‘లవ్ అండ్ వార్’ ఫస్ట్ లుక్ రిలీజ్
Love and War
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘లవ్ అండ్ వార్’. రణ్‌బీర్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్ వంటి ముగ్గురు స్టార్ హీరోహీరోయిన్లు కలిసి నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రణ్‌బీర్ కపూర్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో రణ్‌బీర్ పూర్తిగా కొత్త లుక్‌లో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. సంజయ్ లీలా భన్సాలీ సినిమాల్లో కనిపించే గ్రాండ్ విజువల్స్, రిచ్‌నెస్ ఈ పోస్టర్లోనూ స్పష్టంగా కనిపిస్తున్నాయి. రణ్‌బీర్ ఇప్పటివరకు కనిపించని కొత్త అవతార్‌లో కనిపించడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. పోస్టర్‌కు జత చేసిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా విజువల్స్‌కు అద్భుతంగా సరిపోయింది. సంగీతం విషయంలో భన్సాలీ మార్క్ మరోసారి కనిపించింది.ఈ పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసిన మేకర్స్ వోహ్ రుత్బా, వోహ్ రౌబ్, వోహ్ జునూన్! అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ‘లవ్ అండ్ వార్’ చిత్రం 2027 జనవరి 21న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రణ్‌బీర్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ విడుదల చేయనున్నారు.
- Bathukamma 2026 Wishes in Telugu: బతుకమ్మ మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షల Wishes తెలియజేయాలని ఉందా..ఈ HD Images మీ కోసం..
- CJP Protest: జంతర్ మంతర్ 2.0పై ఢిల్లీ దిగ్బంధనం.. 38 రైళ్లు రద్దు, 57 మెట్రో స్టేషన్లపై ఆంక్షలు!
- President Droupadi Murmu: ఎన్నికల అక్రమాలకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలని రాష్ట్రపతి కోరారు – రాహుల్ గాంధీ..
- CJP Protest: ఢిల్లీ దిగ్బంధనంపై సుప్రీంకోర్టు అసంతృప్తి.. ఈగను చంపేందుకు పెద్ద సుత్తి వాడొద్దని హితవు…
- CJP Protest: ఢిల్లీలో ఇంటర్నెట్ బంద్.. రేపటి నిరసనల వేళ భారీ భద్రత..రాజధాని అష్ట దిగ్బంధం