Flydubai Pilot Smit Machchhar: ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ దారుణం: 180 మంది ప్రాణాలను కాపాడిన భారత పైలట్ స్మిత్ మచ్చర్.. ప్రశంసల వెల్లువ..
Flydubai Pilot Smit Machchhar
Flydubai Pilot Smit Machchhar: దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. విమానాన్ని హైజాక్ చేయడానికి ప్రయత్నించిన కోపైలట్‌తో భారతీయ ప్రధాన పైలట్ (కెప్టెన్) స్మిత్ మచ్చర్ ప్రాణాలకు తెగించి పోరాడారు. కోపైలట్ జరిపిన తీవ్ర దాడిలో తీవ్రంగా గాయపడి రక్తమోడుతున్నప్పటికీ, స్మిత్ అద్భుత ధైర్యసాహసాలను ప్రదర్శించి కాక్‌పిట్ తలుపులు తెరవడంతో ప్రయాణికులు, సిబ్బంది లోపలికి వచ్చి దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విమానాన్ని సౌదీ అరేబియాలో అత్యవసరంగా ల్యాండింగ్ చేసి 180 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు.
ప్రారంభంలో కోపైలట్ కత్తితో దాడి చేశాడని వార్తలు వచ్చినప్పటికీ, అధికారులు జరిపిన దర్యాప్తులో అత్యవసర సమయంలో ఉపయోగించే క్రాష్ యాక్స్ (గొడ్డలి)తో దాడి చేసినట్లు నిర్ధారణ అయింది. తీవ్రంగా గాయపడిన స్మిత్ మచ్చర్‌కు ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం యూఏఈకి తరలించారు. కాగా, ఈ ఘటనలో కాక్‌పిట్ కంట్రోలర్లను ధ్వంసం చేసేందుకు కోపైలట్ ప్రయత్నించగా.. ఇజ్రాయెల్‌కు చెందిన ప్రయాణికుడు యనివ్ హయున్ సమయస్ఫూర్తితో వ్యవహరించి విమానం కూలిపోకుండా కంట్రోలర్లను లాగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
విధి నిర్వహణలో చూపిన అసాధారణమైన తెగువకు గాను భారత పైలట్ స్మిత్ మచ్చర్‌పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆయనను “రియల్ హీరో”గా అభివర్ణించారు. అద్భుతమైన సహనం, ధైర్యంతో విపత్తును తప్పించారని ప్రధాని మోదీ కొనియాడగా.. గుజరాత్ ప్రభుత్వం స్మిత్‌కు ప్రతిష్టాత్మక ‘విశిష్ట గుజరాత్ గరిమా’ అవార్డును ప్రకటిస్తున్నట్లు తెలిపింది.
ముంబైలోని ఘాట్‌కోపర్‌కు చెందిన స్మిత్ మచ్చర్ న్యూజిలాండ్‌లో కమర్షియల్ పైలట్ లైసెన్స్ పొంది, గురుగ్రామ్‌లో బోయింగ్ 737 శిక్షణ పూర్తి చేశారు. దాదాపు దశాబ్ద కాలం పాటు స్పైస్‌జెట్‌లో పనిచేసిన ఆయన 2022లో ఫ్లైదుబాయ్‌లో చేరారు. నిత్యం ప్రశాంతంగా, వృత్తిపట్ల నిబద్ధతతో ఉండే స్మిత్ చూపిన ఈ ధైర్యసాహసాలు ప్రస్తుతం ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి.
- Pakistan Cosmetics: పాకిస్థాన్ నుంచి అక్రమ దిగుమతులు. రూ.7 లక్షల కాస్మోటిక్స్ సీజ్
- CJP Protest: సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్.. సీజేపీ నిరసనతో ముంబై శివాజీ పార్కు వద్ద తీవ్ర ఉద్రిక్తత.. నటుడు నసీరుద్దీన్ షా హాజరు..
- Karnataka SIR Row: కర్ణాటకలో ‘ఫారం-7’ వివాదం.. ఓటర్ల తొలగింపుపై ఈసీ కార్యాలయం వద్ద సీఎం డీకే శివకుమార్ ధర్నా..
- Jantar Mantar Protest: జంతర్ మంతర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ ప్రతిపక్షాలు ఆందోళన, పలువురు నేతలు అరెస్ట్..
- Auto Fare Hike in Telangana: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. కనీస ఛార్జీ రూ. 30గా ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ