UPI Payments పై ఛార్జీలు విధించే బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. మారనున్న చెల్లింపుల విధానం
UPI
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సంచాల నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగా యూపీఐ లావాదేవీలపై ఇకపై చార్జీలు విధించేందుకు మార్గం సుగమం చేస్తూ ఒక బిల్లును లోక్ సభలో ఆమోదించింది. వివరాల్లోకి వెళ్లినట్లయితే యూపీఐ లావాదేవీల పై చార్జీలు విధించే అవకాశం ఉన్న పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టం ఆక్ట్ 2007కు సవరణలు చేస్తూ లోక్ సభలో బిల్లును ప్రవేశపెట్టగా ఈ బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు.ఎలాంటి చర్చ లేకుండానే ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. మన దేశంలో ఇప్పటివరకు యూపీఏ చెల్లింపుల పైన ఎలాంటి చార్జీలు లేవు. అయితే ప్రస్తుతం ఈ చట్టం ప్రవేశపెట్టడం వల్ల భవిష్యత్తులో చార్జీలు విధించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా యూపీఐ అలాగే ఇతర ఎలక్ట్రానిక్ చెల్లింపుల పైన బ్యాంకులు అలాగే పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు చార్జీలు వసూలు చేసేలా ఈ చట్టంలో అవకాశం కల్పించారు.
ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి జీరో మర్చంట్ డిస్కౌంట్ రేట్ అనే విధానంలో పూర్తిస్థాయిలో మార్పులు వచ్చే అవకాశం ఇందులో కనిపిస్తోంది. దీంతోపాటు ప్రధానంగా ఏ పేమెంట్ విధానంపై ఎంత చార్జీ విధించాలి అనే అంశాన్ని ప్రభుత్వం ఆ తర్వాత ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కొత్త చట్టం వెంటనే అమల్లోకి రాదు. దీనికి సంబంధించిన నిబంధనలు త్వరలోనే రూపొందించే అవకాశం ఉంటుంది ఆ తర్వాత మాత్రమే ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం సాధారణ యూపీఏ వినియోగదారులు చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు అనే వార్తలు వస్తున్నాయి. అయితే ఎవరైతే యూపీఐ పేమెంట్స్ ద్వారా ఆదాయం పొందుతున్నారో ఆ సంస్థల పైన భారం వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వార్షిక టర్నోవర్ రూ.1.5 కోట్లకు పైగా ఉన్న వ్యాపారులు మాత్రమే ఈ ఫీజు పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు, డిజిటల్ పేమెంట్ వ్యవస్థలను నిర్వహించే సంస్థలకు స్థిరమైన ఆదాయం కల్పించడమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశమని కేంద్రం తెలిపింది. ప్రస్తుతం క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల ద్వారా జరిగే చెల్లింపులకే మర్చంట్ ఫీజు ఉంది. యూపీఐ లావాదేవీలపై ఇప్పటివరకు అలాంటి ఛార్జీలు లేవు. ఈ బిల్లు ఇంకా చట్టం కాలేదు. రాజ్యసభ ఆమోదం, రాష్ట్రపతి అంగీకారం అనంతరం మాత్రమే ఇది అమల్లోకి వస్తుంది.
- TRAI New Rules: డేటా అవసరం లేని వారికి గుడ్‌న్యూస్.. కేవలం కాల్స్, SMS కోసం తక్కువ కాలపరిమితి రీఛార్జ్‌లు..
- Telangana Rains: తెలంగాణ రాష్ట్రంలో దంచికొట్టనున్న వానలు.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
- Telangana SIR: తెలంగాణలో ఓటర్లకు అలర్ట్.. 43 లక్షల మంది ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం.. స్పందించకపోతే తుది జాబితా నుంచి తొలగింపు
- Andhra Pradesh Rain Alert: ఏపీకి రెడ్ అలర్ట్.. దూసుకొస్తున్న వాయుగుండం.. రేపు రాత్రి విశాఖ–గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశం..
- Khairatabad Ganesh Darshan: భక్తులకు అలర్ట్.. ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం రేపు అర్ధరాత్రి వరకే.. 23 తర్వాత భక్తులకు నో ఎంట్రీ.. 25న నిమజ్జనం..