‘ఏందయ్య సామీ..’ సాంగ్ రిలీజ్
'Endhayya Saami...' song released.
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ “రణబాలి”. ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై “రణబాలి” సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అక్టోబర్ 16న విజయదశమి పర్వదినం సందర్భంగా “రణబాలి” సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రం నుంచి ‘ఏందయ్య సామీ..’ ఫుల్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ..ఐదు భాషల్లో ఈ పాటను విడుదల చేశారు.
“రణబాలి”లో విజయ్, రశ్మిక పెళ్లి వేడుక సందర్భంగా ‘ఏందయ్య సామీ..’ పాట చిత్రీకరించారు. 19వ శతాబ్దంలో పెళ్లి సందడి ఎంత సంప్రదాయంగా ఉండేదో ‘ఏందయ్య సామీ..’ పాటలో అందంగా రూపొందించారు. ఈ పాటను అజయ్ అతుల్ మెలొడియస్ గా కంపోజ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన లిరిక్స్ అందించగా, శ్వేతా మోహన్, అజయ్ గోగవలే మధురంగా పాడారు. ‘ఏందయ్య సామీ..’ పాట ఎలా ఉందో చూస్తే – ‘ఏందయ్యా సామీ ఇట్ట గాస్తాందీ వెన్నెల, ఊపేస్తా ఉంది సిత్తరాలా ఉయ్యాలా, వీచే గాలికి అత్తరద్దిందెవ్వరు, మారే ఝాముకి మందుపెట్టిందెవ్వరు, మాయదారి మనస్సాగక జాగరమన్నరా…’ అంటూ మళ్లీ మళ్లీ వినాలనిపించేలా సాగుతుందీ పాట.
19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా “రణబాలి” సినిమా రూపొందుతోంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మూవీ లవర్స్ లో ఆసక్తి కలిగిస్తోంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ చిత్ర టీజర్ మూవీపై అంచనాలు మరింతగా పెంచేసింది.
- Bathukamma 2026 Wishes in Telugu: బతుకమ్మ మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షల Wishes తెలియజేయాలని ఉందా..ఈ HD Images మీ కోసం..
- CJP Protest: జంతర్ మంతర్ 2.0పై ఢిల్లీ దిగ్బంధనం.. 38 రైళ్లు రద్దు, 57 మెట్రో స్టేషన్లపై ఆంక్షలు!
- President Droupadi Murmu: ఎన్నికల అక్రమాలకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలని రాష్ట్రపతి కోరారు – రాహుల్ గాంధీ..
- CJP Protest: ఢిల్లీ దిగ్బంధనంపై సుప్రీంకోర్టు అసంతృప్తి.. ఈగను చంపేందుకు పెద్ద సుత్తి వాడొద్దని హితవు…
- CJP Protest: ఢిల్లీలో ఇంటర్నెట్ బంద్.. రేపటి నిరసనల వేళ భారీ భద్రత..రాజధాని అష్ట దిగ్బంధం