Lift Horror in Ongole: వీడియో ఇదిగో.. లిఫ్ట్ వాడే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండండి.. తలుపులు తెరిచి ఉండగానే కదిలిన లిఫ్ట్.. తీవ్ర గాయాలతో మహిళ మృతి..
Lift Horror in Ongole
Lift Horror in Ongole:: ఏపీలోని ప్రకాశం జిల్లాలోని ఒక నివాస సముదాయంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తలుపులు తెరుచుకుని ఉన్న సమయంలోనే లిఫ్ట్ అకస్మాత్తుగా కిందకు కదలడంతో 50 ఏళ్ల వనిత అనే మహిళ తీవ్రంగా గాయపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. బాధితురాలు వనిత తన కుమార్తె, మనవడితో కలిసి అపార్ట్‌మెంట్ లిఫ్టులోకి వెళ్లారు. వారిద్దరూ లిఫ్ట్ నుండి బయటకు రాగా.. వనిత బయటకు అడుగు వేస్తున్న సమయంలోనే లిఫ్ట్ తలుపులు తెరిచి ఉన్నప్పటికీ హఠాత్తుగా కిందకు కదిలింది. ప్రమాదాన్ని గ్రహించి తప్పించుకోవడానికి ఆమె ప్రయత్నించినప్పటికీ.. కదులుతున్న ఎలివేటర్‌లో చిక్కుకుపోయి తీవ్రంగా గాయపడ్డారు.
వెంటనే స్పందించిన అపార్ట్‌మెంట్ నివాసితులు ఆమెను రక్షించి.. అత్యవసర చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె పరిస్థితి క్షీణించడంతో.. చికిత్స ఫలించక మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన స్థానిక నివాస భవనాల్లో ఉన్న లిఫ్టుల నిర్వహణ, భద్రతా ప్రమాణాల తీరుపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది. లిఫ్ట్ అకస్మాత్తుగా కదలడానికి గల సాంకేతిక కారణాలు ఇంకా తెలియనప్పటికీ.. నిర్వహణ లోపం ఉందా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
- వైసీపీకి బిగ్ షాక్.. బొత్స మేనల్లుడు చిన్న శ్రీను రాజీనామా
- Telangana Political Row: కేటీఆర్,హరీష్ రావు విడుదల.. రేవంత్ సర్కారుపై ధ్వజమెత్తిన బీఆర్ఎస్ నేతలు..
- Telangana Assembly Session: బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలకు ఊరట.. రిమాండ్‌ను తిరస్కరించిన నాంపల్లి కోర్టు!
- Saudi Arabia’s Water Miracle: నదులు లేకపోయినా కోట్ల మందికి మంచి నీరు ఎలా.. సౌదీ అరేబియా వాటర్ సప్లై వెనుక అసలు రహస్యం..
- Eiffel Tower: ఈఫిల్ టవర్ వద్ద లింగ వివక్ష వివాదం.. మహిళా ఉద్యోగులను పక్కకు తప్పించడంపై సిబ్బంది ఆగ్రహం..