నాగరికతలను వైవిధ్యభరితం చేసిన రహదారులు
Union Cabinet Approves Major National Highway Expansion Project in Telangana
ఐ.ప్రసాదరావు
ప్రపంచ దేశాలను కలిపేవి రహదారులే అని చరిత్ర చెబుతుంది.. అదే విషయం మన భారతదేశానికి వర్తిస్తుంది అనుటలో సందేహం లేదు… ముఖ్యంగా మన భారతదేశాన్ని అనేక దేశాలతో ముడిపడేటట్లు చేసింది రహదారులు ద్వారా జరిగిన వర్తక వాణిజ్య సంబంధాలు అని గ్రహించాలి.. అనాడే సుగంధ ద్రవ్యాలు, విలువైన రాళ్ళు, వస్త్రాలు మనదేశం నుంచి ఇతర దేశాలకు ఎగుమతులు చేయడం ప్రారంభమైంది.. సముద్ర మార్గాలు, భూతల మార్గాలు, పర్వత శ్రేణులు వెంబడి, నదీ పరివాహక ప్రాంతాల నుంచి వర్తక వ్యాపారాలు చేస్తూ మనదేశం వివిధ ఆసియా దేశాలతో, మెడిటరేనియన్ ప్రాంతాలతో, రోమ్, ఇరాన్, చైనా, శ్రీలంక ఇలా పలు దేశాలతో సంబంధాలు కలిగి ఉంది.. దీంతో వివిధ దేశాల సంస్కృతి సంప్రదాయాలు, భాషలు, మత విశ్వాసా లు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, నూతన ఆవిష్కరణలు వంటివి మనదేశంలో ప్రవేశించాయి.. మన భారతదేశం యొక్క భౌగోళిక పరిస్థితులు, హిందూ మహాసముద్రం వంటి సానుకూల అంశాలు మధ్య ఆసియా, పశ్చిమ ఆసియా, సౌత్ ఈస్ట్ ఆసియా వంటి దేశాలతో అంతర్జాతీయంగా వర్తక వ్యాపారాలు చేయడానికి కేంద్రంగా మారింది.. మనదేశంలో ఉన్న సారవంతమైన నేల, వివిధ రకాల పంటలు, నైపుణ్యాలు కలిగిన కళాకారులు, చేతి వృత్తుల వారు, పట్టణ ప్రాంతాలు, సముద్ర తీరప్రాంతం మనదేశాన్ని వ్యాపార పరంగా కీలకంగా మార్చింది.. మనదేశంలో లోని ఉత్తర భారతదేశంలోని రహదారులు భారత ఉపఖండం మరియు సెంట్రల్ ఆసియా వరకూ విస్తరించి ఆనాడే అతిపెద్ద వర్తక వాణిజ్య రహదారిగా పేరు గాంచింది.. ఈ మార్గాల్లోనే తక్షశిల, మధుర, వారణాసి, పాటలీపుత్రం మహానగరాలు అభివృద్ధి చెందడం జరిగింది.. ఈ పట్టణాలు ద్వారానే వర్తకులు వ్యవసాయ ఉత్పత్తులు, విలువైన రాళ్ళు, వస్త్రాలు రవాణా చేయడం జరిగేది.. ప్రస్తుతం పాకిస్థాన్ లో ఉన్న ఆనాటి మన తక్షశిల నగరం చాలా ప్రముఖ నగరంగా ప్రసిద్ధి చెంది, మనదేశాన్ని సెంట్రల్ ఆసియా తోనూ, ఇరాన్ వంటి దేశాలతో ముడివేసినది.. అనగా ఒక పెద్ద జంక్షన్ వలే వర్ధిల్లింది..ఈ తక్షశిల నగరం కేవలం వ్యాపార పరంగానే కాకుండా, పెద్ద విద్యా కేంద్రంగా విరాజిల్లి, ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది విద్యార్థులను ఆకర్షించింది.. ఇక దక్షిణ భారత రహదారులు దక్కన్ ప్రాంతా న్ని, సముద్ర తీర ప్రాంతాలను కలుపుతూ అనేక రకాలుగా దేశాభివృద్ధికి కీలకంగా మారాయి..
ఇక ఈనాటికీ ప్రముఖ స్థానం పొందిన ‘సిల్క్ రూట్’ మనదేశాన్ని ఇతర ప్రాంతాలతో కలపడమే కాకుండా, తూర్పు ఆసియాను సెంట్రల్ ఆసియాతో సముద్ర మార్గాలు ద్వారా కలపడంలో ప్రముఖ స్థానం పొందింది.. అలాగే పశ్చిమ ఆసియాను మెడిటరేనియన్ ప్రాంతాలతో కలపడం లో కీలక పాత్ర పోషించింది.. ముఖ్యంగా భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య కేంద్రంగా విరాజిల్లడానికి ఈ సిల్క్ రూట్ తోడ్పడింది.. ఇక గాంధార ప్రాంతం వర్తక వాణిజ్యాని కే కాకుండా సాంస్కృతిక కళా సంపదకు నెలవైంది.. పట్టు, వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు విలువైన రాళ్ళు వర్తకం జరిగేది.. ఇదే సమయంలో భారత వర్తకులు సెంట్రల్ ఆసియా, ఇతర దేశాలకు వాణిజ్యం విస్తరించారు.. ఇదే మార్గాలు ద్వారా భారతదేశం నుంచి అనేకమంది బౌద్ధ సన్యాసులు బౌద్ధ మతాన్ని చైనా వంటి ఇతర దేశాలకు వ్యాప్తి చేసారు..మాంటిసోరి, ఇతర మతపరమైన సంస్థలు ఏర్పాటు చేశారు.. ముఖ్యంగా ‘గాంధార శిల్పం’ వంటి ప్రత్యేక కళలు భారత నిర్మాణాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది..
ఇదే సమయంలో సముద్ర మార్గాలు అభివృద్ధి చెందడం జరిగింది.. బారూచి, సొపారా, ముజ్రిస్ వంటి పోర్టులు ద్వారా వర్తక వాణిజ్యాలు జోరు అందుకున్నాయి. మన దేశంలోని వ్యాపారస్తులను అరేబియా ప్రాంతాల్లో, తూర్పు ఆఫ్రికా, ఈజిప్టు, శ్రీలంక, సౌత్ ఈస్ట్ ఆసియా ప్రాంతాలకు వెళ్లి, వ్యాపారం విస్తరింపచేయడానికి దోహదం చేసాయి.. మనదేశంలోని పశ్చిమ తీరం రోమన్ సామ్రాజ్యంతో బలమైన వర్తక వాణిజ్యాలకు తోడ్పడింది..మన దేశం నుంచి ఎగుమతి అయ్యే నల్ల మిరియాలు, సుగంధ ద్రవ్యాలు, ముత్యాలు, విలువైన రాళ్ళు, ఏనుగు దంతాలతో తయారైన వస్తువులు, చేనేత వస్త్రాలకు మెడిటరేనియన్ ప్రాంతాల్లో మంచి గిరాకీ పెరిగింది..మన వర్తకులు అక్కడ ఇటువంటి ఉత్పత్తులు అమ్ముకుని, తిరుగు ప్రయాణంలో మనదేశానికి అక్కడ తయారైన మద్యం, గాజు వస్తువులు, బంగారం , వెండి వంటివి తీసుకుని వచ్చి, ఇక్కడ అమ్మేవారు.. కేరళ మలబారు ప్రాంతంలో ఉన్న ముజ్రీస్ సుగంధ ద్రవ్యాల ఎగుమతికి ప్రసిద్ధ కేంద్రంగా వర్ధిల్లింది.. మనదేశంలో లభ్యమైన రోమన్ నాణేలు ద్వారా ఆనాటి విషయాలు తెలుస్తున్నాయి..
పవన దిశను బట్టి ప్రయాణం చేయడం ఆనాడే ప్రపంచ ప్రసిద్ధి చెందింది.. హిందూ మహాసముద్రం మీదుగా ప్రయాణం సులభతరం చేసింది. ఎర్ర సముద్రం, అరేబియన్ కోస్ట్ ప్రాంతాలను భారత పోర్టులు మధ్య ప్రయాణం సులభతరం అవడం జరిగింది.. వ్యాపారం, సంస్కృతి సాంప్రదాయాలు, మత విశ్వాసాలు వంటివి వేగంగా మనదేశంలో విస్తరించాయి.. అలాగే తూర్పు తీర సముద్ర మార్గాలు కూడా మనదేశాన్ని మలేషియా, ఇండోనేషియా, శ్రీలంక, థాయ్ లాండ్, కాంబోడియా, వియత్నాం వంటి దేశాలతో అనేక రంగాల్లో ముడివేసింది.మన భారత్ సాంస్కృతిక కళా రంగం లో, అదే విధంగా ఆయా దేశాల్లో మన సంస్కృతి సాంప్రదాయాలు, దేవాలయాల నిర్మాణాలు మత విశ్వాసాలు వంటివి ప్రభావితం అయ్యాయి అని అనేక శాసనాలు చెబుతున్నాయి..