Skip to content
తెలంగాణ › వార్తలు

కవితకు మంత్రి సీతక్క బహిరంగ క్షమాపణ.. కారణం ఇదే..

Krishna Rao 25 Nov 2026 0 నిమిషాల పఠనం తెలంగాణ
కవితకు మంత్రి సీతక్క బహిరంగ క్షమాపణ.. కారణం ఇదే..

కవితకు మంత్రి సీతక్క బహిరంగ క్షమాపణ.. కారణం ఇదే..

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురించి మాట్లాడే క్రమంలో అనుకోకుండా ‘ఎయిడ్స్’ అనే పదం ఉపయోగించానని తెలంగాణ మంత్రి సీతక్క వివరణ ఇచ్చారు. ఆ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేసినవి కావని స్పష్టం చేశారు. తన మాటల వల్ల కవిత బాధపడితే చింతిస్తున్నానని, ఆ పదాన్ని బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నానని తెలిపారు.

ములుగులో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన సందర్భంగా ఒంటరి మహిళల పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాలతో పాటు ఎయిడ్స్, డయాలసిస్ బాధితులకు అందిస్తున్న సహాయంపై చర్చించినట్లు సీతక్క వివరించారు. ఇదే క్రమంలో వరంగల్‌లో కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను ఖండించే సమయంలో కవిత గురించి ప్రస్తావన వచ్చిందన్నారు.

కవితను క్యాన్సర్ పేషెంట్‌గా చిత్రీకరించారని, ఆమెకు క్యాన్సర్ వచ్చిందంటూ ప్రచారం చేశారని చెప్పే క్రమంలో అనుకోకుండా ‘ఎయిడ్స్’ అనే పదం తన నోటి నుంచి వచ్చిందని తెలిపారు.

ఉద్దేశపూర్వకంగా అన్న మాటలు కావు..

కవితను ఉద్దేశించి తాను ఆ పదాన్ని కావాలని ఉపయోగించలేదని సీతక్క స్పష్టం చేశారు. ఆ సమయంలో పెన్షన్ల గురించి, ఎయిడ్స్ బాధితుల గురించి మాట్లాడుతుండటంతో క్యాన్సర్ అనే పదానికి బదులుగా ఎయిడ్స్ అనే పదం పొరపాటున దొర్లిందని వివరించారు.

తన వ్యాఖ్యల వల్ల కవిత బాధపడితే చింతిస్తున్నానని, ఆ పదాన్ని బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నానని తెలిపారు.

కవితపై ట్రోలింగ్ చేయడం సరికాదు..

తన వ్యాఖ్యలను బీఆర్ఎస్ నాయకులు ఉద్దేశపూర్వకంగా వక్రీకరిస్తూ కవితపై పదేపదే ట్రోలింగ్ చేయడం వారి రాజకీయ సంస్కృతిని చూపిస్తోందని సీతక్క విమర్శించారు. కవితను క్యాన్సర్ పేషెంట్‌గా ప్రచారం చేశారనే అంశాన్ని ప్రస్తావించడమే తన ఉద్దేశమని, అనుకోకుండా దొర్లిన పదాన్ని రాజకీయంగా వాడుకోవడం సరికాదన్నారు.

కవిత గారికి తనపై ఎలాంటి అపార్థం ఉండకూడదని, ఆమెను బాధపెట్టే ఉద్దేశం తనకు లేదని సీతక్క మరోసారి స్పష్టం చేశారు.

ట్యాగ్‌లు: Telangana