PAN Card Complete Guide: పాన్ కార్డు గురించి పూర్తి వివరాలు.. A to Z మీ కోసం…
PAN Card Complete Guide
PAN Card అంటే ఏమిటి? :
పాన్ కార్డును పర్మినెంట్ అకౌంట్ నెంబర్ అని పిలుస్తారు. ఇది ఒక ఆల్ఫా న్యూమరిక్ సంఖ్య. ఈ సంఖ్యను భారతీయ పన్ను చెల్లింపుదారులందరికీ గుర్తింపు సంఖ్యగా ఉపయోగిస్తారు. పాన్ కార్డు ద్వారా పనులు చెల్లింపులు చేయవచ్చు. అలాగే మీ లావాదేవీలను ప్రభుత్వం పర్యవేక్షించడానికి తోడ్పడుతుంది. మీరు ఏదైనా ఒక లావాదేవీ ని జరిపినప్పుడు పాన్ కార్డు నెంబర్ కనుక నమోదు చేసినట్లయితే ఆ లావాదేవీ పైన ఆదాయపన్ను శాఖ పర్యవేక్షించడానికి అవకాశం కలుగుతుంది. అందుకే బ్యాంకుల్లో తప్పనిసరిగా పాన్ నెంబర్ అనుసంధానిస్తారు. అంతే కాదు రెండు లక్షల రూపాయల కన్నా ఎక్కువ లావాదేవీలు కనుక అయినట్లయితే తప్పనిసరిగా పాన్ నెంబర్ నమోదు చేయాల్సి ఉంటుంది. అలాగే బంగారం కొనుగోలు చేసినప్పుడు కూడా పరిమితికి మించి బిల్లులు చెల్లించినప్పుడు కూడా పాన్ నెంబర్ నమోదు చేయాలి. . ఇలా మన లావాదేవీలు అన్నింటిని ప్రభుత్వం కను సన్నల్లో చట్టబద్ధంగా జరగాలి అనుకుంటే పాన్ నెంబర్ నమోదు చేయాల్సి ఉంటుంది.
PAN Card ఉపయోగాలు :
పాన్ కార్డుతో అనేక ఉపయోగాలు ఉన్నాయి ముఖ్యంగా మీరు జరిపే ప్రతి లావాదేవీ లోను పాన్ కార్డు అనేది అవసరం అవుతుంది. మీరు బ్యాంకు ఖాతా ఓపెన్ చేయాలనుకున్న ఒక రుణం పొందాలి అనుకున్న లేదా ఒక పెద్ద లావాదేవీ చేయాలి అనుకున్న పాన్ నెంబర్ అనేది తప్పనిసరి. అలాగే పాన్ అనేది ఒక గుర్తింపు కార్డుగా కూడా ఉపయోగపడుతుంది. పాన్ కార్డు లేకుండా పలు ఆర్థిక కార్యకలాపాలను జరపడం దాదాపు అసాధ్యం అవుతుంది. ముఖ్యంగా బ్యాంకు ఎకౌంటు ఓపెన్ చేయడానికి పాన్ కార్డు అనేది తప్పనిసరి. దీంతో పాటు పాన్ కార్డును పలు ఆర్థిక కార్యకలాపాలకు ఉపయోగిస్తాము.
PAN Card కోసం ఎలా అప్లై చేయాలి? :
పాన్ కార్డును మీరు రెండు రకాలుగా అప్లై చేసుకోవచ్చు ఒకటి ఆన్లైన్ ద్వారా రెండోది ఆఫ్ లైన్ ద్వారా. ఆఫ్ లైన్ ద్వారా అయినట్లయితే మీరు సమీపంలో ఉన్నటువంటి కామన్ సర్వీస్ సెంటర్ లేదా పాన్ నమోదు కేంద్రం, మీసేవ కేంద్రాల్లో పాన్ కార్డు సర్వీసులను పొందవచ్చు. పన్ను చెల్లించగలిగే ఆదాయం ఉన్న ప్రతి భారతీయ పౌరుడు పాన్ కార్డు పొందవచ్చు. పాన్ కార్డు రెండు రకాలుగా ఉంటుంది ఒకటి పౌరులకు ఇచ్చే పాన్ కార్డు రెండోది సంస్థలకు ఇచ్చే పాన్ కార్డు. పాన్ కార్డు అనేది ఒక ఆల్ఫా న్యూమరిక్ నెంబర్. ఈ నెంబర్లో ఆల్ఫాబెట్స్ తో పాటు కొన్ని నెంబర్లు కూడా ఉంటాయి.
e-PAN అంటే ఏమిటి? :
ఎలక్ట్రానిక్ పాన్ కార్డును ఈ పాన్ అని పిలుస్తారు ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం అని పిలుస్తారు ఆన్లైన్ లావాదేవీల చెల్లింపులకు కూడా ఈ పాన్ సమర్పించవచ్చు.
PAN Card Correction :
పాన్ కార్డులో కొన్నిసార్లు పేరు కరెక్షన్ కనుక చేయాల్సి ఉన్నట్లయితే సరైన ఆధారాలను డాక్యుమెంట్లను సబ్మిట్ చేయడం ద్వారా మీ పేరు కరెక్షన్ అనేది చేయవచ్చు. ఒకవేళ మీరు పేరు కరెక్షన్ చేయాలి అనుకున్నట్లయితే పదో తరగతి సర్టిఫికెట్, లేదా గెజిట్ సర్టిఫికెట్ నోటిఫికేషన్, లేదా పాస్పోర్ట్ అవసరం అవుతాయి. లేదంటే బర్త్ సర్టిఫికెట్ కు సబ్మిట్ చేయడం ద్వారా కూడా పాన్ కార్డు కరెక్షన్ చేయవచ్చు. సాధారణంగా మహిళలు వివాహం జరిగిన తర్వాత తమ భర్త ఇంటి పేరును నమోదు చేయడానికి కూడా పాన్ కార్డులో కరెక్షన్ చేసుకుంటారు.
PAN-Aadhaar Linking :
పాన్ కార్డుతో ఆధార్ సైతం లింక్ చేయడం తప్పనిసరి లేకపోతే ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం కుదరదు. . పాన్ ఆధార్ లింకింగ్ కనుక జరగకపోతే తగిన రుసుము చెల్లించి మీ పాన్ నెంబర్ తో ఆధార్ కార్డును జత చేసుకోవచ్చు.
PAN Card పోతే? :
ఒకవేళ మీరు పాన్ కార్డు కనుక పోగొట్టుకున్నట్లయితే మీ వద్ద పాన్ నెంబర్ గుర్తున్నట్లయితే వెంటనే మీ సమీపంలో ఉన్నటువంటి కామన్ సర్వీస్ సెంటర్ వద్దకు వెళ్లి కావలసిన వివరాలను డాక్యుమెంట్లను నమోదు చేసి పాన్ నెంబర్ పొందవచ్చు.