Tatkal Ticket Booking: IRCTC తత్కాల్ టికెట్ బుకింగ్ ఎలా చేయాలి..నిబంధనలు, చార్జీలు, రీఫండ్ A to Z పూర్తి వివరాలు ఇవిగో..
Tatkal Ticket Booking: IRCTC తత్కాల్ టికెట్ బుకింగ్ ఎలా చేయాలి..నిబంధనలు, చార్జీలు, రీఫండ్ A to Z పూర్తి వివరాలు ఇవిగో..
IRCTC Tatkal Ticket Booking: మీరు రైలు ప్రయాణం చేస్తున్నారా.. అయితే ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవడం అనేది కామన్.. కాని చివరి నిమిషంలో ప్రయాణాలు ఖరారైనప్పుడు ఎలా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు.. అటువంటి సమయంలో మనకు కనిపించే ఒకే ఒక మార్గం. రైలు టికెట్ త్వరగా పొందడానికి తత్కాల్ కోటా.. ఇది అత్యంత ప్రజాదరణ పొందిన మార్గం. తత్కాల్ టికెట్లు చాలా త్వరగా (కొన్ని నిమిషాల్లోనే) అయిపోతాయి కాబట్టి.. సరైన అవగాహనతో ప్రయాణికులు వేగంగా బుక్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఐఆర్‌సీటీసీ (IRCTC) వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా తత్కాల్ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలో ఇక్కడ స్టెప్-బై-స్టెప్ తెలుసుకుందాం.
ముందుగా తత్కాల్ సమయాలు, నిబంధనలు చూసినట్లయితే.. రైలు బయలుదేరే స్టేషన్ నుండి ప్రయాణ తేదీకి ఒక రోజు ముందు తత్కాల్ బుకింగ్స్ ఓపెన్ అవుతాయి.
ఏసీ క్లాస్ (AC Classes – 3A, 2A, CC): ప్రతిరోజు ఉదయం 10:00 గంటలకు బుకింగ్ ప్రారంభమవుతుంది.
నాన్-ఏసీ క్లాస్ (Non-AC – Sleeper, 2S): ప్రతిరోజు ఉదయం 11:00 గంటలకు బుకింగ్ ప్రారంభమవుతుంది.
కొత్త నిబంధనల ప్రకారం.. ఆన్‌లైన్ తత్కాల్ బుకింగ్ కోసం మీ IRCTC ప్రొఫైల్‌కు ఆధార్ కార్డ్ లింక్ అయి ఉండడం తప్పనిసరి. లేదంటే తత్కాల్ బుకింగ్ చేయలేరు. బుకింగ్ సమయంలో ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే OTPని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మొదటి 30 నిమిషాల పాటు ఏజెంట్లకు బుకింగ్స్ అనుమతించరు.
తత్కాల్ బుకింగ్ సమయంలో ప్రయాణికుల వివరాలు టైప్ చేయడానికి సమయం సరిపోదు. అందువల్ల మాస్టర్ లిస్ట్ (Master List) ఫీచర్‌ను ఉపయోగించాలి. బుకింగ్ సమయానికి (9:45 AM లేదా 10:45 AM) ముందే IRCTC యాప్/వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వండి.
My Account -> My Master List లోకి వెళ్లి ప్రయాణించాల్సిన వారి పేర్లు, వయస్సు, ఐడీ కార్డ్ వివరాలను అక్కడ ముందే సేవ్ చేసి పెట్టుకోండి. దీనివల్ల బుకింగ్ సమయంలో ఒకే క్లిక్‌తో వివరాలన్నీ యాడ్ అవుతాయి.
బుకింగ్ చేసుకునే విధానం
స్టెప్ 1 : : ఏసీ టికెట్లకు ఉదయం 9:55 గంటలకు, స్లీపర్ క్లాస్ టికెట్లకు ఉదయం 10:55 గంటలకు IRCTC యాప్ లేదా వెబ్‌సైట్‌లో లాగిన్ అయి సిద్ధంగా ఉండండి.
స్టెప్ 2 : ‘Plan My Journey’ సెక్షన్‌లో ప్రయాణించాల్సిన బోర్డింగ్, డెస్టినేషన్ స్టేషన్లు, మరుసటి రోజు తేదీని ఎంచుకోండి. కోటా (Quota) డ్రాప్‌డౌన్‌లో తప్పనిసరిగా ‘TATKAL’ అని సెలెక్ట్ చేసి Search Trains పై క్లిక్ చేయండి.
స్టెప్ 3: మీకు కావలసిన రైలు కింద ఉన్న క్లాస్ (3A లేదా Sleeper) పై క్లిక్ చేసి రీఫ్రెష్ చేయండి. సీట్లు అందుబాటులో ఉంటే Book Now బటన్ ప్రెస్ చేయండి.
స్టెప్ 4: ప్రయాణికుల వివరాల పేజీలో Add Existing పై క్లిక్ చేసి.. మీరు ముందే మాస్టర్ లిస్ట్‌లో సేవ్ చేసుకున్న ప్రయాణికుల పేర్లను టిక్ చేసి సెలెక్ట్ చేసుకోండి.
స్టెప్ 5: Book only if confirmed berths are allotted (కేవలం కన్ఫర్మ్ బెర్త్‌లు వస్తేనే బుక్ అవ్వాలి) అనే ఆప్షన్‌ను టిక్ చేయండి. దీనివల్ల టికెట్ వెయిటింగ్ లిస్ట్‌లోకి వెళ్లకుండా డబ్బులు రీఫండ్ అవుతాయి.
స్టెప్ 6: ఆధార్ అథెంటికేషన్ కోసం మీ రిజిస్టర్డ్ మొబైల్‌కు వచ్చే OTPని ఎంటర్ చేయండి.
స్టెప్ 7 : తత్కాల్‌లో పేమెంట్ వేగంగా జరగడం చాలా కీలకం. అందుకోసం IRCTC iPay, UPI (BHIM/GPay/PhonePe) లేదా Net Banking విధానాన్ని ఎంచుకోండి. ఎందుకంటే ఇవి వేగంగా పనిచేస్తాయి. OTP ని ఎంటర్ చేసి పేమెంట్ పూర్తి చేయండి. పేమెంట్ విజయవంతం కాగానే మీ కన్ఫర్మ్డ్ తత్కాల్ టికెట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. మీ మొబైల్ నంబర్, ఈమెయిల్‌కు కూడా వివరాలు అందుతాయి.
టికెట్ రద్దు, రీఫండ్ రూల్స్: ఒకవేళ మీ తత్కాల్ టికెట్ కన్ఫర్మ్ (Confirmed) అయితే, దానిని రద్దు చేసుకుంటే రైల్వే నిబంధనల ప్రకారం ఎలాంటి రీఫండ్ (రూపాయి కూడా తిరిగి) రాదు. ఒకవేళ మీ తత్కాల్ టికెట్ వెయిటింగ్ లిస్ట్ (TQWL)లో ఉండి.. చార్ట్ ప్రిపరేషన్ తర్వాత కూడా కన్ఫర్మ్ కాకపోతే ఆ టికెట్ ఆటోమేటిక్‌గా రద్దయి, క్యాన్సిలేషన్ ఛార్జీలు మినహాయించి మిగిలిన మొత్తం మీ ఖాతాలో జమ అవుతుంది. ఈ గైడ్‌లోని సూచనలు పాటిస్తే తత్కాల్ టికెట్ దొరికే అవకాశాలు మెండుగా ఉంటాయి.