Sohrabuddin Case: మోదీ జైలుకు వెళ్లకుండా అడ్డుకున్నది కాంగ్రెస్ నేతలే.. సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసులో ఎప్పుడో వెళ్లేవారు.. వీరప్ప మొయిలీ సంచలన వ్యాఖ్యలు..
Veerappa Moily and Modi
Sohrabuddin Case: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ సొహ్రాబుద్దీన్ నకిలీ ఎన్‌కౌంటర్ కేసు దర్యాప్తు విషయంలో సొంత పార్టీ నేతలపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీపై దర్యాప్తును నాటి కాంగ్రెస్‌కు చెందిన కొందరు నాయకులే అడ్డుకున్నారని, ఆయన జైలుకు వెళ్లకుండా కాపాడారని మొయిలీ ఆరోపించారు.
బెంగళూరులోని కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) కార్యాలయంలో జరిగిన సోనియా గాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకావిష్కరణ సభలో మాట్లాడుతూ వీరప్ప మొయిలీ ఈ వ్యాఖ్యలు చేశారు. 2009 నుండి 2011 మధ్య యూపీఏ ప్రభుత్వ హయాంలో తాను కేంద్ర న్యాయ శాఖ మంత్రిగా పనిచేసిన నాటి పరిణామాలను ఆయన ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. సొంత పార్టీ నేతలు చేసిన ఆ తప్పిదం కారణంగానే నేడు కాంగ్రెస్ పార్టీ తీవ్ర మూల్యం చెల్లించుకుంటోందని, తాము ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని మొయిలీ అభిప్రాయపడ్డారు.