా చాబహార్ పోర్టుపై కూడా దాడి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. భారత్ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిన ఈ ఓడరేవుపై అమెరికా దాడులు చేయడం. హార్మోజీ జలసంధికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి అభివృద్ధిలో భారత్ కీలక భాగస్వామిగా ఉంది. ఈ దాడి జరిపిన సమయంలో భారీ పేలుళ్లు చోటు చేసుకున్నట్లు వార్తా సంస్థలు చెబుతున్నాయి. అలాగే ఇరాన్ లోని పలు నగరాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు తెలుస్తోంది. అమెరికా జరిపిన తాజా దాడుల్లో బందర్ అబ్బాస్, కోనారక్, బుషెహర్, సిరిక్, క్విష్మ్ దీవుల్లోని ఇరాన్ సైనిక లక్ష్యాలపై కూడా అమెరికా బాంబుల వర్షం కురిపించినట్లు వార్తలు వస్తున్నాయి.
బహ్రెయిన్, ఖతర్, కువైట్‌పై ఇరాన్ మిస్సైళ్లు…
అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ తీవ్రస్థాయిలో స్పందిస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బహ్రెయిన్, ఖతర్, కువైట్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ మిస్సైళ్లతో దాడులు చేస్తోంది. కువైట్‌లోని అలీ అల్ సలేమ్ ఎయిర్ బేస్, బహ్రెయిన్‌లోని యూఎస్ 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయాలపై దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయా దేశాల్లో సైరన్లు మోగడంతో, ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు హెచ్చరించారు. బహ్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మిస్సైళ్లను అడ్డుకుంటున్నాయి.